BUDH GOCHAR : బుధుడు, బృహస్పతి కలయికతో ఈ రాశులవారికి జీవితం మారబోతోంది, భారీ లాభాలే లాభాలు!

Budh Gochar In 2023: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే అన్ని గ్రహాలు ఎదో ఒక సమయంలో సంచారం చేస్తాయి. ఈ సంచార క్రమంలో రాశులవారి జీవితాల్లో మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో శుభప్రదంగా కూడా మారే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బుధ గ్రహం సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బుధుడు ఇప్పుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేశాడు. దీని కారణంగా పలు రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు జరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా శుభప్రదంగా కూడా మారే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ రాశుల వారికి ఊహించని లాభాలు:

వృషభం:

ఈ క్రమంలో బుధుడు, బృహస్పతి వృషభంలో కలుస్తారు. ఈ కలయిక 11 స్థానంలో జరిగింది. కాబట్టి వృషభ రాశి వారి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వృషభ రాశివారు చాలా అదృష్టాని పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అకస్మాత్తుగా ఎక్కడి నుండైనా డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కుటుంబంలో, సమాజంలో గౌరవం లభిస్తుంది.

మిథునరాశి:

మిథునరాశి వారికి 11 స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. దీంతో మిథునరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు కలుగుతాయి. వీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపారంలో కూడా స్థిరమైన అభివృద్ధి ఉంటుంది.

వృశ్చికరాశి:

వృశ్చికరాశి కూడా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బృహస్పతి-బుధ సంయోగం వీరి సృజనాత్మకత పెరుగుతుంది.  ముఖ్యంగా రచయితలు, ఎంటర్‌టైనర్లు, డిజైనర్లు,  సంగీత దర్శకులకు ఇది సరైన సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా ఈ రాశివారు కొత్త ఉద్యోగాలు పొందే ఛాన్స్‌ ఉంది.

ధనుస్సు రాశి:

రేవతి నక్షత్రంలో ఈ సంచారం ఏర్పడబోతోంది.. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ఈ రాశివారు ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

కుంభ రాశి:

బుధుడు, బృహస్పతి కలయిక వల్ల కుంభ రాశివారికి  తెలివితేటలు పెరుగుతాయి. వీరు చాకచక్యంతో అన్ని రకాల పనులు సులభంగా చేస్తారు. వ్యాపార రంగంలో ఈ రాశివారు ఈ వారం చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశివారికి సంచారం కారణంగా భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2023-03-28T05:08:57Z dg43tfdfdgfd