Krishnapingala Sankashti Chaturthi 2023 in June: ప్రతి నెల కృష్ణ, శుక్ల పక్షంలో వచ్చే చతుర్థికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. పంచాగం ప్రకారం ఈ రోజు హిందువులంతా..గణేషుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే కృష్ణ పక్ష చతుర్థి సంకష్టి చతుర్థి రోజున వినాయుకుడికి ఉపవసాలతో పాటు పూజా కార్యక్రమాలు చేస్తారు. అంతేకాకుండా ఈ కృష్ణ పక్ష చతుర్థిని శుక్ల పక్ష చతుర్థిని వినాయక చతుర్థి అని కూడా అంటారు.
ఆషాఢ మాసంలో మొదటి చతుర్థి వ్రతం 07 జూన్ (ఈ రోజు) జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. బుధవారం వచ్చే సంకష్ట చతుర్థి చాలా పవిత్రమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నిపుణుల సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉపవాసాలు పాటించడం వల్ల జీవితంలోని ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా వినాయకుడి అనుగ్రహం కూడా సులభంగా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
గణేషుడి పూజలో తప్పకుండా వీటిని సమర్పించాల్సి ఉంటుంది: మోదకం: మోదకం వినాయకుడికి చాలా ఇష్టమైనది. అందుకే గణేషుడి పూజలో నైవేద్యంగా మోదకాలను తప్పకుండా సమర్పిస్తారు. లేకపోతే పూజా అసంపూర్ణంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఎర్రటి పువ్వులు: గణేషుడికి ఎర్రటి పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం. అందుకే అందరూ వినాయకుడికి ఎర్రటి పూలను పూజలో భాగంగా సమర్పిస్తారు. అంతేకాకుండా బంతి పూలను సమర్పించడం కూడా ఆనవాయితిగా వస్తోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
అరటిపండు: గణపతికి ఆరటి పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి వినాయకుడి దేవాలయంలో అరటిపండును నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఈ పూజలో భాగంగా అరటి పండ్లను సమర్పిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
గరక పోసలు: వినాయకుడి పూజలో 21 నుంచి 11 గరక పోసలతో దండను అల్లీ సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సిందూరం: గణేశుని పూజించే క్రమంలో సిందూరం వినియోగించడం పూర్వీకుల నుంచి వస్తోంది. సంకష్ట చతుర్థి ఆరాధనలో సిందూరంతో గణేషుని తప్పకుండా తిలకం దిద్దాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
2023-06-07T10:23:45Z dg43tfdfdgfd