చొప్పదండి మార్చి12 : ప్రజలను వేధిస్తున్న వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. వీధికుక్కలు ప్రజలపై దాడి చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో బుధవారం దీకొండ లక్ష్మి, లింగమ్మ, సిర్ర రిషిక, దయ్యాల లస్మయ్య లను కుక్కలు కరవడంతో వారిని కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించారు.
వీధి కుక్కలకు జడిసి చిన్నపిల్లలు బడికి వెళ్లడానికి జంకుతున్నారని, ఇంటి ముందు సేద తీరుతున్న వృద్ధులకు , పిల్లలకు వీధి కుక్కలు ప్రమాదకరంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం తక్షణం ప్రజలకు ప్రమాదకరంగా మారిన వీధి కుక్కలను నిర్మూలించే విధంగా ఉత్తర్వులు జారీ చేసి ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
2025-03-12T13:44:47Z