SPECIAL ICE CREAM: ఐస్క్రీమ్ లందు ఇది వేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది

K Sai Trinath, News18, Vijayawada

Special Ice Cream:  విజయవాడ నగర ప్రజలను కొత్త రకం రోలర్ ఫాలోడా ఆకర్షిస్తుంది. లబ్బిపేటలోని ఈట్ స్ట్రీట్ లో ప్రత్యేక ఆకర్షణగా ఈ రోలర్ ఫాలోడాఐస్క్రీమ్ ప్రియులను ఆకర్షిస్తుంది. మిక్సడ్ ఫ్రూట్, ఫ్లావోర్డ్ ఐస్క్రీమ్ రోలర్. చూడగానే కొత్తగా ఎలా ఉంటుందనే అనుభూతితో తప్పకుండా రుచి చూడాలి అనుకుంటారు. తమదైన స్టైల్లో కొత్తగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎక్కడ లేని విధంగా ఈ ఐస్క్రీమ్ రోలర్ను రూపొందించి రుచితో మరియు ఐస్క్రీమ్ రకాలతో నోరు ఊరిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ఉద్యోగులు సాయంత్రం సమయాల్లో సరదాగా బయటకి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ నగరంలో ముందుగా గుర్తు వచ్చేది లబ్బిపేటలోని ఈట్ స్ట్రీట్. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తుంటాయి.

ఇక్కడ ఈ ప్రత్యేక రోలర్ ఫాలోడా ఐస్క్రీమ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మళ్లీ మళ్లీ తినాలి అనిపించేలా చేస్తోంది. ఈ రోలర్ ఫాలోడా ఐస్క్రీమ్ తమ సొంత రెసెపితో, కొత్తగా ఉండాలి అనే అలోచనతో కొత్త రకం రోలర్ ఫాలోడా ఐస్క్రీమ్ బిజినెస్ మొదలు పెట్టాం అని నిర్వాహకులు తెలిపారు.

నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ......

ఐస్క్రీమ్ ఫాలోడా అంటే బయట చాలా రకాల ఫాలోడాలు ఉన్నాయి. వాటికిభిన్నంగా కొత్తగా మొదలు పెట్టాలి అనే ఆలోచనతో ఈ రోలర్ ఫాలోడా ఐస్క్రీమ్ని నూతనంగా ఆవిష్కరించామని తెలియచేసారు. ఈ రోలర్ ఫాలోడా ఐస్క్రీమ్ మిక్సడ్ ఫ్రూట్ జ్యూసులతో తయారు చేస్తామని వివరించారు.

ఇదీ చదవండి పెట్రోల్ నాణ్యత ఎలా తెలుసుకోవాలి.. మంచిదేనా, లేక కల్తీనా..? ఎలా చెక్ చేయాలి..?

తెలుగు రెండు రాష్ట్రాలలో ఇలాంటి రోలర్ ఫాలోడా ఐస్క్రీమ్ లేదని ప్రజలకు కొత్తదనం ఐస్క్రీమ్ వారి ముందుకు తీసుకురావాలని,ఈ రోలర్ ఫాలోడా ఐస్క్రీమ్ ద్వారా లైవ్లో కస్టమర్స్ ముందేఐస్క్రీమ్ తయారు చేస్తామని చెప్పారు. మాములు ఐస్క్రీమ్ ఫాలోడాతో పోలిస్తే ఈ రోలర్ ఐస్క్రీమ్ ఫాలోడా రుచి ఎంతో బాగుంటుందని వివరించారు. కానీ ఈ రోలర్ ఐస్క్రీమ్ మెయింటేన్స్కొద్దిగా కష్టంగా ఉంటుందని చెప్పారు.

2023-06-08T08:47:02Z dg43tfdfdgfd