Trending:


16 విచిత్రమైన డిజైన్లు.. ఆ క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేరు!

Unique Designs: మనం ఫ్రెండ్స్ లేదా బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు.. అక్కడి కొన్ని వస్తువులు మనల్ని ఎట్రాక్ట్ చేస్తాయి. ఎందుకంటే వాటి డిజైన్ కాస్త భిన్నంగా ఉండొచ్చు. అరే.. ఇది భలే ఉందే.. అనిపించవచ్చు. ఇలాంటిది మనమూ కొనుక్కోవాలి అని మనసులో ఫీల్ కలగొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఇలాంటి క్రియేటివ్ డిజైన్స్ తయారుచేస్తూ ఉంటారు. అవి భిన్నంగా ఉండటం ద్వారానే ఎట్రాక్ట్ చేస్తాయి. వాటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి కొన్ని ఇప్పుడు చూద్దాం. (images credit - Reddit Platform) ఇది ఒక బార్‌లో స్టూల్. దీన్ని వైన్ బాటిల్ కార్క్ లాగా తయారుచేశారు. దీన్ని చూడగానే.. మందుబాబులకు కిక్ వస్తుంది. దీనిపై కూర్చొని.. గటగటా తాగేస్తారు. (image credit - reddit - © ClemFandango9) ఇంటికి వచ్చిన అతిథి.. "నాకు ఒక కప్పు కాదు.. 3 కప్పుల కాఫీ కావాలి" అన్నారంటే.. ఇందులో కాఫీ ఇవ్వండి. కప్పు ఒకటే.. మూడు కప్పుల్లా ఉంటుంది. (image credit - reddit - © 2after20) ఈ స్టెయిర్ కేస్ చూశారా.. ఎంత బాగుందో.. క్రియేటివిటీకి గుర్తు బల్బు. మెట్లను బల్బ్ ఆకారంలో నిర్మించి.. క్రియేటివిటీని చాటుకున్నారు. (image credit - reddit - © Far_Influence) ఇది బిగ్ గ్రిప్పర్ బెడ్. దీన్ని 1970లో ఫ్రాంక్ ఒయిల్కే డిజైన్ చేశారు. ఇది ఎట్రాక్టివ్‌గా ఉండటమే కాదు.. బెడ్ పై ఉన్న దుప్పట్లు కింద పడిపోకుండా ఇలా ఏర్పాటు చేశారు. (image credit - reddit - © midcenturyb***) ఈ డీవీడీ చాలా బాగుంది కదా. దీన్ని తెరవగానే.. ఆ బొమ్మ అందులో రిఫ్లెక్ట్ అయ్యి.. నీటిలో తమను తాము చూసుకుంటున్నట్లు కనిపిస్తూ, ఎట్రాక్ట్ చేస్తోంది. (image credit - reddit - © Green____cat) హ్యాంబర్గ్ లోని పబ్లిక్ బస్సుల్లో చిన్న బుక్స్ లైబ్రరీ ఉంటుంది. బస్ ఎక్కాక బుక్ తీసుకొని ఫ్రీగా చదవొచ్చు. బస్ దిగేటప్పుడు తిరిగి ఇచ్చేయాలి. ఎంత బాగుందో కదా ఈ ఐడియా. ఇది మన దగ్గర అమలైతే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. (image credit - reddit - © bacteriagreat) టాయిలెట్ కమోడ్ అందంగా ఉండాలి గానీ.. మరీ ఇంత అందంగా ఉంటే కష్టం అంటారా.. తప్పదు.. క్రియేటివిటీని కాదనలేం కదా. (image credit - reddit - © Yosho2k) ఈ వెట్ క్లినిక్ చూశారా చాలా బాగుంది కదా. అచ్చం కుక్కను గుర్తు చేసేలా తయారుచేశారు. దీన్ని చూడగానే.. మన పప్పీని తీసుకెళ్లి చూపించాలి అనిపించట్లేదూ. (image credit - reddit - © eleanor61) యూరిన్‌కి వెళ్లేవారికి.. యూరినల్‌ని చూడగానే చిరాకు వస్తూ ఉంటుంది. చాలా చోట్ల అవి నీట్‌గా ఉండవు. ఇది చాలా అందంగా ఉంది కదా. (image credit - reddit - © Kevone215) మహా భారతంలో మయ సభ ఉంటుంది. అందులో నీరు నేల లాగా... నేల నీరు లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అలాంటిదే. ఇది నీరు లాగా కనిపించే, నీరు కాని ఎపోక్సీ ఫ్లోర్. (image credit - reddit - © uni-versalis) స్పైడర్ మ్యాన్ భవనం ఎక్కేందుకు ఎలాగైతే ప్రయత్నిస్తాడో అలా.. చిరోప్రాక్టర్ ముందు.. ఈ లాంపోస్ట్ కూడా.. భవనం పైకి వెళ్లేందుకు ట్రే చేస్తోంది కదా. (image credit - reddit - © joshi_bar) మేం కప్పుల్లో కాఫీ, టీ తాగం.. కప్పుల్లో కూర్చొని తాగుతాం అంటారా.. అయితే ఈ రెస్టారెంట్‌కి వెళ్లండి.. కారిపోయే కప్పుల్లో కూర్చొని తాగండి. (image credit - reddit - © rustyyryan ) ఇది చూడండి.. బుడాపెస్ట్‌లో రామెన్ రెస్టారెంట్. దీన్ని చూడగానే.. డిన్నర్ చెయ్యాలనే ఫీల్ కలిగిస్తోంది. ఫుల్ బిజినెస్. (image credit - reddit - © mosanger) ఇది చూశారా.. రోజూ ఇందులో కాఫీ తాగితే ఎలా ఉంటుంది.. నానిపోతుంది కదా అనుకుంటున్నారా.. అబ్బే లేదండి.. ఇది అట్టముక్కతో చేసింది కాదు.. సెరామిక్ కప్పు. (image credit - reddit - © Panda_911) ఐస్‌లాండ్‌లో ఈ రెడ్ సిగ్నల్‌ని హార్ట్ షేప్‌లో తయారుచేశారు. దీన్ని చూడగానే వాహనదారులు.. అరే భలే ఉందే.. అనుకొని ఆగుతారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. (image credit - reddit - © Hadouken617) జాగ్రత్తగా చూడండి.. ఈ సైకిల్ కిక్ స్టాండ్ మామూలుగా లేదు. ఇది చూశారంటే.. మీ సైకిల్‌కి కూడా ఇలాంటిది కావాలంటారు. అంతేకదా. (image credit - reddit - © carlitos_sagan)


Hyderabad | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. వ్యాధులు బారిన ప‌డుతున్న విద్యార్థులు

Hyderabad | నాసిరకం మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


సేమ్యా ఫ్రూట్‌ కస్టర్డ్‌

సేమ్యా ఫ్రూట్‌ కస్టర్డ్‌ కావలసిన పదార్థాలు : పాలు: అరలీటరు , సేమ్యా: ఒక కప్పు , పాల పొడి లేదా మిల్క్‌ మెయిడ్‌: రెండు టేబుల్‌ స్పూన్లు , చక్కెర : రెండున్నర టేబుల్‌ స్పూన్లు, కస్టర్డ్‌ పౌడర్‌: రెండు టేబుల్‌ స్పూన్లు


అచంచలం వేదాంతం

చలం రాసిన ‘వేదాంతం’ కథ ఆలోచనకు పదునుపెట్టే ప్రహేళిక (పజిల్‌) లాంటిది. స్త్రీ అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి పురుషుడు నిత్యం చేసే విశ్వ ప్రయత్నంగా ఇది గోచరిస్తుంది.


అపరిశుభ్రంగా వంట గదులు

ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారుల చర్యల పరంపర కొనసాగుతున్నది. ఈ మేరకు శనివారం ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.


ఆ గ్రహ మార్పుతో ఈ రాశులవారు శృంగారంలో రెచ్చిపోతారు.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి!

శుక్ర గ్రహం ఉచ్ఛ క్షేత్రంలో సంచారం చేస్నున్నప్పుడు తప్పకుండా శృంగార భావనలను, సుఖ సంతోషాలను పెంపొందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తన ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషభ రాశిలో ఉన్న గురువుతో పరివర్తన చెందినందువల్ల శుక్ర గ్రహం కొన్ని రాశుల వారికి భారీగా సుఖ సంతోషాలను అనుగ్రహించే అవకాశం ఉంది. ఈ శుక్రుడు కొన్ని రాశులవారి మనసుల్లో ప్రేమ భావనలను రేకెత్తించడంతో పాటు ప్రేమ యాత్రలు, విహార యాత్రలకు ప్రేరేపించే అవకాశం ఉంది. శుక్రుడు అనుగ్రహించే రాశులు వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు. మకరం. కొత్త ప్రేమికులు, కొత్త దంపతులు ఈ సమయంలో ప్రేమ యాత్రలకు ప్లాన్ చేసుకునే పక్షంలోహ్యాపీగా, సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. వృషభంఈ రాశిలో ఉన్న గురువుతో లాభ స్థానంలో ఉచ్ఛలో ఉన్న శుక్రుడు పరివర్తన చెందడం వల్ల ప్రేమ యాత్రలు, విహార యాత్రలకు బాగా అవకాశం ఉంది. ఈ నెల 14 మొదలుకుని ఈ నెలాఖరు వరకు వీరు ఎప్పుడు ప్రేమ యాత్రలు చేసినా గరిష్ఠ స్థాయిలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. ఈ రాశివారు ప్రేమ యాత్రలకు ప్రకృతి సౌందర్యానికి సంబంధించిన ప్రాంతాలకు వెళ్లడం మంచిది. కొత్త దంపతులు కూడా సరికొత్తగా ప్రేమ యాత్రలు చేయడం దాంపత్య జీవితానికి మేలు చేస్తుంది. మిథునంఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ప్రేమ భావనలు, శృంగార భావనలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. వీరు కొండ ప్రాంతాలను, హిల్ స్టేషన్లను తమ ప్రేమ యాత్ర లకు ఎంపిక చేసుకోవడం వల్ల బాగా ఆనందం పొందుతారు. ఈ నెల 14 నుంచి నెలాఖరు వరకు వీరికి ప్రేమ వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉంది. ప్రేమ యాత్రల సందర్భంగా ప్రేమ భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కర్కాటకంఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్ర సంచారం జరుగుతుండడం, అది లాభ మస్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెందడం వల్ల వీరికి ప్రేమ యాత్రలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. శుక్రుడితో పాటు, గురువు అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తున్నందువల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు. ఈ రాశివారు తమ ప్రేమ యాత్రకలు, విహార యాత్రలకు జల, జలపాత ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం వల్ల అన్ని విధాలుగానూ ఉపయోగం ఉంటుంది. కన్యఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్య స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెందడం వల్ల వీరు చేసే ప్రేమ యాత్రలు నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతాయి. ప్రేమికుల మధ్య, యువ దంపతుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం పెంపొందుతాయి. ఈ రాశివారు ఈ నెలాఖరులోగా రెండు మూడుసార్లు ప్రేమ యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ రాశికి చెందినవారు సాధారణంగా కొండ ప్రాంతాలకు, ఎత్తయిన ప్రాంతాలను వెళ్లడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ధనుస్సుఈ రాశివారికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో సంచారం చేస్తున్నశుక్రుడు తప్పకుండా ప్రేమ యాత్రలకు అవకాశం కలిగిస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శృంగార సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రెండు మూడు సార్లు ప్రేమ యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశివారు తీర ప్రాంతాలను, అటవీ ప్రాంతాలను తమ ప్రేమ యాత్రలకు ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ఠ స్థాయిలో హ్యాపీగా గడపడం జరుగుతుంది. మకరంఈ రాశిలో మూడవ స్థానం ఉన్న శుక్రుడు పంచమ స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెంద డం వల్ల ఈ రాశికి చెందిన ప్రేమికులు, కొత్త దంపతులు అనేక పర్యాయాలు ప్రేమ యాత్ర చేసే అవకాశం ఉంది. ఈ నెల 14 నుంచి వీరి ప్రేమ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమ యాత్రల విషయంలో ఈ రాశివారు సరికొత్త, వినూత్న ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, వీరు జల పాతాలు, లోయ ప్రాంతాలకు ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ఠంగా సుఖ సంతోషాలు పొందగలుగుతారు.


Stitches Under Flashlight | కర్ణాటక ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్‌ కట్‌.. సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగులో వ్యక్తికి కుట్లు

Stitches Under Flashlight | కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలుమార్లు కరెంట్‌ పోయింది. దీంతో డాక్టర్లు సెల్‌ఫోన్స్‌ లైట్ల వెలుగులో రోగులకు చికిత్స అందించారు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించిన వ్యక్తికి చీకటిలోనే కుట్లు వేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.


Husband Dies Of Illness, Wife Hangs Self | అనారోగ్యంతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య

Husband Dies Of Illness, Wife Hangs Self | ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అతడి మరణాన్ని భార్య తట్టుకోలేకపోయింది. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. (Husband Dies Of Illness, Wife Hangs Self) భార్యాభర్తల మృతితో వారి ఏడాది వయస్సున్న బిడ్డ అనాథ అయ్యింది.


ఈ యువతి టాలెంట్ వేరే లెవెల్.. కుంచెతో అద్భుతాలు సృష్టిస్తున్న శ్రావ్య..!

పేపర్ పై సాధారణమైన బొమ్మలు గీయాలంటేనే ఎంతో సాధన చేస్తే కానీ చాలా కష్టం. అలాంటిది ఒక మనిషి రూపాన్ని గీయడం అంటే మాటలు కాదు. అట్లాంటిది ఫోటోలో కనిపిస్తున్న చిన్న పుట్టుమచ్చను కూడా పోనీయకుండా బొమ్మలను అద్భుతంగా గీస్తుంది ఈ యువతి. ఒక్క మాటలో చెప్పాలంటే పేపర్ మీద ఉన్న బొమ్మను చూస్తే కలర్ జిరాక్స్ తీసుకున్నట్టే ఉంటున్నాయి. ఇంత అద్భుతమైన బొమ్మలు వేయడమే కాకుండా ఈ బొమ్మల ద్వారా సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది శ్రావ్య. మంచిర్యాల జిల్లా బలరావ్ పల్లి గ్రామానికి చెందిన శ్రావ్య డిగ్రీ వరకు చదువుకుంది. శ్రావ్యకి చిన్న వయసు నుండే బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. కాలి సమయం దొరికిందా పెన్సిల్ పేపర్ పట్టి బొమ్మలు గీస్తూ ఉంటుంది. సరదాగా ఆమె వేసిన బొమ్మలు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. శ్రావ్య ఏకలవ్యుడిలా ఎవరూ తనకు నేర్పకుండానే స్వతహాగా ఆర్ట్ వేయడం నేర్చుకుంది. అలా నాలుగేళ్ళు పెన్సిల్ తో సాధన చేసి చివరికి సాధించింది. ఇప్పుడు ఎవరి ఫోటో ఇచ్చినా చకచకా అచ్చు గుద్దినట్టే గీసేస్తుంది. పెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవడానికి అమ్మ నాన్న ఆదర్శం అని శ్రావ్య తెలిపింది. నాన్న సమల వెంకటేష్, ఎలక్ట్రిషియన్ గా పని చేస్తారు.. అమ్మ లక్ష్మి ఇంటివద్దే ఉంటుంది. నాన్న బొమ్మలు గీసేవాడు, అమ్మ కార్టూన్ బొమ్మలు గీసేది. అలా వాళ్ళను చూసి నేర్చుకోవడానికి ఆసక్తి పెరిగిందని శ్రావ్య తెలిపింది. గంటల తరబడి బొమ్మలు వేస్తూ ఉన్నా వారు నుండి వచ్చే సహకారం ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని తల్లిదండ్రుల నుండి అంతటి సహకారం ఉంది కాబట్టే తాను ఆర్టిస్ట్ గా రాణించగలుగుతున్నానని శ్రావ్య తెలిపింది. శ్రావ్య పలు రకాల ఆర్ట్ వేస్తుంది. పెన్సిల్ ఆర్ట్, గ్రాఫైట్, చార్కోల్, పెయింటింగ్, పాస్టర్స్, ఆయిల్ పెయింటింగ్, కంకరచుల, ఇలా వివిధ రకాలుగా ఆర్ట్ వేస్తుంది. వీటితో పాటు వాల్ పెయింటింగ్ కూడా వేస్తుంది. దీనికి ఫోటో డిజైనింగ్, సింగిల్ డబుల్, ఫ్యామిలీ ఇలా ఫోటోను బట్టి ఉంటుందని తెలిపింది శ్రావ్య. శ్రావ్య లోకల్ 18 తో మాట్లాడుతూ భవిష్యత్తులో ఆర్టిస్ట్ రాణించాలనేది తన లక్ష్యమని తెలిపారు. అంతే కాకుండా ఆర్ట్ విషయంలో ఏదైనా కోర్స్ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. చిన్నారులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటానని.. దీనిని త్వరలో ప్రారంభిస్తానని అంటోంది. శ్రావ్య తో మీ ఫోటోలను బొమ్మ గీయించుకోవాలనుకుంటే ఈ నెంబర్ కి సంప్రదించండి. 7674037711


Plastic Lunch Boxes: ప్లాస్టిక్ బాక్స్‌లో ఆహారం తినొద్దని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఎందుకంటే..

Plastic Lunch Boxes: ప్లాస్టిక్ వస్తువుల వాడటం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు స్కూల్, కాలేజీ, ఆఫీస్‌లకు వెళ్లేవారిలో ఎక్కువ మంది ప్లాస్టిక్ బాక్స్‌లలోనే ఫుడ్ తీసుకెళ్తున్నారు. ప్లాస్టిక్ బాక్స్‌లలో ఆహారం తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. విద్యార్థుల నుంచి ఉద్యోగస్థుల వరకు అందరూ లంచ్ బాక్సులు పట్టకెళతారు కదా.. ఈ లంచ్ బాక్సులు ఎక్కువ శాతం ప్లాస్టిక్ వే ఉంటున్నాయి. రంగురంగుల ప్లాస్టిక్ బాక్స్‌లలోనే...


Shocking News: పెళ్లైన మహిళలు గూగుల్‌‌లో దేని కోసం సెర్చ్ చేస్తున్నారో తెలిస్తే షాక్

Viral News: ఈ రోజుల్లో మనకు ఏదైనా సందేహం వచ్చినా.. లేక దేనికైనా సమాధానం కావాలంటే ఠక్కున గూగుల్‌లో వెతకడం వెదకడం కామన్ అయిపోయింది. మనం Googleలో దాదాపు అన్నింటికీ సమాధానాలు కనుగొనవచ్చు. కొంతకాలంగా గూగుల్ మన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఎందుకంటే ప్రజలు ఏదైనా వెతకడానికి నేరుగా Google కి వెళతారు. ఇలాంటి సమయాల్లో ఒక ప్రశ్న తలెత్తుతుంది: వివాహిత మహిళలు గూగుల్‌లో అసలు దేని కోసం శోధిస్తారు? ఎందుకంటే వివాహం తర్వాత మహిళలు చిన్న చిన్న విషయాలకే గూగుల్ సహాయం తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమయంలో, అలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, అవి తెలిసిన తర్వాత మీరు నవ్వు ఆపుకోలేరు. గూగుల్ గణాంకాల ప్రకారం చాలా మంది వివాహిత మహిళలు తమ భర్తలకు సంబంధించిన అనేక విషయాల కోసం వెతుకుతారు. గూగుల్‌లో తమ భర్త ఇష్టాలు, అయిష్టాల గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నది స్త్రీలే. అయితే అందులో తప్పేమీ లేదు. ప్రపంచంలోని ప్రతి స్త్రీ వివాహం తర్వాత ఈ ప్రశ్నతో బాధపడుతుంది: తన భర్తకు ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు?కొంతమంది స్త్రీలకు తమ భర్తల గురించి వేరే ఎవరినీ అడగలేని ప్రశ్నలు ఉంటాయి. అలాంటి సమయాల్లో, వారి ఏకైక ఆశ్రయం గూగుల్.మీరు నవ్వవచ్చు కానీ వాస్తవానికి తమ భర్తలను బానిసలుగా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకునే కొంతమంది స్త్రీలు ఉన్నారు. నిజానికి, మహిళలు తమ భర్తలు తమ ప్రశ్నలను వినడం కంటే ఇలాంటి ప్రశ్నలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని భావిస్తారు. ఇది మాత్రమే కాదు వివాహం తర్వాత మహిళలు తమ భర్త ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ఏమి చేయాలో కూడా ఆందోళన చెందుతారు. అలాంటి స్త్రీలు ఆహార వంటకాల కోసం మాత్రమే కాకుండా, తమ భర్తల కోసం వివిధ బహుమతి ఎంపికల కోసం కూడా వెతుకుతారు. తమ భర్తలతో పాటు మహిళలు కూడా తమకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పిల్లలు పుట్టడానికి ఏ నెల మంచిది? మీ భర్తను సంతానం కనడానికి , యవ్వనంగా ఉండటానికి ఒప్పించే చిట్కాలు కూడా గూగుల్‌లో ఎక్కువగా వెదికినట్లుగా ఉంది. అవును, వివాహం తర్వాత చాలా మంది మహిళల జీవితాలు మారుతాయని కాదనలేము. ఒక విధంగా కెరీర్ వారికి రెండవ ఎంపిక అవుతుంది. అందుకే చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ సొంత కెరీర్‌లను ఎలా కొనసాగించుకోవాలో తెలుసుకోవాలనుకుంటారు. ఇది కాకుండా కొంతమంది మహిళలు తమ భర్త కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోవాలనుకుంటారు. తక్కువ సమయంలో తాను కుటుంబంలో ఎలా భాగమవుతానో తెలుసుకోవాలని అతనికి ఆసక్తిగా ఉంది. అతను తన కుటుంబ బాధ్యతలను ఎలా మోయగలడో తెలుసుకోవడంలో కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇంకా కొంతమంది స్త్రీలు తమ అత్తగారిని సంతోషంగా ఉంచడానికి వివిధ మార్గాలను కనుగొంటారు.


Chickpeas | రోజూ ఉడ‌క‌బెట్టిన న‌ల్ల శ‌న‌గ‌ల‌ను ఒక క‌ప్పు తినండి.. ఏం జ‌రుగుతుందంటే..?

సాయంత్రం పూట చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను తింటుంటారు. పానీ పూరీ, బ‌జ్జీలు, పునుగులు లేదా బేకరీ ఐట‌మ్స్‌ను తింటుంటారు.


Strawberry: ఈ ఎర్ర పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా బోలెడు ప్రయోజనాలు

Strawbberry Benefit: స్ట్రాబెర్రీ పండ్లు రుచిగా ఉంటాయి ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా లాభాలు తెచ్చి పెడుతుంది. స్ట్రాబెర్రీ పండ్లు డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం


Weekly Horoscope: వారఫలాలు.. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు.. మీ రాశి ఫలాలు ఎలా

Weekly Horoscope: రాశిఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి,...


Mahashivratri 2025 మహా శివరాత్రి వేళ అరుదైన శుభయోగాలు.. ఈ 4 రాశులకు ‘గేమ్ ఛేంజర్’ అయ్యే ఛాన్స్..!

Mahashivratri 2025 మహా శివరాత్రి వేళ అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి గేమ్ ఛేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


జింక్‌ అధికంగా ఉండే ఆహారాలు ఇవే!

జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. జింక్‌ ఉన్న ఆహారాలు తినడంతో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.


Valentines Day: భార్యాభర్తల మధ్య అగ్రిమెంట్.. ఎలాంటి కండీషన్స్ పెట్టుకున్నారో తెలుసా?

Valentines Day: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భార్యాభర్తల మధ్య చేసుకున్న ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ అగ్రిమెంట్‌లో భాగంగా జీవితంలో ముందుకు సాగేందుకు కొన్ని షరతులు కూడా విధించుకున్నారు. పెళ్లి అయిన 2 ఏళ్ల తర్వాత ఆ భార్యాభర్తలు అగ్రిమెంట్‌ చేసుకోవడం గమనార్హం. ఇంతకీ ఆ అగ్రిమెంట్ ఏంటి. వారు ఎందుకు అలా ఒప్పందం చేసుకున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం.


తిమింగలం నోటికి చిక్కిన యువకుడు.. ప్రాణం పోతుందనుకున్నలోపే అద్భుతం!

తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి చిన్న పడవతో సముద్రంలోకి వెళ్లారు. అక్కడే వారికొక తిమింగలం కనిపించింది. తప్పించుకుందామని చూసేలోపే అది వచ్చి కుమారుడిని నోట కరుచుకుంది. దీంతో సదరు యువకుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఇక తన ప్రాణం పోతుందని నిశ్చయించుకున్నాడు. పడవ దిగి తీరానికి చేరిన తండ్రి సైతం అదే భావించాడు. కానీ అంతలోనే అద్భుతం జరిగింది. ఫలితంగా యువకుడు ప్రాణాలతో బయట పడ్డాడు. ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


బద్ధకం.. వదిలించుకుందాం!

బద్ధకం ఆవరిస్తే, రోజువారీ పనులు సవాలుగా మారిపోతాయి. ఇలాంటప్పుడు జపాన్‌ సంస్కృతిలోని కొన్ని అలవాట్లను ఆశ్రయించాలి. వాటి సాయంతో మనం నిరంతరం స్ఫూర్తిపొందాలి.


బాదంపప్పు రోజూ తింటే సరిపోదు, కొలెస్ట్రాల్ తగ్గి గుండెకు మేలు జరగాలంటే ఎలా తినాలో తెలుసా?

డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యంగా ఎక్కువ మంది బాదం పప్పును తింటున్నారు. బాదం పప్పు తినడానికి రుచిగా ఉంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు.


Soaked Peanuts: నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల ఇన్ని లాభాలు పొందవచ్చా..!!

Soaked Peanuts Benefits: వేరుశెనగలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహారం. వీటిలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అయితే వీటిని నానబెట్టి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.


పొద్దుతిరుగుడు విత్తనాలతో ఈ ప్రయోజనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక రకాల వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి.


Eye Health Tips: రోజూ మీరు వేసుకునే మాత్రలు మీ కంటి ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసా?

కన్ను మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. కంటి ద్వారానే మనం అన్నీ చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అటువంటి కంటి ఆరోగ్యాన్ని తెలియకుండానే మీరే నాశనం చేసుకుంటున్నారని మీకు తెలుసా? అవును.. రోజూ మీరు వేసుకునే రకరకాల మాత్రలు కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎలాగో తెలుసుకుందాం రండి..


జ్యోతిష్యం: కుంభరాశిలో నాలుగు గ్రహాల సంయోగం.. ఐదు రాశుల వారికి అదృష్టం మాములుగా ఉండదు..

జ్యోతిష్యం: కుంభరాశిలో నాలుగు గ్రహాల సంయోగం.. ఐదు రాశుల వారికి అదృష్టం మాములుగా ఉండదు.. మహాశివరాత్రి ఫిబ్రవరి 26 ఈరోజు ఎంత పవిత్రమైన రోజు వేరే చెప్పనక్కర లేదు.  ఆ రోజున (2025 ఫిబ్రవరి 26)  గ్రహాల కూటమిలో అద్భుతం జరగనుంది.  సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శని  గ్రహాలు కుంభరాశిలో  మార్చి 14 వరకు కలసిఉంటాయి.   దీనివలన ఐదు రాశుల వారికి ( మేషం, వృషభం, కన్య,...


ఈ అయిదు ఆహారాలను అన్నంతో కలిపి తింటే త్వరగా ఏదో ఒక అనారోగ్యం వచ్చేస్తుంది

ఎంతో మందికి అన్నం తింటేనే పొట్ట నిండుతుంది. రాత్రి, మధ్యాహ్నం కచ్చితంగా అన్నం తినేవారి సంఖ్య తక్కువ. అన్నంతో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


Egg Puffs: నోరూరించే కేరళ స్టైల్ ఎగ్ పఫ్స్.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా తయారు చేసుకోండి!

Egg Puffs: మన దేశంలో స్పైసీ టేస్టీ వంటకాలకు కొదవే లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వెరైటీ. అవి ఎంత రుచిగా ఉంటాయో మాటల్లో చెప్పలేం. అలాంటి టేస్టీ ఫుడ్ ఐటమ్స్‌ను మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే, ఆ మజానే వేరుంటుంది. వాటిలో ఒకటి కేరళ స్టైల్ (Kerala-style) స్పైసీ మసాలా ఎగ్ పఫ్స్ (Spicy masala egg puffs).బేకరీలు, కేఫ్‌లలో మోస్ట్ పాపులర్ స్నాక్ ఐటమ్ ఎగ్ పఫ్స్. దీంట్లో గుడ్డు బేసిక్ ఇంగ్రీడియంట్. అందుకే ఇది తింటే కడుపు నిండుతుంది, సంతృప్తిగా అనిపిస్తుంది....


Green Tea Benefits: దంతాలపై పాచి తొలగించే అద్భుతమైన చిట్కా ఇదే.. మీరు ట్రై చేయండి..

Green Tea For Teeth Whitening: గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలోనే కాకుండా దంతాలను శుభ్రంగా, తెల్లగా చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Fake Paneer : మీరు వాడే పనీర్ ఒరిజినలేనా? నకిలీ పనీర్‌ను గుర్తించడానికి సింపుల్ చిట్కాలు ఇవిగో

Fake Paneer : మార్కెట్లో పనీర్ ఈజీగా లభిస్తుంది కదా.. కాని అది తయారు చేయడానికి చాలా పాలు కావాలి. మరి పాలే కల్తీగా మారిపోతే పనీర్ కాకుండా ఉంటుందా? నకిలీ పనీర్ ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పనీర్ ను చాలా మంది ఇష్టపడతారు. శాఖాహారులకైతే ఇది ఒక సూపర్ ఫుడ్. దీంతో అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. పనీర్ తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, క్యాల్షియం ఉంటాయి. మార్కెట్ లో దీనికి...


యాలకులు కొనడం మానేయండి.. ఇలా ఇంట్లో కుండీలోనే పెంచుకోండి

మనలో చాలా మందికి ఇంటి పెరట్లో, టెర్రస్ పైన, గార్డెన్‌లో పూల మొక్కలు, క్రోటాన్స్, మనీ ప్లాంట్స్ పెంచుకోవడంతో పాటు కూరగాయలు, ఇతర పండ్ల మొక్కలు పెంచే అలవాటు ఉంటుంది. అయితే మసలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు ఇంట్లో, పెరట్లో పెంచవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే సుగంధ ద్రవ్యాల్లో యాలకుల మొక్కలు ఇంటి ఆవరణలోనే పెంచువచ్చు. మీరు మార్కెట్ నుండి మొక్కలను తీసుకురావడం ద్వారా యాలకులను పెంచవచ్చు. ఇది కాకుండా మీరు విత్తనాల సహాయంతో మొక్కలను కూడా సులభంగా పెంచవచ్చు. మంచి నర్సరీ నుండి విత్తనాలు కొనండి, లేకుంటే మీ శ్రమ వృధా అవుతుంది. మార్కెట్ నుండి తెచ్చిన విత్తనాలను ఒక చెంచా నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచండి. తరువాత ఒక గిన్నె సిద్ధం చేసుకోండి. మీ కుండ చాలా పెద్దదిగా లేదా చాలా చిన్నదిగా ఉండకూడదు. 20 రూపాయలకు, మీకు సరైన సైజులో ఒక ప్లాస్టిక్ కుండ లభిస్తుంది. ఒక కుండలో సగం ఎర్ర మట్టి , సగం నల్ల మట్టి కలపండి. తరువాత ఈ మట్టికి కోకోపీట్ , ఆవు పేడ కలపండి. ఈ వస్తువులన్నింటినీ బాగా కలపండి. నేలపై నీటిని చల్లండి. తరువాత విత్తనాలను మట్టిలో వేయండి. మొక్కలు మొలకెత్తడానికి 5 నుండి 7 రోజులు పట్టవచ్చు. మొక్క మొలకెత్తిన తర్వాత వాటిని పాడు చేయవద్దు. ఉదయం , సాయంత్రం నీటిని పిచికారీ చేయాలి. 30 నుండి 40 రోజుల తర్వాత మొక్కలు బాగా మొలకెత్తుతాయి. ప్రతి ఉదయం 2 నుండి 3 గంటలు యాలకుల మొక్కను ఎండలో ఉంచడం ముఖ్యం. మొక్కలు మొలకెత్తిన తర్వాతే కుండను ఎండలో ఉంచాలి. విత్తనాలు నేలలో ఉన్నంత కాలం, వాటిని ఎండలో ఉంచకూడదు, నీడలో ఉంచాలి. యాలకుల మొక్క ఫలాలు కాసేందుకు 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే యాలకులుగా మారేందుకు ఆ టైం తీసుకుంటుంది. ఈ సమయంలో మీరు మొక్కను ఎండిపోకుండా, చనిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.


Nails Signs: మీ గోర్లపై ఇలాంటి మచ్చలు, గీతలు ఉంటే ఈ ప్రమాదకర వ్యాధులున్నట్టే

Nails Signs: మీ గోర్లపై ఇలాంటి మచ్చలు, గీతలు ఉంటే ఈ ప్రమాదకర వ్యాధులున్నట్టే


వారఫలాలు.. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు.. 20వ తేదీ నుంచి శుభవార్తలు వింటారు!

Weekly Horoscope: రాశిఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవ హారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కల యిక ఆనందం కలిగిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఆర్థిక లావా దేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసు కోవడం మంచిది కాదు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, నిలకడగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. చేపట్టిన పనుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవు తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరు ద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా చాలావరకు సానుకూలపడతాయి. శుభ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగి పోతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ది చెందే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవ హారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు బాగానే సాగిపోతాయి. రావలసిన సొమ్మును పట్టుదలగా వసూలు చేసుకుంటారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూరపు బంధువులను కలుసుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహా రాలు సాఫీగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ముఖ్యమైన పనులు వాయిదా పడ తాయి. విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. నిరు ద్యోగులు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగంతో సర్దుకుపోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందన లభించకపోవచ్చు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి విస్తరిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆల యాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు తగ్గించుకుంటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగి స్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసు కుంటే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రు లతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రధానమైన పనులు, ప్రయత్నాల్లో విజయాలు సాధి స్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందే అవకాశం ఉంది. కుటుంబసమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల నుంచి కొద్దిగా సమస్యలుంటాయి. వృత్తి జీవితంలో రాబడి కొద్దిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. రావలసిన డబ్బును గట్టి ప్రయ త్నంతో వసూలు చేసుకుంటారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. విద్యార్థులకు శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకోకుండా అపార్థాలు తలెత్తుతాయి. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొందరు దూరపు బంధువులు బాగా దగ్గరవుతారు. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధి స్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడ తాయి. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలుంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంటా బయటా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహా రాలు చురుకుగా పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ అధికారుల అండదండలుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలుంటాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడ తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. పెండింగు పనులు సకాలం పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజా వుగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగం మార డానికి ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభి స్తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత బాగా పెరుగుతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Horoscope | 16-02-2025 ఆదివారం.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


Baking Soda: బేకింగ్ సోడా నీటిలో కలిపి తాగితే ఇన్ని ప్రయోజనాలా?

బేకింగ్ సోడాను చాలా రకాల వంటల్లో వాడుతూనే ఉంటారు. కానీ, బేకింగ్ సోడా నీటిలో కలుపుకొని ఎప్పుడైనా తాగారా? కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. బేకింగ్ సోడాను కామన్ గా మనం వంటలో వాడుతూనే ఉంటాం. ఎక్కువగా బేకింగ్ కోసం కేక్ లు లాంటివి తయారు చేసినప్పుడు కచ్చితంగా వాడతారు. కేవలం వంటకు మాత్రమే కాదు... వంటగది, బాత్రూమ్, టాయ్ లెట్, కిచెన్ లాంటివి శుభ్రం చేయడానికి కూడా ఇదే బేకింగ్ సోడాను వాడుతూ ఉంటారు. అయితే.. ఎప్పుడైనా బేకింగ్ సోడాను నీటిలో కలిపి ఎప్పుడైనా...


మేడారంలో బెల్లాన్ని బంగారం అని ఎందుకు అంటారో తెలుసా..?

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారమ్మ జాతర. ప్రతి రెండేళ్లకోసారి మహా జాతర జరగగా మధ్య సంవత్సరంలో మినీ జాతర జరుగుతుంది. మినీ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆ తల్లులను దర్శించుకుంటున్నారు. మేడారం జాతర అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నిలువెత్తు బంగారం. భక్తులు ఆ బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. మేడారం వెళ్లిన భక్తులు గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లాన్ని ప్రసాదంగా తెచ్చుకోవాలని పోటీ పడుతుంటారు.మనం ఎక్కడైనా...


నగరానికి ఫ్రేమింగ్‌..

పట్టణాలు, నగర దృశ్యాలు, భవనాలు, నిర్మాణాల అందాలను.. సృజనాత్మకంగా చిత్రీకరించడమే అర్బన్‌ - ఆర్కిటెక్చరల్‌ ఫొటోగ్రఫీ. మీ చేతిలోని మొబైల్‌ఫోన్‌తోనే.. ఎలాంటి ఖరీదైన పరికరాల అవసరం లేకుండానే.. ఆకాశహర్మ్యాలు, వీధులు, ఆధునిక డిజైన్లను అద్భుతంగా ఫొటోలు తీయవచ్చు.


ఘనం.. పీవీ వనం

వంటకానికి అన్ని దినుసులూ కలిసి రుచిని కల్పిస్తాయి. సువాసన అద్దేది మాత్రం కరివేపాకే. దీన్ని ‘కల్యమాకు, కర్రీపత్తా, కర్రీ లీవ్‌' అని కూడా పిలుస్తారు. కరివేపాకు చెట్టు మధ్యస్తంగా పెరిగే మొక్క. గోరింట, దానిమ్మ చెట్లలాగే 10 నుంచి 12 అడుగుల ఎత్తు పెరుతుంది.


ఇదేందయ్యా.. ఇలాంటి ఆఫర్లు కూడా ఉంటాయా ? 99 వేలకు లైఫ్ టైం పానీ పూరీ అంట !

Nagpur vendor unique golgappa deal: పానీ పూరి అన్నా గోల్ గప్పా అన్నా ఎగబడేవారు చాలా మంది ఉంటారు. అందుకే సాయంత్రం అయితే రోడ్ల మీద ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. నాగపూర్ లో కూడా అంతే. అక్కడ కూడా విచ్చలవిడిగా గోల్ గప్పా దుకాణాలు ఉన్నాయి. కానీ ఒక్క దుకాణం మాత్రం వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆ దుకాణంలో లైఫ్ టైమ్ పానీపూరి ఆఫర్ ప్రకటించారు. పానీ పూరీలకు కూడా లైఫ్ టైమ్ ఆఫర్లా అని ఆశ్చర్యపోవద్దు. ఆయన అలా ఆలోచించాడు.. వెంటనే పోస్టర్లు వేశాడు. ఒక్క సారి...


Smoothie Mistakes: పండ్లతో కలిపి పాలు తీసుకుంటున్నారా? ఈ స్మూతీ కాంబినేషన్లు చాలా ప్రమాదకరమైనవని మీకు తెలుసా?

Smoothie Combination: జ్యూస్ చేసుకున్నా స్మూతీ తయారు చేసుకున్నా పాలు కలిపి తీసుకుంటున్నారా? అంతేకాకుండా స్మూతీలలో మరిన్ని కాంబినేషన్లు ట్రై చేస్తున్నారా? ఆగండి. మీకు తెలియకుండానే ప్రమాదకర కాంబినేషన్లు తీసుకుంటున్నారేమో చెక్ చేసుకోండి.


గోళ్లు మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతాయి?

గోరుపై తెల్లటి రంగు మారడం అనేది ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. సీసం లేదా ఆర్సెనిక్‌ వంటి వాటితో విష ప్రయోగం జరిగిందని చెప్పడానికి తెల్లటి మచ్చలు ఒక సంకేతం కావొచ్చు. సొరియాసిస్ అనే చర్మవ్యాధిని సూచించవచ్చు. ఒకవేళ గోరు మొత్తం తెల్లగా మారితే రక్తప్రవాహంలో ప్రొటీన్ లోపం ఉన్నట్లు. ఇది మూత్రపిండాలు, కాలేయంలో సమస్యలు, డయాబెటిస్‌ను సూచిస్తుంది.


మూడేళ్ల వయసులో రాష్ట్ర రాజధానులు.. పొల్లు పోకుండా చెబుతున్న చిన్నారి..!

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో అల్లరి చేస్తూ అమ్మ నాన్నలకి ఆనందాలను పంచుతూ పసి వయసులో ఆలోచనలకు అందని ఎన్నో విషయాలలో ప్రతిభ కనబరుస్తున్నారు. వచ్చి రాని మాటలతో ఎంతగానో ముద్దొచ్చే చిన్నారులు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నారు. మూడేళ్ల వయసులో దివ్యాన్షి చిన్న చిన్నగా మాట్లాడుతూ పెద్దవారిని ఆకట్టుకుంటుంది.పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లేన్ కి చెందిన దరావత్ నవీన్, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం....


తిమింగలం మింగేసినా తిరిగొచ్చాడు, ఏం జరిగిందంటే

తిమింగలం మింగేసినా తిరిగొచ్చాడు, ఏం జరిగిందంటే


Vastu Tips : కొండలపై ఇల్లు కట్టుకోవచ్చా..? కట్టుకుంటే వాస్తు పాటించాలా.. !

Vastu Tips : కొండలపై ఇల్లు కట్టుకోవచ్చా..? కట్టుకుంటే వాస్తు పాటించాలా.. ! సొంతిల్లు కట్టుకోవాలని అందరూ అనుకుంటారు.  కాని ప్రస్తుత రోజుల్లో స్థలం దొరకడం చాలా కష్టతరంగా మారింది. కొండలు.. గుట్టలు.. ఎత్తైన ప్రదేశాల్లో అయినా ఓ చిన్నపాటి ఇంటిని నిర్మించుకొని జీవివచాలని చాలామంది అనుకుంటున్నారు.  ఈ క్రమంలో వాస్తు ప్రకారం ఎలాంటి పద్దతులు అవలంభించాలో వాస్తు...


Vegetable Prices | సామాన్యులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు

రెండు వారాల రోజులు క్రితం వరకూ ఎక్కువగా ఉన్న కూరగాయల ధరలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. సామాన్యుడికి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. రైతు బజార్‌లో కూరగాయల ధరలు స్థిరంగా నిలకడగా కొనసాగుతున్నాయి. కేజీ 20 రూపాయలకే దాదాపు అన్ని కూరగాయలు అందుబాటులో ఉన్నాయి.


ఆ గుహలో 5 లక్షల ఏళ్ల నాటి నిధి.. లోపలికి వెళ్తే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే!

గుహ అనగానే మనకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది.. ఎందుకో తెలుసా? బొర్రా గుహలు, బెలుం గుహలు.. ఇలా ఎన్నో గుహలు ఆది మానవులకు నిలయాలు. అవి తరాలుగా మనుషులకు ఆశ్రయం కల్పించాయి. వన్య మృగాలకు కూడా ఆవాసాలుగా మారాయి. ఇక చరిత్రలో దొంగలు గుహల్లో నిధి నిక్షేపాలను దాచుకునేవారు. అందువల్ల గుహల్లో వాటికోసం తరచూ ప్రజలు వెతుకుతూనే ఉంటారు. కానీ ఓ గుహ ఉంది. అది అల్లాటప్పా గుహ కాదు. దాని నిండా నిక్షేపాలే. ఎటు చూసినా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఎంత తీసుకెళ్లినా ఇంకా ఇంకా ఉంటాయి. అదే దాని ప్రత్యేకత. ఎందుకో తెలుసుకుందాం. (image generated by chatgpt) ఆ గుహను జయింట్ క్రిస్టల్ కేవ్ అంటారు. స్థానికులు క్యూవా డె లాస్ క్రిస్టాలెస్ అంటారు. మెక్సికోలోని.. నైకాలో ఉంది. భూమిపై అత్యంత అద్భుతమైన సహజ వింతల్లో ఇది ఒకటి. ఈ గుహను మీరు చూడాలి అనుకుంటే.. సాహసం చెయ్యాల్సిందే. ఎందుకంటే ఇది మెక్సికో.. చిహువాహువాలోని.. నైకా గుహ ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 980 అడుగుల లోతుకి వెళ్లాలి. ఈ గుహలో లెడ్, జింక్, సిల్వర్ ఉన్నాయి. ఐతే.. వాటికి మించిన క్రిస్టల్స్ ఈ గుహలో కుప్పలుగా ఉన్నాయి. (image credit - x - @NaturelsWeird) ఈ గుహ ఒకటి ఉందని 2000 సంవత్సరం వరకూ ప్రపంచానికి తెలియదు. మైనింగ్ చేస్తూ.. ఓ కొత్త సొరంగం కోసం డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే.. అప్పుడు ఈ గుహ బయటపడింది. అంతే.. చూసినవాళ్లకు మతి పోయింది. దాని గురించి మిగతా వాళ్లకు చెప్పడానికి మాటలు సరిపోలేదు. ఈ గుహ కొన్ని వేల సంవత్సరాలపాటూ.. మూసి ఉంది. అందువల్ల లోపల.. అత్యంత భారీ క్రిస్టల్స్ (స్పటికాలు) తయారయ్యాయి. లోపల ఎక్కడ చూసినా అవే. (image credit - x - @NaturelsWeird) ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రిస్టల్స్ కొన్ని ఈ గుహలో కనిపించాయి. అవి జిప్సమ్ అంటే సెలెనైట్‌తో తయారయ్యాయి. కొన్ని క్రిస్టల్స్ 39 అడుగుల పొడవు ఉన్నాయి. వాటి బరువు ఏకంగా 55 టన్నులకు పైగా ఉంది. ఇవన్నీ 5 లక్షల సంవత్సరాలకు ముందు ఏర్పడ్డాయి. ఈ గుహలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే.. ఇందులో ప్రవహించే నీరు.. చాలా ఖనిజాలతో నిండి ఉంది. అందుకే రసాయనిక చర్యల వల్ల ఈ స్పటికాలు ఏర్పడ్డాయి. (image credit - x - @NaturelsWeird) ఈ గుహలో స్పటికాలు తీసుకెళ్లాలని అందరికీ ఉంటుంది. ఒక్కటైనా పట్టుకుపోదాం అనుకుంటారు. కానీ అది తేలిక కాదు. ఎందుకంటే.. ఈ గుహలో ఒక్కోసారి ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే తేమ 90 నుంచి 99 శాతం ఉంటుంది. అంటే.. ఈ గుహలోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రొటెక్టివ్ గేర్ ఉండాలి. అది లేకపోతే మనుషులు ఈ గుహలో 10 నిమిషాలు మాత్రమే బతకగలరు. ఇందులో అధ్యయనం కోసం సైంటిస్టులు లోపలికి వెళ్లారు. వారు ఆక్సిజన్ ఇచ్చే ప్రత్యేకమైన కూలింగ్ సూట్లు ధరించారు. (image credit - x - @tradingMaxiSL) 2017లో ఈ గుహలో వరదలు వచ్చాయి. దాంతో మైనింగ్ పనులు ఆపేశారు. ఆ తర్వాత క్రిస్టల్స్‌ని కాపాడే పని మొదలైంది. ఈ గుహలో ప్రస్తుతం ప్రజలకు అనుమతి లేదు. ఐతే.. ఇందులో పరిశోధన చేసిన సైంటిస్టులకు మతిపోయే విషయం ఒకటి తెలిసింది. ఈ గుహలో విచిత్రమైన సూక్షక్రిములు జీవిస్తున్నాయి. అవి క్రిస్టల్స్‌లో కూడా చిక్కుకున్నాయి. అవి 50వేల ఏళ్ల నాటివిగా తెలిసింది. అవి విపరీతమైన వాతావరణంలో ఎలా జీవిస్తున్నాయో తెలుసుకుంటున్నారు. తద్వారా ఇతర గ్రహాలపై సూక్ష్మజీవులు ఎలా జీవించగలవో అర్థం అయ్యే వీలుంది. (image credit - x - @tradingMaxiSL)


Parenting : ఈ 3 విషయాల్లో పిల్లలను బలవంతం చేయకూడదు

ప్రతి పేరెంట్స్ తమ పిల్లల గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. వారికి మంచి నేర్పించాలనే అనుకుంటారు. కానీ, మూడు విషయాల్లో మాత్రం పిల్లలను బలవంత పెట్టకూడదు. అది పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందట. మరి, అవేంటో తెలుసుకుందాం... పిల్లలను బాగా పెంచాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అది వారి బాధ్యత కూడా. అందుకే చిన్నతనం నుంచే చాలా విషయాలను పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదైనా విషయం పిల్లలు నేర్చుకోలేకపోతే పేరెంట్స్ బలవంత పెడుతూ...


Fake Eggs: నకిలీ గుడ్లు తింటున్నారా బకెట్ తన్నేయడం పక్కా.. కొనేముందే ఇలా గుర్తించండి!

Fake Eggs: గుడ్లు (Eggs) ఆరోగ్యానికి చాలా మంచివి. దీంట్లో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, మైక్రోన్యూట్రియెంట్స్ ఉంటాయి. అందుకే ఎగ్స్‌ను సూపర్ ఫుడ్ అంటారు. రోజూ ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గుడ్లలో ఉండే హైక్వాలిటీ ప్రోటీన్‌, విటమిన్లు, మినరల్స్‌ వంటివన్నీ బ్రెయిన్‌ చురుగ్గా పనిచేయడానికి, మజిల్ పవర్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే, ఈ మధ్య చాలా ప్రాంతాల్లో నకిలీ గుడ్లు (Fake Eggs) అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి తింటే డేంజర్లో పడ్డట్లే. ఇవి ఒరిజినల్ ఎగ్స్‌లానే ఉంటాయి. చూడగానే వాటిని గుర్తించడం చాలా కష్టం. అయితే కొన్ని తేడాల ద్వారా వీటిని ఐడెంటిఫై చేయవచ్చు. గుడ్డు పెంకు ఆకారంసాధారణ గుడ్లతో పోలిస్తే నకిలీ గుడ్డు పెంకు మెరుస్తుంటుంది. వాటి షేప్ యూనిఫార్మ్‌గా ఉంటుంది. పెంకుపై గోటితో తడితే.. ప్లాస్టిక్‌ లాంటి శబ్దం వస్తుంది.* క్రాక్‌ టెస్ట్‌నిజమైన గుడ్లను పగలగొట్టినప్పుడు స్ట్రాంగ్ టెక్చర్ ఉన్న, బాగా ఏర్పడిన పచ్చసొన కనిపిస్తుంది. అదే నకిలీ గుడ్లలో (Fake Eggs) అయితే, రబ్బరు లేదా అతి గట్టిగా ఉండే పచ్చసొన ఉంటుంది. తెల్లసొన కన్‌సిస్టెన్సీ తేడాగా అనిపిస్తుంది. వాసననిజమైన గుడ్లను పగలగొడితే.. నీచు వాసన వస్తుంది. అదే నకిలీవైతే ప్లాస్టిక్‌ లేదా కెమికల్‌ స్మెల్‌ ఉంటుంది.* వాటర్‌ టెస్ట్‌ఒరిజినల్ ఎగ్స్‌ను నీళ్లలో వేస్తే, ఫ్రెష్ ఎగ్స్ మునుగుతాయి, పాడైపోయినవి తేలుతాయి. కానీ నకిలీవి అయితే ఎలా ఉన్నా ఆర్టీఫీషియల్‌ కంపోజిషన్‌ వల్ల పూర్తిగా మునిగి పోతాయి. కుకింగ్‌ బిహేవియర్‌ఉడికించిన తర్వాత కూడా ఎగ్‌వైట్‌ నీరులా కారుతుందంటే అది నకిలీ గుడ్డు (Fake Eggs). అలాగే గిలకొట్టినప్పుడు పచ్చసొన చాలా సులభంగా ఎగ్ వైట్‌తో కలిసిపోతుంది. నేచురల్‌ ఎగ్‌లో అయితే అంత ఈజీగా మిక్స్‌ కాదనే విషయం తెలిసిందే. ఫేక్ ఎగ్స్‌ చాలా డేంజర్నకిలీ గుడ్లను (Fake Eggs) తింటే ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. టాక్సిక్‌ కెమికల్స్‌ కారణంగా ఇబ్బందులు తప్పవు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. వీటిలో ఉపయోగించే బెంజోఫీనోన్‌ వంటి రసాయనాలు నర్వస్‌ సిస్టమ్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. తెలియకుండా వీటిని తింటూ ఉంటే, లివర్‌, కిడ్నీ చెడిపోతాయి. హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలుఫేక్‌ ఎగ్స్‌ (Fake Eggs) ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మకం ఉండే వెండర్స్‌ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. కుదిరితే దగ్గర్లో ఉండే ఫామ్స్‌ నుంచి నేరుగా తెచ్చుకోవడం మంచిది. గుడ్ల రంగు, సైజు, ఆకారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత క్రాక్‌ టెస్ట్‌, వాటర్‌ టెస్ట్‌ చేసి చూడాలి. ఎప్పటికప్పుడు వీటిపై అవగాహన పెంచుకోవాలి. మీ చుట్టుపక్క ఇలాంటి ఘటనలేమైనా వెలుగులోకి వచ్చాయేమో వార్తల ద్వారా తెలుసుకోవాలి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.


Chewing Food: భోజనం తినేటప్పుడు ఒక్కో ముద్దను ఎన్ని సార్లు నమలాలో తెలుసా?

Chewing Food: భోజనం చేసేటప్పుడు ఒక్కో ముద్దను ఎంత సేపు నములుతున్నారో.. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆహారాన్ని బాగా నమిలి తినకపోతే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు. మరి ఆహారాన్ని ఎంత సేపు నమిలి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజీ లైఫ్ లో సరిగ్గా భోజనం చేయడం కూడా చాలామంది మరిచిపోతున్నారు. ఏదో భోజనం చేసే టైమ్ అయిందని నాలుగు ముద్దలు నోట్లో పెట్టుకొని మమ అనిపిస్తున్నారు. తిన్న కాస్త ఆహారమైనా సరిగ్గా నమలకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య...


Milk Rice:పాలు, అన్నం కలిపి తినొచ్చా..?

అసలు.. పాలు అన్నం కలిపి తినొచ్చా? రెండూ కలిపి తింటే ఏమౌతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. ఇండియన్స్ రెగ్యులర్ గా పాలు వాడుతూనే ఉంటారు. ఆ పాలతో టీ , కాఫీ, పెరుగు ఇలా చాలా రకాలుగా వాడతారు. పాలు, బియ్యం కలిపి పాయంలా చేసి తినే వాళ్లు ఉంటారు. కానీ.. పాలన్నం తినేవాళ్లు మాత్రం చాలా అరుదు అనే చెప్పాలి. రెగ్యులర్ గా పెరుగు అన్నం తినేవాళ్లు ఉంటారు. కానీ, పాలన్నం తినేవాళ్లు చాలా అరుదు అని చెప్పొచ్చు. అసలు.. పాలు అన్నం కలిపి తినొచ్చా? రెండూ కలిపి...


ముఖంపై చర్మం సాగి ముడతలు వచ్చాయా, బెంగేలేదు కొన్ని ఫేస్‌ప్యాక్స్ వేస్తే తిరిగి యవ్వనంగా మారుతుంది

వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు వచ్చి పెద్దవారిలా కనిపిస్తుంది. స్కిన్ కూడా సాగినట్లుగా ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.


30 ఏళ్ల తర్వాత కూడా అందంగా కనిపించాలా.. ఈ టిప్స్ పాటిస్తే మీకు తిరుగులేనట్టే!

చాలామంది స్త్రీలు 30 ఏళ్ల తర్వాత కూడా అంతే అందంగా కనిపించడంతో పాటు, మెరిసే చర్మం కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో పాటు నాచురల్ టిప్స్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చర్మం సహజమైన మెరుపును కోల్పోవడం అన్నది సహజం. అందుకే ఈ వయసు పెరిగే కొద్దీ అందాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అంద విహీనంగా కనిపిస్తారు. అప్పుడు మీ ఆరోగ్యం, చర్మం పై మరింత శ్రద్ధ వహించాలి. డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, మీ చర్మం వృద్ధాప్యానికి దగ్గరవుతున్నట్టు సూచిస్తుంది. 30 ఏళ్లు పైబడిన వారికి మామూలుగా ముఖంపై ముడతలు రావడం అన్నది సహజం. అలాంటప్పుడు పదేపదే ముఖాన్ని శుభ్రం చేయడం రకరకాల క్రీములు వాడడం ఇలాంటివన్నీ ఆపేయాలి. అలాగే మీరు వాడే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ మీ చర్మ రకాన్ని బట్టి ఉండాలి. 30 ఏళ్ల లోపు మహిళలు కాస్మెటిక్స్ వాడకాన్ని పెంచుతారు. ఇది చర్మంఫై తేమను కోల్పోయేలా చేస్తుందట. దీంతో ముఖంపై ముడతలు ప్రారంభమవుతాయి. రాత్రిపూట అన్ని మేకప్‌ లను తొలగించాలట. అలాగే వేసవి కాలంలో ఎండలో బయట తిరిగేటప్పుడు సన్‌ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలని చెబుతున్నారు. జిడ్డు చర్మం కోసం సన్‌ స్క్రీన్ జెల్ ఉపయోగించాలట. అలాగే రాత్రిపూట చర్మం శుభ్ర పరిచిన తర్వాత క్రీమ్‌ తో తేలికగా మసాజ్ చేసుకోవాలి అని చెబుతున్నారు. అలాగే మెరిసే చర్మం కోసం ఆహారం జీవనశైలి కూడా ముఖ్యమని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన అందమైన చర్మం కోసం ప్రతి రోజు తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పచ్చి సలాడ్లు,మొలకెత్తిన ధాన్యాలు, తృణ దాన్యాలు వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే పెరుగును కూడా మీ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ప్రతిరోజు 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలని చెబుతున్నారు. అందులో ఒక గ్లాసు నీళ్లలో నిమ్మకాయ రసాన్ని కలుపుకొని ఉదయం పూట తాగాలని చెబుతున్నారు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 30 ఏళ్ల తర్వాత కూడా తప్పకుండా అందంగా కనిపిస్తారని చెబుతున్నారు.