BUDH UDAY 2023: మీనరాశిలో ఉదయించబోతున్న బుధుడు... మార్చి 27 నుండి ఈ రాశులకు డబ్బే డబ్బు..

Mercury Uday In Pisces 2023:  వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. వ్యాపారం మరియు తెలివితేటలను ఇచ్చే బుధుడు మార్చి 27న మీనరాశిలో ఉదయించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

కర్కాటక రాశిచక్రం

కర్కాటక రాశి వారికి బుధుడు ఉదయించడం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి అదృష్ట గృహంలో ఉదయించబోతోంది. అందుకే మీరు ఈ సమయంలో అదృష్టాన్ని పొందుతారు. వ్యాపారస్తులు మంచి లాభాలు వస్తాయి. మీరు ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.  

వృశ్చిక రాశిచక్రం

మెర్క్యురీ గ్రహం యొక్క  పెరుగుదల మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఉదయించబోతోంది. దీంతో దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆఫీసులో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 

ధనుస్సు రాశిచక్రం

బుధుడి ఉదయం ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఉదయించబోతోంది. దీని వల్ల మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా కారు లేదా ల్యాండ్ కొనే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. పుడ్, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన వ్యాపారం చేసేవారు భారీగా లాభపడతారు. 

Also read: Ugadi 2023: ఉగాది నాడు మూడు రాజయోగాలు.. ఈ 4 రాశులకు పెరగనున్న ఆదాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-03-18T14:03:14Z dg43tfdfdgfd