KUMBHA RASI UGADI RASI PHALALU 2023-24 ఉగాది తర్వాత కుంభ రాశి వారికి శని ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...!

Kumbha Rasi Ugadi Rasi Phalalu 2023-24 తెలుగు పంచాంగం ప్రకారం ఈ మాసం మార్చి 22వ తేదీన ఉగాది పండుగ నాడు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. ఈ నేపథ్యంలో కుంభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో చూడండి...

Kumbha Rasi Ugadi Rasi Phalalu 2023-24 హిందూ పంచాంగం ప్రకారం, శ్రీ ‘శోభకృత్’ నామ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాం. ఉగాది నుంచి ప్రారంభమైన తెలుగు వారి నూతన సంవత్సరం 8 ఏప్రిల్ 2024న ముగుస్తుంది. తెలుగు వారి 60 సంవత్సరాల్లో ఇది 37వది. ఇదిలా ఉండగా ఉగాది తర్వాత కుంభ రాశి వారికి గ్రహాల ప్రభావంతో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వివిధ రంగాల్లో మీరు కొన్ని ప్రతికూల ఫలితాలను పొందాల్సి ఉంటుంది. శని గ్రహం ప్రభావం కారణంగా మీ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు కుంభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కుంభంలో గ్రహాల సంచారం..

ఉగాది తర్వాత ఈ రాశి నుంచి సూర్యుడు 16 మే 2023 నుంచి 15 జూన్ 2023 వరకు కుంభ రాశిలో అర్ధాష్ట స్థానంలో సంచారం చేయనున్నాడు. 18 సెప్టెంబర్ 2023 నుంచి 18 అక్టోబర్ 2023 వరకు, 13 ఫిబ్రవరి 2024 అష్టమ లగ్నంలోకి ప్రవేశించనున్నాుడ. మరోవైపు కుజుడు 17 ఆగస్టు 2023 నుంచి 2 అక్టోబర్ 2023 వరకు అష్టమ స్థానంలో రవాణా చేయనున్నాడు. గురుడు శుభ స్థానం ద్వారా సంచారం చేయనున్నాడు. ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. రాహువు, కేతువులు ఏడాది పొడవునా శుభ స్థానాల నుంచి సంచారం చేయనున్నారు.

Makar Rasi Ugadi Rasi Phalalu 2023-24 ఉగాది తర్వాత మకర రాశి వారికి కెరీర్లో కొత్త అవకాశాలొస్తాయి...!

ఆదాయం-11, వ్యయం-05

ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. కొందరు వ్యక్తులు సానుకూల ఫలితాలను పొందొచ్చు. మరికొందరు ఆర్థిక పరమైన జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడులు లేదా జాయింట్ వెంచర్ల ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలున్నాయి. పరిశోధన, ఇతర సంబంధిత రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. దీంతో మీరు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. అయితే శని గ్రహం కారణంగా కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా పెట్టుబడి పెట్టడం, ఊహించని ఖర్చులను నివారించడం, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.

కుటుంబ జీవితంలో..

తెలుగు నూతన సంవత్సరంలో కుంభ రాశి వారికి రాజపూజ్యం -05, అవమానం-06గా ఉంటాయి. ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. గురుడి స్థానం కారణంగా మీ కుటుంబ సభ్యులతో సంబంధాల్ని బలోపేతం చేసుకునే అవకాశాల్ని పొందుతారు. గతంలో ఏర్పడిన విభేదాలు, అపార్థాలను తొలగించుకునేందుకు ఈ సమయం మంచిగా ఉంటుంది. శని గ్రహం కారణంగా కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు పెరగొచ్చు. ఈ కాలంలో కుటుంబ సభ్యులతో బహిరంగ సంభాషణను నిర్వహించడం చాలా ముఖ్యం.

విద్యా పరంగా..

ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. మీరు అనేక విషయాలపై లోతుగా అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకుంటారు. ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ ఉండటం చాలా ముఖ్యం. మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఉపాధ్యాయులు, సలహాదారుల నుంచి మద్దతు పొందడం చాలా ముఖ్యం.

Dhanasu Rasi Ugadi Rasi Phalalu 2023-24 ఉగాది తర్వాత ధనస్సు రాశి వారికి ఊహించని ఖర్చులు, సవాళ్లు ఎదురవుతాయి...!

కెరీర్ పరంగా..

ఈ రాశి వారికి ఉగాది తర్వాత కెరీర్ పరంగా సానుకూల ఫలితాలొస్తాయి. మీరు పని చేసే రంగంలో పురోగతి లభిస్తుంది. గురుడి ప్రభావంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు. పరిశోధన, ఇతర సంబంధిత రంగాలలో విజయం సాధిస్తారు. గ్రహాల కదలిక వల్ల మీ కెరీర్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీకు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు అవకాశాలు రావొచ్చు. ఈ కాలంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు కష్టపడి పని చేయడం, లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి. ఈ కాలంలో ప్రతికూల ఫలితాలొచ్చే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

ఆరోగ్య పరంగా..

ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్య పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ శక్తి సామర్థ్యాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు అనారోగ్యానికి గురి కావొచ్చు. ఈ కాలంలో అలసట, తక్కువ నిరోధకశక్తికి గురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడి, ప్రతికూలతలకు దూరంగా ఉండాలి.

వివాహ జీవితంలో..

ఈ రాశి వారిలో వివాహితులకు సంబంధాల పరంగా ఉగాది తర్వాత మిశ్రమ ఫలితాలు రావొచ్చు. శని సంచారం సమయంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనను ఏర్పరచుకోవడం లేదా తగిన భాగస్వామిని కనుగొనడం కష్టంగా అనిపించొచ్చు. అయితే గురుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ భాగస్వామితో లోతైన స్థాయి నిబద్ధత, సాన్నిహిత్యం లేదా భాగస్వామ్య అనుభవాలు, సవాళ్ల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మరోవైపు ఈ కలంలో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. రొమాంటిక్ భాగస్వామి కోసం అన్వేషించే వారు చాలా ఓపికగా ఉండాల్సి రావొచ్చు. మీరు ఇప్పటికే నిబద్ధతతో సంబంధం కలిగి ఉంటే, మీ భాగస్వామితో మీ కనెక్షన్, నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి, మీ భవిష్యత్తు కోసం బలమైన పునాదిని నిర్మించడంపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పాటించాల్సిన పరిహారాలు..

* శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి.

* 14 ముఖాల రుద్రాక్షలను ధరించాలి.

* శనివారం రోజున నీలం రత్నాన్ని ధరించి ఏదైనా శివ స్తోత్రాలను పఠించాలి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

2023-03-27T10:20:20Z dg43tfdfdgfd