BUTTERMILK CAUTIONS: మజ్జిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా, ఎప్పుడు తాగితే మంచిది

Buttermilk Cautions: వేసవిలో ఎప్పుడూ దాహం తీర్చుకునేందుకు చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా మజ్జిగ సేవనం అధికంగా ఉంటుంది. కారణం ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉండటమే. అయితే మజ్దిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా మీకు..పూర్తి వివరాలు మీ కోసం..

నిస్సందేహంగా మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేసే అద్బుతమైన పానీయం. శరీరం వేడి చేయకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వేసవిలో చాలా మంచిది. అద్భుతమైన పోషక గుణాలుండటంతో ఆరోగ్యపరంగా చాలా మంచిది. అయితే మజ్జిగను ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదంటారు న్యూట్రిషియనిస్టులు. మజ్జిగ తాగేందుకు కూడా ఓ నిర్ధారిత సమయం ఉంటుందిట. ఎందుకంటే వేళాపాళాలేకుండా మజ్జిగ తాగితే ప్రయోజనాలకు బదులు హాని చేకూరుతుంది. వేసవిలో సాధారణంగా చల్లని పానీయాలు తాగాలని లేదా ఏసీ వాతావరణంలో ఉండాలని ఉంటుంది. డ్రింక్స్, మజ్జిగ అధికంగా తీసుకుంటుంటారు. చాలామందికి భోజనం తరువాత మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది. మజ్జిగ కడుపులో చలవ చేస్తుంది. వేసవిలో ఒక హెల్తీ డ్రింక్‌గా చెప్పవచ్చు. ప్రతి రోజూ మజ్జిగ తాగడం వల్ల పలు వ్యాధుల్నించి కూడా సంరక్షించుకోవచ్చు.

మజ్జిగతో ప్రేవులు ఆరోగ్యంగా ఉంటాయి. మలబద్ధకం సమస్య పోతుంది. అదే సమయంలో రోజుకు మనిషి శరీరానికి కావల్సిన నీటి పరిమాణం తీరుతుంది. మజ్జిగలో పొటాషియం, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా అధికంగా ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా ఇన్ని ప్రయోజనాలున్నా సరే..మజ్జిగ తాగడానికి ఓ సమయం సందర్భం ఉండాలంటారు వైద్యులు. ఎప్పుడు పడితే అప్పుడు తాగితే ఆరోగ్యపరంగా నష్టం కలుగుతుంది. మరి ఏ సమయంలో తాగాలనే వివరాలు తెలుసుకుందాం..

పగటి సమయంలో మజ్జిగ ఎప్పుడైనా ఏ సమయంలోనైనా తాగవచ్చు. మజ్జిగ తీసుకునే సమయాన్ని బట్టి ప్రయోజనాలు కూడా మారుతుంటాయి. మద్యాహ్నం భోజనం తరువాత తాగితే అధిక ప్రయోజనాలు కలుగుతాయంటారు వైద్య నిపుణులు. మద్యాహ్నం లంచ్ తరువాత మజ్జిగ తాగడం వల్ల కడుపుకు ఎక్కువ లాభాలుంటాయి. మజ్జిగలో ఉండే హెల్తీ బ్యాక్టీరియా, ల్యాక్టిక్ యాసిడ్ అనేవి జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు సహాయపడతాయి. దాంతోపాటే శరీరం మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ప్రతిరోజూ భోజనానంతరం ఓ గ్లాసు మజ్జిగ తప్పకుండా తాగడం మంచి అలవాటు.

Also read; Parboiled Rice Benefits: పారాబాయిల్డ్ రైస్ తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుందా?, దీని వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..

లంచ్ తరువాత మజ్జిగ తాగడం వల్ల తినే ఆహారం సరైన రీతిలో జీర్ణమై శక్తిగా మార్పిడి చెందుతుంది. ఫలితంగా కడుపులో ఉత్పన్నమయ్యే వేడి కూడా తగ్గుతుంది. అదే సమయంలో ఎసిడిటీ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడైనా ఎక్కువగా తిన్నామని అన్పించినప్పుడు 1-2 గ్లాసులు మజ్జిగ తాగితే సరిపోతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. రోజుకు 1-2 గ్లాసుల కంటే ఎక్కువ మజ్జిగ మంచిది కాదు. అదే విధంగా రాత్రి వేళల్లో మజ్జిగ తాగడం మంచి అలవాటు కాదు. దీనివల్ల ఆరోగ్యపరంగా నష్టాలు ఎక్కువ. రాత్రి పూట మజ్జిగ తాగడం కానీ పెరుగన్నం తినడం గానీ రెండూ మంచి అలవాట్లు కానే కావు.

Also read: Health tips: ఫిట్‌నెస్ సమస్య, ఏజీయింగ్ లక్షణాలు దూరం చేయాలంటే ఈ డైట్ తప్పనిసరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-06-07T10:23:45Z dg43tfdfdgfd