BHAGAVAD GITA QUOTES: భగవద్గీతలోని ఈ వాక్యాలు ప్రేమకు, కర్మకు ప్రతిరూపం..!

Bhagavad Gita Quotes: భగవద్గీత హిందువుల‌ పవిత్ర గ్రంథం. సాధారణంగా భారతీయులందరికీ భగవద్గీత గురించి తెలుసు. ఇందులో పేర్కొన్న అంశాల కార‌ణంగా ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చాలా మంది భగవద్గీతలోని సూత్రాలను అనుసరించడానికి ఇష్టపడతారు.

హిందూ మతంలో అనేక పవిత్రమైన, మతపరమైన గ్రంథాలు ఉన్నాయి. వీటిలో దైవిక సాహిత్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ భగవద్గీత ఉంది. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ధ‌ర్మ బోధ‌ సారాంశం ఈ ఇందులో ఉంది. శ్రీమద్భగవద్గీత పఠించి, అందులో పేర్కొన్న విషయాలను అనుసరించే వ్యక్తి జీవితాంతం దుఃఖాలు, చింతలు లేకుండా ఉంటాడు.

Also Read : గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి మనస్సు కలత చెందింది. తన ర‌క్త‌ సంబంధీకుల‌తో ఎలా పోరాడాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. అప్పుడు దిక్కుతోచని అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు అతనికి భ‌గ‌వ‌ద్గీత అనే పరమ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రతి ఒక్కరూ శ్రీమద్భగవద్గీతను హృదయపూర్వకంగా పఠించాలి. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఏకేశ్వరోపాసన, కర్మయోగం, జ్ఞానయోగం మరియు భక్తి యోగం గురించి వివరంగా చర్చించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రేమ, జీవితం, కర్మ గురించి చాలా సమాచారం ఇచ్చాడు. భ‌గ‌వ‌ద్గీత‌లో పేర్కొన్న‌ ముఖ్యమైన 9 వాక్యాలు ఇప్పుడు చూద్దాం.

1. ఏది జ‌రిగినా మంచిదే. ఏం జరిగినా అది మంచికే జరుగుతోంది. ఏది జరిగినా అది మంచికే జరుగుతుంది.

2. మీకు పని చేసే హక్కు ఉంది, కానీ ఫలితాన్నిఆశించే హక్కు ఎప్పుడూ ఉండదు.

3. మార్పు అనేది విశ్వం యొక్క స‌హ‌జ ల‌క్ష‌ణం. మీరు క్షణంలో కోటీశ్వరులు లేదా పేదవారు కావచ్చు.

4. కామం, క్రోధం, దురాశ అనేవి ఒక వ్యక్తి స్వీయ-నాశనానికి సంబంధించిన మూడు ద్వారాలు. ఈ మూడింటిని త్యజించినప్పుడే మనిషి స్వర్గాన్ని పొందుతాడు.

5. మరొకరిని అనురించి విజయం సాధించడం కంటే స్వీయ ధ‌ర్మాన్ని పాటిస్తూ కృషి చేయడం ఉత్తమం. సొంత ధ‌ర్మాన్ని అనుసరించడం వల్ల కోల్పోయేది ఏమీ ఉండ‌దు, కానీ మరొకరి ధ‌ర్మం పోటీ భయం, అభద్రతను సృష్టిస్తుంది.

6. ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు అందరికీ సమాన గౌరవాన్ని ఇస్తాడు, సమాన గౌరవాన్ని పొందుతాడు. అతను ఆధ్యాత్మిక అభిలాషి . ఏనుగు, ఆవు, కుక్క వంటి ప్రతి జీవికి గౌరవం ఇవ్వాలనుకుంటాడు.

7. మీకు శాంతిని కలిగించే సమతుల్య జీవితాన్ని గడపండి.

8. జీవితాన్ని గడపడానికి ప్రేమ, సహనం, నిస్వార్థాన్ని అలవర్చుకోవాలి.

9. ప‌నిలో నిష్క్రియతను, నిష్క్రియాత్మకతలో ప‌నిని చూసేవాడు పురుషులలో తెలివైనవాడు.

Also Read : మహాభారత యుద్ధంలో మరణించని కౌరవ‌వీరుడు ఒక్కడే..!

భగవద్గీతలోని ఈ వాక్యాలు మనకు ప్రేమ, కర్మల గురించి తెలిసేలా చేస్తాయి. అంతేకాకుండా జీవితం అంటే ఏమిటో కూడా మనకు అర్థమయ్యేలా చేస్తాయి. ఈ వాక్యాల‌ను అనుసరించడం ద్వారా మనం మెరుగైన జీవితాన్ని గడపవచ్చు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

2023-06-08T02:37:25Z dg43tfdfdgfd