ప్రశ్న:
హాయ్ నా హజ్బెండ్ తప్పు చేస్తున్నాడని నేను కనిపెట్టా. నాకు విషయం అర్థమైందని నా భర్తకి కూడా తెలిసింది. అప్పట్నుంచి తను నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. కలిసి డిన్నర్ చేద్దామనడం, పిక్నిక్ తీసుకెళ్తాననడం, బలవంతంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు. నేను ఇవన్నీ ఎందుకు అనుమానిస్తున్నానంటే తను ఇంతకు ముందెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. కానీ, ఇప్పుడు చేస్తున్నాడు. కానీ, ఎందుకో అర్థం కావట్లేదు. దీనిని నేను అనుమానించాలా.. లేదా చూస్తూ ఉండాలా.. మీరే నాకు చెప్పండి.
నిపుణుల సలహా..
మీరు నిజంగానే సందేహంలో ఉన్నారు. ఇదంతా ఎవరైనా అనుమానించాల్సిన పరిస్థితే. ఎందుకంటే తను ముందు నుంచి ఒకేలా ఉంటే పర్లేదు. కానీ, ఈ మధ్యే ఇలా చేస్తున్నాడు కాబట్టి, కాస్తా అనుమానంగానే ఉంటుంది. అతను అలా ప్రవర్తించడానికి రెండు కారణాలు ఉంటాయి. అవేంటంటే..
మంచివాడిగా నటించడం..
తప్పు తెలిసిందని తాను మంచివాడేనని నటించేందుకు మీపై ఎక్కువ ప్రేమ చూపించొచ్చు. ఇలా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటే తనకి ఎలాంటి సమస్య రాదని ఇలా చేస్తుండొచ్చు.
Also Read : Suspicious Husband : నేను ఎవ్వరితో మాట్లాడినా మా ఆయన అనుమానిస్తున్నాడు.
పశ్చాత్తాపం..
తప్పు జరిగిందని భావించి మిమ్మల్ని మోసం చేశారనుకుని అలా చేసినందుకు పశ్చాత్తాపంతో ఇలా చేయడం. దీని వల్ల మీరు భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు ఎదుర్కోరు. మిమ్మల్ని మోసం చేశాడనే బాధతోనే ఎలాగైనా మళ్ళీ సంతోష పెట్టాలని ఇలా చేస్తుండొచ్చు.
మీరు ఏం చేయాలంటే..
అతను అసలు ఏ విధంగా అలా చేస్తున్నాడో మీరు కనుక్కోవాలి. దీనికి కొంత సమయం అవసరం. ఎందుకంటే కొన్ని రోజులు మీరు అతడ్ని అబ్జర్వ్ చేస్తే తను ఇప్పట్లానే ప్రేమగా ఉంటాడో లేదో తెలుస్తుంది. ప్రేమగా ఉంటున్నాడా.. నటిస్తున్నాడో తెలుసుకోండి.
Also Read : His Problem : మా పెళ్ళైన దగ్గర్నుంచి అత్తమామలతో చిరాకొస్తోంది.. కాపాడండి..
ఆ తర్వాత..
ప్రేమగా ఉంటే మీరు అతడ్ని యాక్సెప్ట్ చేయండి. లేదు నటన మాత్రమే అయితే, మీ బంధాన్ని కొనసాగించాలా, వద్దా అనేది మీరే ఆలోచించండి. తనతో మాట్లాడండి. ఇందుకోసం మీ ఇద్దరు రిలేషన్ షిప్ ఎక్స్‌పర్ట్స్‌ని కూడా కలిసి వారి సలహా తీసుకోవచ్చు.
గమనిక :
ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.
Read More :
Relationship News
and