CRACKED HEELS: మడమల్లో పగుళ్ల సమస్యలు తరచుగా వస్తున్నాయా? ఇది వాడండి చాలు!

 

Diy Foot Cream For Cracked Heels: శరీరంలో అధిక వేడి కారణంగా మడమల్లో పగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారు.  ఎండాకాలం కారణంగా చాలా మందిలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడే చాలా మందిలో నడవడం ఇబ్బంది కరంగా మారుతోంది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన క్రీములు వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల తీవ్ర సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ క్రాక్ క్రీమ్‌లు వినియోగించాల్సి ఉంటుంది. ఎలాంటి క్రాక్ క్రీమ్‌లు వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.   

క్రాక్ క్రీమ్ తయారికీ కావాల్సిన పదార్థాలు:

ఒక కొవ్వొత్తి

రెండు చెంచాలు అలోవెరా జెల్

ఒక చెంచా కొబ్బరి నూనె

ఒక చెంచా ఆవాల నూనె

Also Read:  Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?

తయారుచేసే విధానం:

ముందుగా కొవ్వొత్తి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ కొవ్వొత్తి తీసుకుని మొత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొవ్వొత్తి పాన్‌లో వేసి బాగా కరిగించాలి. 

ఇలా కరిగించిన తర్వాత అందులోనే చెంచా ఆవాల నూనె వేయాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్‌  చేసుకోవాలి. 

ఇలా అన్ని మిక్స్‌ చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత అందులో విటమిన్ ఇ క్యాప్సూల్‌ నుంచి తీసిన నూనె వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక డబ్బలో వేయాలి. 

అంతే సులభంగా క్రాక్ క్రీమ్ రెడీ అయినట్లే..

క్రాక్ క్రీమ్‌ను ఇలా వినియోగించండి:

మీరు రాత్రి పడుకునే ముందు, స్నానం చేసిన తర్వాత పాదాలకు అప్లై చేయాలి. ఇలా ప్రతి రోజు అప్లై చేయడం వల్ల మీకు సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాదాలు యవ్వనంగా, మృదువుగా మారతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read:  Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-06-08T11:39:06Z dg43tfdfdgfd