యాలకులు కేవలం రుచికి మాత్రమే కాకుండా..మన చర్మ సౌందర్యం పెంచడానికి సహాయపడుతుందని మీకు తెలుసా? దానికోసం యాలకులను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీయ వంటకాల్లో యాలకులను వాడుతూనే ఉంటారు.మంచి సువాసనను వెదజెల్లే ఈ యాలకులు వంటకు మంచి రుచిని, సువాసనను అందిస్తాయి. ఈ యాలకులు కేవలం రుచికి మాత్రమే కాకుండా..మన చర్మ సౌందర్యం పెంచడానికి సహాయపడుతుందని మీకు తెలుసా? దానికోసం యాలకులను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
యాలకులలో చాలా పోషకాలు ఉన్నాయి. ఏ, బి, సీ విటమిన్లతో పాటు మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే, మన జుట్టు అందంగా, జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి సహాయపడతాయి. అందుకే చాలా రకాల బ్యూటీ ఉత్పత్తుల తయారీలో వీటిని వాడుతూ ఉంటారు.
ముఖానికి యాలకుల నూనె..
చాలా మంది ముఖం అందంగా కనిపించాలని వేల రూపాయలు ఖర్చు చేసే ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. వాటిలో అన్నీ చర్మానికి మేలు చేయకపోవచ్చు. వాటికి బదులు మీరు యాలకుల నూనె వాడొచ్చు. మార్కెట్లో మనకు యాలకుల నూనె లభిస్తుంది.రెండు చుక్కల నూనెను ముఖానికి రాసి మంచిగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. రెగ్యులర్ క్లెన్సర్ గా కూడా మీరు దీనిని వాడొచ్చు.
మొటిమలు తొలగించే యాలకుల నూనె...
ముఖంపై మొటిమలు కొత్త విషయం కాదు. మీరు దీనికి ఇంటి నివారణను ప్రయత్నించాలనుకుంటే, మీరు మీ చర్మంపై యాలకులను ఉపయోగించవచ్చు. యాలకుల పొడికి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. తర్వాత మీరు దానిని మీ ముఖంపై అప్లై చేయవచ్చు. 10 నిమిషాలు అలాగే ఉంచి మీ ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మొటిమలు చాలా వరకు తగ్గుతాయి.
యవ్వనంగా మార్చే యాలకులు..
చిన్న వయసులో ముఖంపై వయసు మచ్చలు వస్తూ ఉంటాయి. దీని కోసం మీరు యాలకులను ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని నిర్విషీకరణ చేస్తాయి. అందువల్ల, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. మీ ముఖంపై సన్నని గీతలు ఉంటే, యాలకులు వాటిని సరిచేస్తాయి. చర్మ రంగును కూడా మెరుగుపరుస్తాయి.
యాలకుల నూనె మెరిసే చర్మాన్ని ఇస్తుంది
యాలకులు చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. యాలకుల చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు చర్మాన్ని మెరిసేలా,తేమగా చేస్తాయి. దీని కోసం, యాలకుల పొడి,పెరుగును సమాన పరిమాణంలో కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ముఖంపై బాగా పూయండి. తర్వాత 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
జుట్టు కోసం..
యాలకుల నూనెను రెగ్యులర్ గా జుట్టుకు రాసి మసాజ్ చేయడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. జుట్టు అందంగా పెరిగేలా చేస్తుంది.
2025-03-11T11:14:15Z