Marriage | రెండు మనసులు ముడిపడటమే పెళ్లి (Marriage) . అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తుంది. అయితే, జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.. నేటి తరం యువతీ యువకులు. ఎంగేజ్మెంట్ రింగ్స్ నుంచి.. ఫొటోలు, గిప్ట్స్, బంగారు ఆభరణాలు, వెడ్డింగ్ డ్రెస్సెస్ అన్నీ చాలా గ్రాండ్‌గా, రిచ్‌గా కనిపించేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. కొందరు చేతిలో డబ్బులేకపోయినా లోన్స్ తీసుకుని మరీ వివాహ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అయితే, ఇలా వివాహ వేడుకలకు ఎక్కు వ ఖర్చు చేసే జంటలు విడిపోయే (Divorce) అవకాశం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.
అమెరికాలో ఎకనామిక్స్ ప్రొఫెసర్లు 3,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులపై సర్వే చేశారు. ఇందులో ఎంగేజ్మెంట్ రింగ్, వివాహ వేడుకకు అయ్యే ఖర్చును వీరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ఖరీదైన నిశ్చితార్థపు ఉంగరాన్ని కొనుగోలు చేసే జంట విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తించారు. రింగ్ ధర రూ. 1.6 లక్షల నుంచి రూ. 3.3 లక్షలు మధ్య ఉంటే.. ఆ జంట విడాకులు తీసుకునే ప్రమాదం 1.3 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది.
ఇక వేడుకల ఖర్చు విషయానికి వస్తే.. ఖరీదైన వివాహాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకున్న జంటలు విజయవంతంగా తమ వైవాహిక జీవితాన్ని గడుపుతాయని అధ్యయనంలో వెల్లడైంది. రూ. 82,000 కంటే తక్కువ ఖర్చుతో వివాహం చేసుకున్న జంటలు విడాకులు తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. రూ. 16.5 లక్షలు కంటే ఎక్కువ ఖర్చు చేసి ఒక్కటైన జంటలు విడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. అయితే, వివాహాలకు ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకు అస్థిర వివాహాలకు దారితీస్తుందన్న విషయాన్ని మాత్రం అధ్యయనం స్పష్టం చేయలేదు.
Also Read..
Sydney | సిడ్నీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలను అదుపుచేస్తున్న 100 మంది సిబ్బంది
Kerala State Lotteri | కేరళ లాటరీ డ్రా.. రూ.12 కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి
Manipur Violence | అల్లర్లతో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు.. రూ.1800 చేరిన వంట గ్యాస్
2023-05-25T10:05:25Z dg43tfdfdgfd