INDIAN FOOD | భారతీయ రుచులకు ఫిదా అవుతున్న న్యూయార్క్‌ చిన్నారి.. వీడియో వైరల్‌

Indian food | భారత సంస్కృతి, సంప్రదాయాలే కాదు.. వంటకాలూ ఎంతో ప్రత్యేకం. ప్రపంచ ప్రముఖులు సైతం భారతీయ వంటకాలకు (Indian food) ఫిదా అవుతుంటారు. టాప్‌ కంపెనీల సీఈవోలు, పలు దేశాధినేతలు ఇప్పటికే ఇండియన్‌ ఫుడ్‌పై తమకున్న మక్కువను చాలా సందర్భాల్లో తెలియజేశారు కూడా. తాజాగా న్యూయార్క్‌ (New York) నగరంలో ఓ పసిపిల్లవాడు భారతీయ ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సాధారణంగా చిన్న పిల్లలు తిండి తినేందుకు మారాం చేస్తుంటారు. తల్లులు గంటల తరబడి వారి వెంటపడి బలవంతంగా తినిపిస్తే కానీ తినరు. అదికూడా నోటికి రుచిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, ఈ పిల్లాడు మాత్రం భారతీయ వంటకాలను ఒకదాని తర్వాత ఒకటి ఎంతో ఇష్టంగా లాగించేశాడు.

న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌లో గల జాక్సన్‌ హైట్సలక్షని ఏంజెల్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌లో తన కుమారుడు సోఫియా భారతీయ ఆహారాన్ని ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను అబ్రిడ్జేట్‌ కూలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. రెండు విభాగాలుగా ఈ వీడియోను ఆమె షేర్‌ చేసింది. పార్ట్‌-1 వీడియోలో ఆ చిన్నారి ముందుగా పాపడ్‌ ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఇండియన్‌ ఫేమస్ స్ట్రీట్‌ ఫుడ్‌ అయిన పానీ పూరీ తినేందుకు ట్రై చేయగా.. అది కిందపడిపోతుంది. అనంతరం గోబీ, దాల్‌, నాన్‌ని ఎంతో ఇష్టంగా తింటాడు. ఇక పార్ట్‌-2 వీడియోలో దాల్‌ తడ్కా, నాన్‌, రైస్‌ విత్‌ వంటి భారతీయ రుచుల్ని ఎంజాయ్‌ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ క్యూట్‌ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read..

Malakpet Case | మలక్‌పేట కేసులో పురోగతి.. మొండెం లేని తల ఎవరిదో తెలిసింది..!

Tesla Car | భారత్‌లోకి వస్తాం.. టెస్లా కార్ల ప్లాంట్‌ ఏర్పాటుపై మస్క్‌ కీలక ప్రకటన..!

Hansika Motwani | టాలీవుడ్‌ హీరో ఇబ్బంది పెట్టాడంటూ వార్తలు.. స్పందించిన నటి హన్సిక

2023-05-24T12:05:05Z dg43tfdfdgfd