మీ పిల్లల యూనిఫాంపై ఇంక్ మరకలతో విసిగిపోయారా? ఈ సింపుల్ చిట్కాతో వాటిని ఈజీగా తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
పిల్లల స్కూల్ యూనిఫాంలు రోజూ ఉతికినా కూడా మళ్లీ మురికిగా మారుతూనే ఉంటాయి. ఏ మరకలు అయినా సులభంగా తొలగిపోతాయేమో కానీ.. ఇంక్ మరకలు మాత్రం అంత సులభంగా వదలవు. మీరు కూడా ఇంక్ మరకలు వదిలించలేక విసిగిపోయారా? అయితే... కొన్ని సింపుల్ టెక్నిక్స్ వాడటంతో వాటిని ఈజీగా తొలగించవచ్చు. మరి, ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా...
సాధారణంగా చాలా మంది ఇంక్ మరకలను తొలగించడానికి డిటర్జెంట్ తో పాటు.. వెనిగర్, బేకింగ్ సోడా లాంటివి వాడతారు. కానీ.. అవి పూర్తి స్థాయిలో మరకలను పూర్తిగా తొలగించలేవు. చేతులు నొప్పి పెట్టేదాకా రుద్దినా కూడా ఆ మరకలు వదలవు. కానీ.. నిమిషాల్లో నిమ్మకాయను వాడి ఆ మరకలను పూర్తిగా తొలగించవచ్చు.
ఇంక్ మరకలను నిమ్మకాయ చాలా సులభంగా శుభ్రం చేస్తుంది. ఎందుకంటే నిమ్మకాయలో సహజంగా యాసిడ్ ఉంటుంది. ఇది సిరా మరకులను తొలగించడంలో సమర్థవంతంగా పని చేస్తుందిద. ఇది సహజ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. దుస్తులకు ఎలాంటి హాని కలిగించదు. ఇది బేకింగ్ సోడా , వెనిగర్ కంటే మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది.
నిమ్మకాయతో ఎలా శుభ్రం చేయాలంటే...
నిమ్మరసం పూయండి: ముందుగా, సగం కోసిన నిమ్మకాయ నుండి రసాన్ని నేరుగా మరక ఉన్న ప్రదేశంలో రాయండి.
సున్నితంగా రుద్దండి: నిమ్మరసం మరకలోకి చొచ్చుకుపోయేలా ఫాబ్రిక్‌ను సున్నితంగా రుద్దండి.
నిమ్మకాయలోని ఆమ్లం మరకను విచ్ఛిన్నం చేసేలా 5-10 నిమిషాలు ఫాబ్రిక్‌పై అలాగే ఉండనివ్వండి.
గోరువెచ్చని నీటితో కడగాలి: ఇప్పుడు మరక పడిన ప్రదేశాన్ని గోరువెచ్చని నీటితో ఉతకాలి.
సబ్బుతో శుభ్రం చేయండి: మరక పూర్తిగా తొలగకపోతే, తేలికపాటి డిటర్జెంట్‌ను అప్లై చేసి చేతితో కడగాలి.
ఎండలో ఆరబెట్టండి: సహజ సూర్యకాంతిలో బట్టలు ఆరబెట్టడం వల్ల మరక పూర్తిగా తొలగిపోతుంది.
2025-02-04T07:29:17Z