HALEEM: రంజాన్ స్పెషల్ హలీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసా?

హైదరాబాద్ లో ఈ రంజాన్ సమయంలో ఏ సందులో చూసినా హలీమ్ దొరుకుతుంది. అయితే.. బయట హలీమ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కమ్మగా ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

పవిత్ర రంజాన్ మాసం మొదలౌంది.ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు మాబత్రమే కాదు.. హిందువులు కూడా ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే అది హలీమ్ మాత్రమే. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రంజాన్ సమయంలో ఏ సందులో చూసినా హలీమ్ దొరుకుతుంది. అయితే.. బయట హలీమ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కమ్మగా ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

హలీమ్ తయారీకి కావాల్సినవి..

గోధుమ రవ్వ (Broken Wheat) – 1 కప్పు

మటన్/ చికెన్ – 500 గ్రాములు (బోన్‌లెస్ అయితే మంచిది)

 మినప్పప్పు (Urad Dal) – ¼ కప్పు

 పసరపప్పు (Moong Dal) – ¼ కప్పు

సెనగపప్పు (Chana Dal) – ¼ కప్పు

బాస్మతి రైస్ – ¼ కప్పు

ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)

తరిగిన టమోటాలు – 2

అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు

మిరియాల పొడి – 1 టీస్పూన్

ధనియాల పొడి – 1 టీస్పూన్

జీలకర్ర పొడి – 1 టీస్పూన్

పసుపు – ½ టీస్పూన్

గరమ్ మసాలా – 1 టీస్పూన్

నెయ్యి లేదా నూనె – 3 టేబుల్ స్పూన్లు

కసూరి మెంతి – 1 టీస్పూన్ (ఐచ్చికం)

పుదీనా, కొత్తిమీర – అలంకరణ కోసం

పచ్చిమిర్చి, లెమన్, ఫ్రై చేసిన ఉల్లిపాయలు

ముందుగా పప్పులను రెడీ చేసుకోవాలి...

 గోధుమ రవ్వ, బాస్మతి రైస్, మినప్పప్పు, పసరపప్పు, సెనగపప్పు అన్ని కలిపి 4 గంటలు నానబెట్టండి.

 తర్వాత వాటిని కుక్కర్‌లో 4 కప్పుల నీళ్లతో 3-4 విజిల్స్ వచ్చేలా ఉడికించండి.

 ఉడికిన తర్వాత మిక్సీలో రుబ్బి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోండి.

2. మటన్/చికెన్ ఉడికించడం:

మటన్ లేదా చికెన్‌ను అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరమ్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి కలిపి మెరినేట్ చేయండి.

తర్వాత కుక్కర్‌లో 2-3 కప్పుల నీళ్ళతో ఉడికించండి. (4-5 విజిల్స్ వరకు).

ఉడికిన తర్వాత మటన్‌ను బాగా మెత్తగా చేసేందుకు హాండీ బ్లెండర్ లేదా మిక్సీ ఉపయోగించండి.

3. హలీమ్ మిశ్రమం తయారు చేయడం:

ఒక భారీ గిన్నెలో నెయ్యి లేదా నూనె వేసి, అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించాలి.

 ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, టమాట ముక్కలు వేసి వేయించాలి.

 ఇప్పుడు ఉడికించిన మటన్/చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

ఆపై ఉడికించిన గోధుమ రవ్వ మిశ్రమాన్ని కూడా జోడించి బాగా కలియబెట్టాలి.

కొద్దిగా నీళ్లు పోసి 30-40 నిమిషాల పాటు తక్కువ మంటపై మిశ్రమాన్ని మెల్లగా మిక్స్ చేస్తూ ఉడికించాలి.

ముద్దలా అయిపోయే వరకు చక్కగా గరిటెతో కలిపి మిశ్రమాన్ని ఒత్తాలి.

4. హలీమ్ సర్వింగ్ & టాపింగ్:

ఇప్పుడు కసూరి మెంతి, గరమ్ మసాలా, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు వేసి గార్నిష్ చేయండి.

నెయ్యి లేదా వెన్న, నిమ్మరసం, ఉల్లిపాయ చిప్స్ తో టాపింగ్ చేయండి. కావాలంటే జీడిపప్పు తో గార్నిష్ చేసుకోవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది.

2025-03-11T09:59:26Z