కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైనవారు. వారి ఐక్యూ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
న్యూమరాలజీ మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ న్యూమరాలజీ ప్రకారం మన పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం, ప్రవర్తన, భవిష్యత్తు తెలుసుకోవచ్చు. మనం పుట్టిన తేదీ మన తెలివి తేటలను కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైనవారు. వారి ఐక్యూ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, సమాజానికి మార్గనిర్దేశం చేస్తారు. చాలా ఎక్కువ మంచి లక్షణాలు ఉంటే ఆ స్పెషల్ తేదీలేంటో చూసేద్దామా...
ఏ నెలలో అయినా 1 వ తేదీలో జన్మించిన వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు చాలా కొత్త ఆలోచనలు చేస్తారు. వీరి ఆలోచనలపై వీరికి నమ్మకం చాలా ఎక్కువ. లక్ష్యంపై ఫోకస్ కూడా చాలా ఎక్కువ.ఇతరులను ప్రభావితం చేసే శక్తి వీరిలో ఉంటుంది. వీరికి తెలివి తేటలు చాలా ఎక్కువ. ప్రాక్టికల్ మైండ్ తో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించగలరు.
5వ తేదీలో జన్మించినవారికి తెలివి తేటలు చాలా ఎక్కువ.ఏదైనా తొందరగా నేర్చుకోగల శక్తి వీరిలో ఉంది. కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తూ, వారి ప్రయోగాత్మక పద్ధతులు వారికి విజయాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా.. అందులో విజయం సాధించగల సత్తా ఉంటుంది.
ఏ నెలలో అయినా 14 తేదీల్లో జన్మించిన వారు ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వారు విశ్లేషణాత్మక దృష్టి, ప్రణాళికాత్మక ఆలోచన, క్లిష్ట పరిస్థితుల్లోనూ స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగి ఉంటారు. వీరు ఉపాధ్యాయులుగా, మెంటర్లుగా, మార్గదర్శకులుగా రాణించగలరు.
22 నంబర్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీనిని "మాస్టర్ బిల్డర్" నంబర్‌గా పిలుస్తారు. ఈ తేదీలో జన్మించిన వారు దార్శనికత, ఆచరణాత్మకత, సమర్థత మూడింటినీ సమపాళ్లలో కలిగి ఉంటారు. వారు పెద్ద ప్రాజెక్టులు లేదా లక్ష్యాలను స్థిరమైన ప్రణాళికతో పూర్తి చేస్తారు. అటు జీవితంలో, ఇటు వృత్తిపరంగా మంచి ఫలితాలను సాధిస్తారు.
ఈ తేదీల్లో జన్మించినవారు సహజంగా తెలివిగలవారు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రతిభ పుట్టిన తేదీతో పాటు ప్రయత్నం, కృషి, శ్రమ, ఆత్మవిశ్వాసంతో పెరుగుతుంది. మీరు కూడా ఈ తేదీల్లో పుట్టి ఉంటే, మీ ప్రతిభను పూర్తి స్థాయిలో వికసించేందుకు అవకాశాలను వినియోగించుకోండి.
2025-06-10T11:33:56Z