సాధారణంగా చాలా మందికి మధ్యాహ్నం తినగానే నిద్ర వస్తుంటుంది. ఆ టైంకి ఏం పనిలేకుండా ఇంటి దగ్గర ఉంటే ఒకే. కానీ ఆఫీస్ లో ఉంటే పరిస్థితి ఏంటీ? మరి ఈ మధ్యాహ్నం నిద్ర నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న కునుకు వేయడం అలవాటుగా ఉంటుంది. తిన్న తర్వత నిద్ర రావడం సహజం. కానీ తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంక ఆఫీసులోగాని పనిచేస్తుంటే అక్కడ వెంటనే నిద్రపోలేరు. అది నిద్ర పోవడానకిి అనువైన ప్లేస్ కూడా కాదు. మరి ఆఫీసులో మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వస్తే ఏం చేయాలి? కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
సాధారణంగా ఎక్కువగా తిన్నప్పుడు నిద్ర రావడం సహజం. మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తింటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. కాబట్టి ఎక్కువగా తినకుండా ఉండండి. ఒకేసారి ఎక్కువ తినడానికి బదులు తరచుగా కొద్ది కొద్దిగా తినండి. ఇలా తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నిద్ర కూడా రాదు.
పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినండి
శరీరం అలసిపోయినప్పుడు నిద్ర రావడం మొదలవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తే పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినండి. ఇది శరీరానికి శక్తినిస్తుంది. పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు.
రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే పగటిపూట నిద్ర వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తే లేదా అలసిపోయినట్లు అనిపిస్తే, రాత్రి సరిగ్గా నిద్రపోలేదని అర్థం. రాత్రి 10 గంటల లోపు నిద్రపోయి ఉదయం 6-7 గంటల మధ్య లేవాలి. ఇలా చేస్తే మీకు నిద్ర సరిపోతుంది. అలసట తగ్గుతుంది. రాత్రి బాగా నిద్రపోతే మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర రాదు.
చూయింగ్ గమ్:
చూయింగ్ గమ్ అలసటను తగ్గిస్తుంది. ఉత్తేజాన్నిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, భోజనం తర్వాత ఐదు నిమిషాలు చూయింగ్ గమ్ నమిలితే నిద్ర రాకుండా ఉంటుంది.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు హైడ్రేటెడ్‌గా లేకపోతే, మధ్యాహ్నం భోజనం తర్వాత ఖచ్చితంగా నిద్ర వస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీనికోసం తరచుగా నీరు తాగాలి. కావాలంటే నిద్ర వచ్చినప్పుడల్లా గ్రీన్ టీ లేదా కాఫీ తాగవచ్చు.
నడవండి:
చాలామంది భోజనం చేసిన వెంటనే ఆఫీసు పని మొదలుపెడతారు. దీనివల్ల వారికి లేజీగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. తర్వాత నిద్ర రావడం మొదలవుతుంది. మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర రాకుండా ఉండటానికి 10-15 నిమిషాలు మెట్లు ఎక్కి దిగండి. లేదా నడవండి. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి, అవసరమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది.
సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. భోజనం ఆలస్యమైతే నిద్ర ఎక్కువగా వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1-2 గంటల మధ్య భోజనం చేయండి.
చక్కెర, కొవ్వు పదార్థాలు:
చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానుకోండి. ఇవి మీకు అలసటను కలిగిస్తాయి. దీనివల్ల మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుంది. బదులుగా, ఇనుము, ప్రోటీన్లు, పోషకమైన ఆహారాలను భోజనంలో చేర్చుకోండి. ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత వచ్చే అలసటను తగ్గిస్తుంది.
2025-02-04T10:29:17Z