SUN TRANSIT 2023: ఈ 4 రాశుల అదృష్టాన్ని తిరగరాయనున్న సూర్యుడు, అంతులేని ధనం మీ సొంతం

Sun transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నిర్ణీత సమయంలో గ్రహాలు గోచారం చేసి వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. అందుకే గ్రహాల గోచారానికి చాలా ప్రాధాన్యత, మహత్యముంటాయి. సూర్యుడి మీన రాశి ప్రవేశం 4 రాశులపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం..

Sun transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు నిన్న అంటే మార్చ్ 15న మీనరాశిలో ప్రవేశించాడు. ఏప్రిల్ 14 వరకూ ఇదే గ్రహంలో ఉంటాడు. ఈ సమయంలో 4 రాశులవారికి సూర్యుడు ఊహించని లాభాలుంటాయి. ఏయే రాశులకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం..

మకర రాశి

ఉద్యోగులకు ఈ సమయం చాలా అనువైనది. నిలిచిన ప్రమోషన్లు అందుతాయి. జీతం కూడా పెరుగుతుంది. సిబ్బందితో మంచి సంబంధాలుంటాయి. వ్యాపారంలో మీ విజయం చూసి మీ ప్రత్యర్ధులు ఆశ్చర్యపోతారు. మీ వైఖరి మృదువుగా ఉంటే ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారు. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తులు ఒకరితో మరొకరు సంబంధాలు కొనసాగించాలి. మీ కారణంగా మీ తండ్రికి గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎప్పట్నించో ఉన్న రోగాల్నించి విముక్తి పొందుతారు. 

సింహ రాశి

సింహ రాశి జాతకులకు పెట్టుబడులకు మంచి అనువైన సమయం. బ్యాంకులో జమ చేసిన డబ్బులు వడ్డీతో సహా తిరిగొచ్చినట్టే మీ పెట్టుబడులపై లాభాలు వస్తాయి. రీసెర్చ్ రంగంలో ఉన్న యువకులకు మంచి పరిణామాలుంటాయి. వ్యాపారంలో ఈ సమయంలో పెట్టుబడులు పెడితే..మున్ముందు లాభముంటుంది. భూముల కొనుగోలులో పెట్టుబడి పెట్టవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధిక ఇబ్బందులు ఏవీ ఉండవు. హాయిగా, ప్రశాంతంగా ఉంటారు. 

మీన రాశి

ఈ రాశివారికి చాలా అనువైన సమయం. ప్రణాళికా బద్ధంగా పనిచేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు సక్సెస్ ఉంటుంది. వ్యాపారం విస్తరించే ప్రణాళికలపై పనిచేస్తారు. వైద్య విద్య కోసం సిద్ధమౌతున్నవారికి కష్టపడితే మంచి ఫలితాలుంటాయి. క్రీడా రంగంలో వారికి కలిసొస్తుంది. విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. దీనివల్ల మంచి లాభాలు కలుగుతాయి. గుండెపోటు రోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి.

కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలమైంది. ఆఫీసులో సీనియర్లతో కలిసి పనిచేయడం వల్ల పదోన్నతి అవకాశాలుంటాయి. కాపీ, పుస్తకం, స్టేషనరీ, పిల్లల ఆటబొమ్మలు, స్పోర్ట్స్ సామగ్రి విక్రయించేవారికి బాగుంటుంది. విద్య లేదా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలుంటాయి. కుటుంబంలో పెద్దల కోరికలు నెరవేరుతాయి. వృధా ఖర్చులు తగ్గించాలి. మసాలా తిండి ఆరోగ్యానికి మంచిది కాదు. ఆర్ధికంగా ఏ విధమైన కష్టాలుండవు.

Also read: Lucky Zodiac Sign: ఈ ఐదు రాశుల జాతకులు ఇవాళ్టి నుంచి అత్యంత ధనికులౌతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-03-16T02:16:57Z dg43tfdfdgfd