స్వల్ప గాయంతో కూడా చనిపోయే కీటకాలను మీరు చాలా చూసి ఉంటారు. కానీ తల నరికిన తర్వాత కూడా 9 రోజులు బతికే ఒక కీటకం కూడా ఉంది. అదే బొద్దింక. దీని తల తెగిపోయిన తర్వాత కూడా అది దాదాపు 9 రోజులు బతికే ఉంటుంది. మరి ఎలా బతుకుతుందో తె లుసుకుందాం. బొద్దింకల మనుగడ గురించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. నిజానికి, ఇది ఒక అద్భుతం లేదా మాయాజాలం కాదు. కానీ బొద్దింక శరీరంలో ఉన్న ఒక ప్రత్యేక నిర్మాణం వల్ల ఇది జరుగుతుంది. బొద్దింకలు వాటి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవు. వాటి శరీరంలో శ్వాస తీసుకోవడానికి చాలా చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా అవి గాలి పీల్చుకుంటాయి. అందుకే బొద్దింక తల నరికిన తర్వాత కూడా అది 9 రోజులు సజీవంగా ఉంటుంది.
9 రోజుల తర్వాత మరణిస్తుందా?
9 రోజులు జీవించిన తర్వాత బొద్దింక చనిపోతుంది. బొద్దింక ఆకలి కారణంగా చనిపోతుంది. ఎందుకంటే బొద్దింక ఒక వారం కంటే ఎక్కువ కాలం ఆకలి, దాహంతో తట్టుకోగలదు. బొద్దింక తలను తెగినప్పుడు అది దాదాపు 9 రోజులు ఆహారం, నీరు లేకుండా బతికే ఉంటుంది. ఆ తర్వాత చనిపోతుంది. అంటే 9 రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా బతికే సామర్థ్యం ఉంటుంది.
బొద్దింకలపై ప్రయోగం:
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 20, మార్చి 4న బొద్దింకలపై ప్రయోగం నిర్వహించారు నిపుణులు. రెండు బొద్దింకలను పట్టుకుని వాటికి ఎలాంటి ఆహారం లేదా నీరు ఇవ్వకుండా ఏసీ కంటైనర్‌లో పెట్టి, ప్రతిరోజూ వాటిని గమనించారు. తొలి వారం అవి చాలా చురుకుగా ఉండి, బయటకి వచ్చేందుకు ప్రయత్నించాయి. రెండో వారం వాటి ప్రవర్తనలో చాలా తేడా కనిపించిందని తెలిపారు. తర్వాత మెల్లమెల్లగా వాటి శరీర కదలికలు తగ్గాయి. చివరికి పూర్తిగా కదలకుండా దాదాపు గాఢ నిద్రలోకి జారుకున్నట్లు అయ్యాయి. కానీ, అవి బతికే ఉన్నాయి.
రెండు నెలలు బతికిన తర్వాత, ఏప్రిల్ 17న మొదటిసారి పట్టుకున్న బొద్దింక చనిపోయింది. అంటే ఆహారం లేదా నీరు లేకుండా ఈ బొద్దింక 56 రోజులు బతకగలిగింది. అలాగే, రెండో బొద్దింక మే 5న చనిపోయింది. ఇది ఆహారం లేదా నీరు లేకుండా 62 రోజులు బతికింది.
బొద్దింకల శరీరాలకు బయట వైపు వాక్సీ కోటింగ్ (మైనపు పూత) ఉంటుంది. ఇది వాటి శరీరం నుంచి నీరు బయటికి రాకుండా సాయపడుతుంది. అందుకే, నీరు లేకుండా అవి ఎక్కువ కాలం బతుకుతాయని అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్, బొద్దింకల శరీర నిర్మాణంపై పరిశోధనలు చేసే డాక్టర్ జోసెఫ్ కాంకెల్ చెప్పారు.
బొద్దింకల ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తాయి.
బొద్దింక అనేది చెత్త నుండి పుస్తకాలు, పండ్లు, స్వీట్లు, ఆహారం వరకు ప్రతిదీ తినే జీవి. కానీ బొద్దింకలు ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, అలెర్జీ, దద్దుర్లు, కళ్ళ నుండి నీరు కారడం, నిరంతర తుమ్ములు, అనేక తీవ్రమైన వ్యాధులను కూడా వ్యాపిస్తాయి.
శ్వాస లేకుండా 40 నిమిషాలు
బొద్దింక గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అది దాదాపు 40 నిమిషాలు తన శ్వాస లేకుండా ఉండగలదు. అందుకే అది నీటిలో మునిగి చనిపోదు. బొద్దింక జీవితకాలం దాదాపు 1 సంవత్సరం. అలాగే బొద్దింక పెద్దదిగా మారడానికి దాదాపు 4 నెలలు పడుతుంది.
ఇది కూడా చదవండి: Air Conditioner: మీరు ఇలా చేస్తే ఏసీ విద్యుత్ బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. కేంద్రం కీలక సూచన
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2025-06-10T04:27:41Z