DESI GHEE BENEFITS: దేశీ నెయ్యితో దిమ్మతిరిగే ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Health Benefits of Desi Ghee: మన భారతీయ సంస్కృతిలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంది. పూర్వీకులు నెయ్యిని బాగా ఉపయోగించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో నెయ్యి వాడకం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం ప్రజల్లో ఉన్న అపోహలే. నెయ్యి తింటే బరువు పెరుగుతారని, గుండెపోటు వస్తుందని ఇలా చాలా నెగిటివ్ అభిప్రాయం ఉంది జనాల్లో. అయితే దేశీ నెయ్యి తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 

దేశీ నెయ్యి ఉపయోగాలు

** చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దేశీ నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే, అది సిరల్లో ఫలకాలను తయారుచేసి రక్త సరఫరాను అడ్డుకుంటుంది. దీని కారణంగా అనేక వ్యాధులు వస్తాయి. 

** దేశీ నెయ్యి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావు. అంతేకాకుండా హార్ట్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. 

** దేశీ నెయ్యిను ఉపయోగించిన ఆహారం తింటే బరువు తగ్గుతారు. నెయ్యిలో ఫోలిక్ యాసిడ్ మరియు సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, ఇవి బరువు పెరగకుండా నిరోధిస్తాయి.

Also Read: Health Problems: బాబోయ్.. విటమిన్ సి లేకపోతే ఇన్ని సమస్యలా ?

** జీర్ణక్రియను మెరుగుపరచడంలో దేశీ నెయ్యి సూపర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్ మరియు వాంతుల వంటి సమస్యలను దూరం చేస్తుంది.

** ఇది డయాబెటిక్ రోగులకు కూడా సహాయపడుతుంది. దేశీ నెయ్యి తీసుకోవడంలో రక్తంలోని చక్కెర పరిమాణం పెరగదు. దీనిని మద్యాహ్నా భోజన సమయంలో తీసుకుంటే బాగుంటుంది.

** దేశీ నెయ్యి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఇది క్యాన్సర్‌ను పెంచే ట్యూమర్‌లు రాకుండా సహాయపడుతుంది.

** దేశీ నెయ్యిలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలను గట్టి పరచడంలోసహాయపడుతుంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

2023-06-04T03:52:31Z dg43tfdfdgfd