నేటి కాలంలో ఫ్యాషన్ మీనింగ్ పూర్తిగా మారిపోయింది. రకరకాల చాలా మంది రకరకాల ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు. అయితే కొంత మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తుంటారు. ఈ అలవాటు యువతలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాళ్లు దురదగా అనిపించడం వల్ల.. వీళ్లు ప్రతిరోజూ సాక్స్ ధరించరు. సాక్స్ లేకుండానే బూట్లు వేసుకుని చక్కా తిరిగేస్తుంటారు. పైగా ధరించే సాక్స్ నుండి వాసన వస్తే? అనే కారణంతో కూడా చాలా మంది సాక్క్‌కి దూరంగా ఉంటారు. అయితే ఇలా సాక్స్ ధరించకుండా నేరుగా బూట్లు ధరిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ అలవాటు చాలా సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ అలవాటు కాళ్లకు హాని కలిగించడమే కాకుండా అనేక సమస్యలను కూడా ఆహ్వానిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది శరీర రక్త ప్రసరణపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల మీ పాదాల భాగాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది.
సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలలో అలెర్జీ సమస్యలు వస్తాయి. కొంతమందికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. కాబట్టి సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలలో అలెర్జీ సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నివేదికల ప్రకారం.. సగటున ఒక వ్యక్తి పాదాలు ప్రతిరోజూ 300 మి.లీ. చెమటను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే, ఈ చెమట తేమను పెంచుతుంది. ఇది అనేక రకాల బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలపై చెమట పేరుకుపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పాదాలు దుర్వాసన వస్తాయి. సాక్స్ సరిగ్గా ధరించకపోతే, పాదాలు మురికిగా మారి బ్యాక్టీరియాకు ఆశ్రయంగా మారుతాయి. దీనివల్ల పాదాలపై దురద, బొబ్బలు కూడా వస్తాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.
2025-06-10T09:13:45Z