Shukra Rahu Yuti Lucky For 3 Zodiac Signs: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు, దుష్ట గ్రహమైన రాహువు మేషరాశిలో సంచరిస్తున్నారు. మేషరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.
రాహు-శుక్ర సంయోగం ఈ రాశులకు వరం మేషం: ఇదే రాశిలో శుక్రుడు, రాహువు కలయిక ఏర్పడింది. వీరిద్దరి సంయోగం వల్ల మేషరాశి వారు శుభఫలితాలను పొందుతారు. మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి. డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ జీతంలో పెరుగుదల ఉంటుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు.
మిథునం: రాహువు, శుక్రుల సంయోగం మిథునరాశి వారికి చాలా శుభప్రదం. ఈ సమయంలో మీరు ప్రయోజనాలను మాత్రమే పొందుతారు. మీకు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు మీరు పెద్ద పెద్ద ఆర్డర్‌లను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మకరం: రాహువు, శుక్రుల సంయోగం మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ కూటమి మీకు లగ్జరీ లైఫ్ ను ఇస్తుంది. మీరు కొత్త ఇల్లు, కారు లేదా ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా ఉండిపోయిన మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగం చేసేవారి జీతాలు పెరుగుతాయి. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. వ్యాపారస్తులకు ధనం లభిస్తుంది. లవ్ లైఫ్ బాగుంటుంది.
Also Read: Jupiter set 2023: రేపు మీనరాశిలో గురుడు అస్తమయం.. వచ్చే నెల రోజులపాటు ఈ 5 రాశులకు ఇబ్బందులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
2023-03-27T13:23:27Z dg43tfdfdgfd