NUMEROLOGY: మే 24న జన్మించిన వారు చాలా స్మార్ట్‌.. బాధ్యతలకు విలువిస్తారు!

Numerology: ఇండియాలో ఎక్కువ మంది తల్లిదండ్రులు, పిల్లలు పుట్టిన వెంటనే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. జ్యోతిష్కులు, న్యూమరాలజీ(Numerology) నిపుణులను ఆశ్రయిస్తారు. పుట్టిన పిల్లలకు భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే, నిపుణుల సూచనల మేరకు తగిన పరిహారాలు చేసుకుంటారు. ఎదిగిన తర్వాత కూడా జీవితం సక్రమంగా లేకపోతే చాలా మంది వీటిపై ఆధారపడుతారు.

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. పుట్టిన తేదీలోని అంకెల మొత్తం, అదృష్ట సంఖ్య వంటి అంశాలపై ఆధారపడి జీవితంలో మంచి, చెడులు చోటు చేసుకుంటాయని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం మే 24న జన్మించిన వారి ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

* లక్కీ కలర్స్‌, డే

వీరిపై శుక్రవారాలతో సంబంధం ఉన్న నంబర్‌ 6 ప్రభావం ఉంటుంది. బ్లూ, వైట్‌ కలర్స్‌ వీరికి అదృష్టాన్ని తెస్తాయి. సోమవారం, శుక్రవారం ప్రత్యేకంగా అనుకూలమైన రోజులు.

* లక్కీ నంబర్స్‌

2, 6 నంబర్‌లు వీరి జీవితంలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. సానుకూల శక్తిని తీసుకువస్తాయి.

Simple One e-scooter: సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ ప్రయాణం..మార్కెట్లోకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..

* బలాలు, గుణాలు

మే 24న జన్మించిన వ్యక్తులు స్మార్ట్‌గా ఉంటారు. అంతే కాకుండా గ్రేట్‌ సెన్స్‌ ఆఫ్‌ స్టైల్‌ ఉంటుంది. లైఫ్‌లో ఆర్టిస్టిక్‌ అప్రోచ్‌ ఉంటుంది. హ్యాండిక్రాఫ్ట్స్‌లో నైపుణ్యం ఉంటుంది. వెల్ మేనేజ్డ్‌, ఆర్గనైజ్డ్‌గా ఉండటం వీరి బలాలలో ఒకటి. బాధ్యతకు ఎక్కువ విలువ ఇస్తారు. సమాజం, దేశం పట్ల లోతైన కర్తవ్యాన్ని ఫీల్‌ అవుతారు. వీరి క్రియేటివిటీ ప్రత్యేకమైంది, దయగల హృదయం ఉంటుంది. పరిస్థితుల ఆధారంగా సులువుగా కలిపిసోతారు. డౌన్ టు ఎర్త్, ఉత్సాహవంతులు, విశ్వసనీయులు, చక్కనైన వర్క్‌ స్టైల్‌ ఉంటుంది.

* పని చేయవలసిన ప్రాంతాలు

వీరికి అనేక బలాలు ఉన్నప్పటికీ, అభివృద్ధి కోసం కొన్నింటిపై శ్రద్ధ చూపాలి. కొన్నిసార్లు చాలా బాధ్యతలను తీసుకుంటారు. దీన్ని పరిశీలించాలి. మీ ఫ్లెక్సిబుల్‌ నేచర్‌ను ఇతరులు ఉపయోగించుకోవచ్చు, కాబట్టి సరిహద్దులను సెట్ చేయడం చాలా అవసరం. ఇతరులను అనుమానించే, ఒంటరితనానికి భయపడే ధోరణిని కలిగి ఉండవచ్చు. కల్పిత జీవితంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల ముందు సొంత అవసరాలను చూసుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి.

* అనుకూలమైన కెరీర్ ఆప్షన్‌లు

ప్రత్యేక లక్షణాలు, బలాలను బట్టి, అనేక కెరీర్ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. యాక్సెసరీస్‌, వాటి తయారీ, నగలు, ఆహారం, చాక్లెట్, లోహాలు, డెర్మటాలజీ, రక్షణ సేవలు, దుస్తులు, రెస్టారెంట్లు, యాక్టింగ్‌, దుస్తులు, నగల డిజైనింగ్, ఇంటీరియర్ డెకర్, డిజైనింగ్, స్టాక్‌బ్రోకింగ్, కమీషన్ ఏజెన్సీ, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లకు సంబంధించిన పరిశ్రమలలో రాణిస్తారు. అలాగే గృహోపకరణాలు, గ్లాస్, రాజకీయాలలో కూడా అడుగు పెట్టవచ్చు.

* పరిహారం

- స్థిరత్వం, శాంతి కోసం ఆవులను సంరక్షించండి లేదా ఆశ్రమాలలో గడపండి.

- శ్రేయస్సు, మనశ్శాంతిని ఆకర్షించడానికి లక్ష్మీ దేవికి పూజలు చేయండి.

- ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఇంటికి సమీపంలో ఆఫీస్‌ ఉండేలా చూసుకోండి.

- పాజిటివ్ ఎనర్జీ కోసం బ్లూ కలర్‌ మొబైల్ కవర్ లేదా వాలెట్‌ని ఎంచుకోండి.

- అదృష్టాన్ని మెరుగుపరచుకోవడానికి ఎడమ చేతికి వెండి లేదా రోజ్ గోల్డ్ మెటాలిక్ వాచ్ ధరించండి.

- మాంసాహారం, మద్యం, పొగాకు, జంతువుల చర్మం, తోలు వంటి అన్నింటికీ దూరంగా ఉండాలి.

2023-05-24T10:26:28Z dg43tfdfdgfd