horoscope today 28 March 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు, బుధుడు మిధున రాశిలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మృగశిర, ఆరుద్ర నక్షత్రప ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలొస్తాయి. కుంభ రాశి వారికి వారు పని చేసే రంగంలో గౌరవం పెరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజున మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. వివాహితులు తమ పిల్లల అడ్మిషన్ లేదా ఏదైనా పోటీ పరీక్షల కోసం హడావుడి చేయొచ్చు. మీ ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మార్కెట్‌కు వెళ్లొచ్చు. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుంతుంది. కొన్ని కారణాల వల్ల మీ ప్రేమ జీవితంలో ఉద్రిక్తత ఉండొచ్చు. మీరు మీ స్నేహితులతో ఈరోజు సాయంత్రం సరదాగా గడుపుతారు.
ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించి, హనుమంతుడిని దర్శనం చేసుకోవాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం వల్ల మీరు చేసే వ్యాపారంలో ఏవైనా మార్పులు చేయొచ్చు. మీ కుటుంబ సభ్యుల సలహాలు మీ పురోగతి, విశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా పని కార్యకలాపాలు నిర్వహించడంలో విజయం సాధిస్తారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా గడుపుతారు.
ఈరోజు మీకు 98 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు మల్లెపువ్వుల నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి.
మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఒక జాబితాను రూపొందిస్తారు. మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే.. నిపుణులు, మీ జీవిత భాగస్వామి సలహాను కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో ఏమైనా గొడవలుంటే ఈరోజు సద్దుమణిగే అవకాశం ఉంది. ఈరోజు చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో గౌరవంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బిజీగా గడపొచ్చు. మీ కెరీర్లో మార్పులను చేయాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడు సరైన సమయం కాదు.
ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు మీరు సోదరుల ఆశీస్సులు తీసుకుని, మిఠాయిలు తినిపించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. మీకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. పాత స్నేహితుల నుంచి ధనం ఆశిస్తారు. మరోవైపు మీ పిల్లలకు కొన్ని శారీరక సమస్యలు ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సాయంత్రం వరకు 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ ఖర్చులను నియంత్రించాలి. లేదంటే మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. మిత్రులతో కలిసి పెట్టుబడి ప్రణాళికలు వేస్తారు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు ఎక్కువగా నగదు అవసరం కావొచ్చు. మీరు ప్రేమ జీవితంలో ఏదైనా ప్రణాళిక రూపొందిస్తే.. దాన్ని అమలు చేసేందుకు సద్ధంగా ఉండాలి. ఆ సమయంలో ధార్మిక కార్యక్రమాల్లో గడుపుతారు.
ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు కొబ్బరికాయను ఎర్రని గుడ్డలో కట్టి ఆంజనేయుని ఆలయంలో ఉంచాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని పనుల వల్ల మానసిక ఒత్తిడి పెరగొచ్చు. ఉద్యోగులకు వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. మీరు ఏదైన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో సాయంత్రం కొంత ఇబ్బందిగా మారొచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. వ్యాపారులకు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందుతారు. ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది.
ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామిని పూజించాలి.
Makar Rasi Ugadi Rasi Phalalu 2023-24 ఉగాది తర్వాత మకర రాశి వారికి కెరీర్లో కొత్త అవకాశాలొస్తాయి...!
తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదాలుంటే, పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగులకు ఈరోజు వారి రంగాల్లో పూర్తి సహకారం లభిస్తుంది. మరోవైపు మీ ముఖ్యమైన ఇంటి పనులు నిలిచిపోవొచ్చు. వాటిని పూర్తి చేయడానికి కొంత సమయం పొందుతారు.
ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు హనుమంతుని పూజించాలి. ఆంజనేయ గుడిలో కొబ్బరికాయ ఉంచాలి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు చిన్న పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు కుటుంబ ఆస్తులను సద్వినియోగం చేసుకుంటారు. మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని మెరుగుపరచుకోడానికి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పురోగతికి అవకాశాలు ఉంటాయి, ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని, గోమాతకు రోటిని తినిపించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఇంట్లో ఛైత్ర నవరాత్రుల పూజ చేయడం వల్ల వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండొచ్చు. దీంతో మీ కుటుంబ వాతావరణంలో కొంత నిరాశ ఉండొచ్చు. మీరు కోరుకున్న విద్యను పొందడానికి మరింత కష్టపడాల్సి రావొచ్చు. ఈరోజు పాత మిత్రులతో మాట్లాడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారులకు శత్రువుల నుంచి కొంత ఇబ్బంది ఎదురవ్వొచ్చు.
ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు ఉపవాసం ఉండి ఎర్రచందనాన్ని తిలకంగా రాయాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు తమ పిల్లలు పనిలో పురోగతిని చూసి సంతోషిస్తారు. మీకు క్షేత్రస్థాయిలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వం నుండి సహకారం అందుతుంది. విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మీ ప్రేమ జీవితాన్ని శాశ్వత సంబంధంగా మార్చుకోవడానికి ప్రణాళిక రూపొందించబడుతుంది. మీరు చేసే వ్యాయామం నుంచి మంచి ఫలితాలొస్తాయి. ఈరోజు మీరు మీ వ్యాపారాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తారు.
ఈరోజు మీకు 96 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు శత్రువులను కూడా ఓడిస్తారు. ఈరోజు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వాలనుకుంటే, ఆ ఆలోచనను విరమించుకోండి. ఎందుకంటే అవి తిరిగి రాకపోవచ్చు. మరోవైపు మీరు పని చేసే ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. సామాజిక సేవ చేయడం వల్ల ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి అవకాశం వస్తుంది.
ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు రాత్రి నల్ల కుక్కకు చివరి రోటీ తినిపించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యాపారంలో సోదరులు, తండ్రి మద్దతును పొందుతారు. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కలహాల కారణంగా కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నమ్మకాన్ని గెలుచుకోవడం అవసరం. మీరు ఈరోజు కొన్ని సందర్భాల్లో ఇష్టానికి విరుద్ధంగా పని చేయాల్సి ఉంటుంది. మీరు పని చేసే ప్రాంతం గురించి కొంత ఆందోళన చెందుతారు.
ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు ఆంజనేయుడిని పూజించి బెల్లం, శనగలు సమర్పించాలి.
గమనిక
: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Read
and