FACE POWDER: నిత్యం ముఖానికి పౌడర్ రాస్తున్నారా? బీ కేర్ఫుల్..!

Powder Dangerous Effects: సాధారణంగా ప్రతి ఒక్కరు..కూడా ముఖానికి ఫేస్ పౌడర్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పౌడర్ రాసుకోవడం.. వల్ల ముఖం మరింత అందంగా కనిపించడమే.. కాదు నునుపుగా తయారవుతుందనేది అందరి భావన. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ..విభాగం..ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్.. తాజాగా సంచలన ప్రకటన చేయగా.. ఇప్పుడు ఆ ప్రకటన అందరిని భయాందోళనలకు గురిచేస్తోంది. అంతేకాదు ఈ ప్రకటన చేసిన తర్వాత పౌడర్ వాడడం వల్ల ఇంత ప్రమాదం ఉందా అంటూ అందరూ నిద్రపోతున్నారు.. ఇకపోతే ఈ పౌడర్ ఎక్కువగా వాడడం వల్ల అండాశయ క్యాన్సర్ వస్తుందని సమాచారం.

సాధారణంగా పౌడర్ తయారీలో.. ప్రకృతి సిద్ధంగా లభించే మినరల్ టాల్క్ ను వినియోగిస్తారు. బేబీ పౌడర్లు.. ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఈ పౌడర్ టాల్క్ ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా మహిళలు అధికంగా ఉపయోగిస్తారు కాబట్టి మహిళలలోనే.. ప్రమాదాలు ఎక్కువగా వస్తాయి ప్రత్యేకించి మహిళల్లో సోకే క్యాన్సర్లలో అండాశయ లేదా ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ఈ క్యాన్సర్ ముదిరే వరకు లక్షణాలు బయటపడవు. ఒవేరియన్ క్యాన్సర్లలో ప్రధానంగా  ఎపితీలియల్ , స్ట్రోమల్ సెల్, జర్మ్ సెల్ క్యాన్సర్లు ఉంటాయి. 

ఇప్పటికే పలు నివేదికలలో తేలికగా తీసుకుంటే మాత్రం సుదీర్ఘకాలికంగా ఎదురయ్యే సమస్యలు  అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. మహిళలు తమ పొట్టకి దిగువ భాగంలో నొప్పి ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అసాధారణంగా అయ్యే బ్లీడింగ్, విరోచనాలు, ఉదర భాగం సైజు పెరిగినట్టు ఉండడం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువైతే వెంటనే.. వైద్యులకు సంప్రదించాలట. అంతేకాదు పౌడర్ వాడడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వైద్యులు.. హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పౌడర్ వాడే వాళ్లు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైతే తప్ప పౌడరు ఉపయోగించకూడదని చెబుతున్నారు. 

సాధారణంగా పౌడర్లు ముఖాన్ని అప్పటికప్పుడు అందంగా కనిపించేలా చేస్తాయి.. కానీ ఆ పౌడర్ కొద్ది సేపు అయిన తర్వాత చర్మ రంధ్రాల ద్వారా ముఖంలోకి ఇంకిపోతుంది. తద్వారా ఇలాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.. సాధ్యమైనంత వరకు పౌడర్లు.. మరీ ముఖ్యంగా పిల్లలకు ఉపయోగించకపోవడమే మంచిది. ఇక పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు.. తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి డబ్ల్యూహెచ్ఓ సంస్థ ఈ పౌడర్ విషయంలో మరి ఎలాంటి జాగ్రత్తలు,  సలహాలు ఇస్తారో చూడాలి.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

2024-07-09T14:18:13Z dg43tfdfdgfd