REHEATING FOOD: పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేయకూడదు..!

మనం చాలాసార్లు మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటానికి ఫ్రిజ్‌లో ఉంచి మళ్ళీ వేడి చేసి తింటాం. కానీ కొన్ని ఆహార పదార్థాలను ఇలా వేడి చేసి తినడం వల్ల విషంగా మారొచ్చు.

చల్లటి ఆహారాన్ని మళ్ళీ వేడి చేయడం సాధారణ అలవాటు. కానీ మళ్ళీ మళ్ళీ వేడి చేసిన ఆహారాలు ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా?. అవును, మనం చాలాసార్లు మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటానికి ఫ్రిజ్‌లో ఉంచి మళ్ళీ వేడి చేసి తింటాం. కానీ కొన్ని ఆహార పదార్థాలను ఇలా వేడి చేసి తినడం వల్ల విషంగా మారొచ్చు.లేదా వేడి చేసినప్పుడు వాటి పోషకాలు నష్టపోవచ్చు. కాబట్టి మనం ఏ ఆహారాన్ని పదే పదే వేడి చేయకూడదో చూద్దాం…

మిగిలిన అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే, బాసిల్లస్ సీరియస్ అనే బ్యాక్టీరియా అందులో పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వండిన తర్వాత కూడా జీవించగలదు.అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. ఈ విషపూరిత అంశాలు మళ్ళీ వేడి చేసినప్పుడు పూర్తిగా నాశనం కావు.ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం కావచ్చు.

ఉడికించిన గుడ్లను మళ్ళీ వేడి చేయడం వల్ల వాటి రుచి పాడవడమే కాకుండా, అది మీ జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల గుడ్లలోని ప్రోటీన్ మారవచ్చు, జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది.శరీరానికి హానికరం కూడా కావచ్చు.

పాలకూరలో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి.ఇది శరీరానికి మంచిది, కానీ దీన్ని మళ్ళీ వేడి చేసినప్పుడు, ఈ నైట్రేట్‌లు నైట్రోసమైన్‌లుగా మారవచ్చు. నైట్రోసమైన్‌లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదకర క్యాన్సర్ కారకాలు. కాబట్టి పాలకూరను ఫ్రెష్‌గా తినండి.

మష్రూమ్స్‌లోని ప్రోటీన్‌లు త్వరగా పాడవుతాయి. వాటిని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల వాటి రుచి పాడవడమే కాకుండా, అది మీ కడుపుకి హాని చేస్తుంది. పాడైన లేదా మళ్ళీ వేడి చేసిన మష్రూమ్స్ తినడం వల్ల గ్యాస్, అజీర్ణం లేదా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి, మష్రూమ్స్‌ని వెంటనే తినడం మంచిది.

ఉడికించిన బంగాళదుంపలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే, క్లోస్ట్రిడియం బొటులినమ్ అనే బ్యాక్టీరియా అందులో పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఒక రకమైన విషాన్ని ఉత్పత్తి చేస్తుంది, దీన్ని మళ్ళీ వేడి చేసిన తర్వాత కూడా పూర్తిగా తొలగించలేము. ఇది ఫుడ్ పాయిజనింగ్ లాంటి తీవ్రమైన సమస్యను కలిగిస్తుంది.

2025-06-10T13:04:19Z