LONG HAIR: బియ్యం నీటిలో ఇదొక్కటి కలిపి జుట్టుకు పెడితే ఏమౌతుందో తెలుసా?

బియ్యం నీటిలో  లవంగాలను కలిపి జుట్టుకు రాయడం వల్ల.. మీ జుట్టు చాలా తక్కువ  సమయంలోనే నడుము పొడవు వరకు పెరుగుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

 

వయసు పెరుగుతున్నా కూడా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా నిగనిగలాడుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో హెయిర్ గ్రోత్ ఆయిల్స్, సీరమ్స్ వాడేస్తూ ఉంటారు. కానీ... వాటిల్లో ఉండే కెమికల్స్ జుట్టును మరింత నాశనం చేస్తాయని తెలుసుకోలేరు. వాటి వల్ల జుట్టు పొడవుగా పెరగడం పక్కన పెడితే.. మరింతగా ఊడిపోయే అవకాశం ఉంది.

 

అయితే.. అలా అని జట్టును వదిలేయమని కాదు.. కేవలం మన అందరి ఇళ్లల్లో లభించే రెండు పదార్థాలతో జుట్టును పొడవుగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? అది మరేంటో కాదు... బియ్యం నీరు.  మీరు చదివింది నిజమే. బియ్యం నీటిలో  లవంగాలను కలిపి జుట్టుకు రాయడం వల్ల.. మీ జుట్టు చాలా తక్కువ  సమయంలోనే నడుము పొడవు వరకు పెరుగుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

 

ఆంచల్ జైన్ ఒక కంటెంట్ క్రియేటర్. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పొడవాటి జుట్టు కోసం వాడే టిప్స్ ని షేర్ చేస్తుంది. ఇటీవల ఆమె ఒక హెయిర్ టోనర్ తయారీ విధానాన్ని కూడా షేర్ చేసింది. దీన్ని ఆమె స్వయంగా ఉపయోగించి, తన జుట్టుని పొడవుగా పెంచుకుంది. ఈ హెయిర్ టోనర్ తయారీకి ఏమేమి కావాలో చూద్దాం.

హెయిర్ గ్రోత్ టోనర్ తయారీకి కావాల్సినవి

బియ్యం - 2 స్పూన్లు

నీళ్ళు - 1 గ్లాసు

లవంగాలు - 8-10

హెయిర్ గ్రోత్ టోనర్ తయారీ విధానం

టోనర్ తయారీ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో 2 స్పూన్ల బియ్యం, నీళ్ళు, లవంగాలు వేయాలి.

4-5 గంటలు నానబెట్టాలి. అప్పుడు ఆ నీళ్ళు పసుపు రంగులోకి మారతాయి.

టోనర్ తయారైన తర్వాత స్ప్రే బాటిల్ లో నింపి జుట్టుకు పట్టించాలి.

దీనికి ఎలాంటి వాసనా ఉండదు కాబట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చు. జుట్టు కూడా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు.

రాత్రి పడుకునే ముందు ఈ టోనర్ ని జుట్టుకు పట్టించడం మంచిది.

 

జుట్టుకు లవంగాలు, బియ్యం నీళ్ళ ప్రయోజనాలు

ముందుగా లవంగాల గురించి మాట్లాడుకుంటే, ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి. జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. బియ్యం నీళ్ళలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టుకు మెరుపునిస్తాయి. జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి.

2025-02-04T11:29:19Z