MRIGASHIRA KARTE | గోదావరిఖనిలో మృగశిర సందడి.. ఇంటింటా పచ్చి చేపల పులుసు ఘుమఘుమలు

Mrigashira Karte | కోల్ సిటీ, జూన్ 8: రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ నుంచి ఉపశమనంగా మృగశిర కార్తె ఆదివారం నుంచి ఆగమనమైంది. మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీ. దీర్ఘకాలిక అనారోగ్యాలకు విరుగుడుగా మృగశిర రోజున పచ్చి చేపల పులుసు లేని ఇల్లంటూ ఉండదనుకోండి. ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్దల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. దీంతో గోదావరిఖనిలో తెల్లవారు జామున నుంచే మృగశిర సందడి కనిపించింది.

నగరంలోని ప్రధాన చేపల మార్కెట్‌తోపాటు రోడ్ల ప్రక్కన చేపల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఎన్టీపీసీ, ఎల్లంపల్లి డ్యామ్‌తోపాటు గోదావరి నది, చుట్టు ప్రక్కల గ్రామాల చెరువుల నుంచి పెద్ద సంఖ్యలో చేపలను తీసుకువచ్చి రోడ్ల పక్కన కుప్పలుగా పోసి విక్రయించారు. మృగశిర కావడంతో చేపలకు ఉన్న గిరాకీతో సాధారణ రోజుల కంటే అధిక ధరలకు విక్రయించారు.

ఐనప్పటికీ స్థానికులు చేపలు కొనేందుకు ఎగబడ్డారు. ఇక ఇంటింటా పచ్చి చేపల పులుసు వంటకాలు ఘుమ ఘుమలాడాయి. అలాగే గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బత్తిని వంశస్థులు చేప మందు పంపిణీ చేయగా, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు చేప మందు ప్రసాదంను తీసుకున్నారు.

Read Also : 

Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య

Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్‌లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి

2025-06-08T15:25:37Z