Giloy And Turmeric | ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు, మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల మొక్కలు మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతాయి. కానీ అలాంటి ఔషధ మొక్కల గురించి చాలా మందికి తెలియదు. వాటిల్లో తిప్పతీగ కూడా ఒకటి. తిప్ప తీగ కాండం లావుగా ఉంటుంది. దీన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ మొక్క తీగ జాతికి చెందినది. మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తిప్పతీగ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. తిప్ప తీగ ఆకుల నుంచి రసం తీసి తాగవచ్చు. ఈ రసంలో కాస్త పసుపు కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. తిప్పతీగ అనేక వ్యాధులను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తిప్పతీగ రసాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక కప్పు నీటిలో కలపాలి. అందులోనే కాస్త పసుపు, మిరియాల పొడి, దాల్చినచెక్క పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ పదార్థాలు కొందరిలో అలర్జీలను కలిగించవచ్చు. కనుక అలర్జీ సమస్య ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగకూడదు. ఈ విధంగా తయారు చేసిన తిప్పతీగ మిశ్రమాన్ని తాగితే అనేక లాభాలు కలుగుతాయి. ఈ మిశ్రమాన్ని సేవించడం వల్ల అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. అనేక రోగాలను తగ్గించుకోవచ్చు. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగి శరీరం వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎలాంటి రోగం అయినా సరే తగ్గిపోతుంది.
తిప్పతీగ మిశ్రమంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. దీంతో ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల సమస్యతో బాధపడుతున్నవారు రోజూ ఈ మిశ్రమాన్ని తాగితే ఫలితం ఉంటుంది. ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మోకాళ్ల నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని సేవించడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అలాగే కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే ఎంతో ఫలితం ఉంటుంది.
తిప్పతీగలో షుగర్‌ను తగ్గించే గుణాలు ఉంటాయి. అలాగే ఈ మిశ్రమంలో కలిపిన అన్ని పదార్థాలు కూడా షుగర్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రోజూ సేవిస్తుంటే షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు. దీంతో డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. తిప్పతీగ, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే మొటిమలు, వాపులు తగ్గుతాయి. ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తుంది. చర్మం మృదువుగా కూడా ఉంటుంది. ఈ మిశ్రమం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ మీరు ఏదైనా వ్యాధికి మందులను వాడుతుంటే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి దీన్ని వాడడం ఉత్తమం. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
2025-03-13T04:30:00Z