GRAPES STORING TIPS : ఇలా చేస్తే ద్రాక్ష పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి

Grapes storing Tips : సమ్మర్ వచ్చిందంటే చాలు. చాలా మంది ఎక్కువగా పండ్లు తీసుకుంటారు. అందులో ద్రాక్ష కూడా ఉంటాయి. అయితే, ఇవి త్వరగా పాడవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలో తెలిసి ఉండాలి. అవేంటో చూద్దాం.

ద్రాక్ష పండ్లని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి తీసుకొచ్చాక మిగతా పండ్ల కంటే త్వరగా పాడవుతాయి. వీటిని ఎక్కువ రోజులు తాజాగా ఉంచాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. వాటిని ఎలా స్టోర్ చేయాలో తెలిసి ఉండాలి. ఆ చిట్కాలేంటో చూద్దాం.

​కొనేటప్పుడు..

ఎండాకాలంలో ఎంతగా పండ్లు తింటే అంత మంచిది. దీని వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. కాబట్టి రెగ్యులర్‌గా పండ్లు తినండి. ఇక మీరు తీసుకునే పండ్లలో వాటర్ కంటెంట్ ఉన్న పండ్లు కూడా ఉండేలా చూసుకోండి. అలాంటి వాటిలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. వీటిని కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే తినేస్తాం కదా అని పండ్లు మెత్తగా ఉన్నా కూడా తీసుకోవద్దు. పండ్లు కాస్తా గట్టిగా చూడగానే తాజాగా ఉండాలి. అదే విధంగా, అక్కడక్కడ ఒక్కో పండు పాడైపోయి, నీరు కారుతూ ముడుచుకున్నట్లు ఉంటే వాటిని కూడా తీసుకోవద్దు.

​ఇంటికి తీసుకొచ్చాక..

ముందుగా పండ్లని బాగా కడగండి. వాటిని అలానే బయట ఉంచకుండా.. కడిగిన నీరు ఆరిపోయే వరకూ పొడిగా చేసి ఫ్రిజ్‌లో క్రిస్పర్ డ్రాయర్‌లో వెంటేలేషన్ ఉండే కంటెయిన్‌లో పెట్టి స్టోర్ చేయండి. గాలి తగలకుండా ఉంటే పాడైపోతాయి. కాబట్టి గాలి తగిలేలా చూసుకోండి. ఒకవేళ అలాంటి కంటెయినర్ లేకపోతే గాలి తగిలే ఓ బ్యాగ్‌లో వేసి పెట్టండి.

Also Read : Herbal Tea : ఈ టీ తాగితే బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది..

తడి ఆరాకే..

అయితే, పండ్లు స్టోర్ చేసేటప్పుడు అవి పూర్తిగా తడి ఆరాకే స్టోర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. లేకపోతే అందులో ఏమాత్రం తేమ ఉన్నా త్వరగా పండ్లు పాడైపోతాయి. కాబట్టి పూర్తిగా తడి ఆరిపోయాక అప్పుడు స్టోర్ చయండి.

Also Read : Semiya Payasam : సేమియా పాయసం చిక్కబడకుండా ఇలా చేయండి..

ద్రాక్ష అయినా ఓకే..

అయితే, మనకి రెండు రకాల ద్రాక్ష పండ్లు దొరుకుతాయి. ఏ ద్రాక్ష అయినా ఇలానే స్టోర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ద్రాక్ష పండ్లని వారం కంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. వీటితో జ్యూస్, ఐస్‌క్రీమ్స్, డెసర్ట్స్ ఇలా ఏవైనా చేసుకుని తిని వాటి రుచిని ఆస్వాదించొచ్చు.

గమనిక:

నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

​Read More :

Relationship News

and

Telugu News

2023-03-23T08:15:11Z dg43tfdfdgfd