Sun-Venus And Ketu Conjunction: 18 సంవత్సరాల తర్వాత కన్యా రాశిలో సూర్యుడు, శుక్రుడు, కేతువు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు కూడా జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sun-Venus And Ketu Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాల సంచారాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహ కలయిక, తిరోగమనాలకు కూడా అలాంటి ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే సెప్టెంబర్ నెల గ్రహ కలయికలకు ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఎందుకంటే కన్యారాశిలో సూర్యుడు, శుక్రుడు, కేతువుల కలయిక జరగబోతోంది. ఈ గ్రహాల కలయిక దాదాపు 18 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ మూడు గ్రహాలు శుభస్థానంలో ఉన్న రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి. అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: 18 సంవత్సరాల తర్వాత ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా మేష రాశివారికి అన్ని రంగాల్లో ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేస్తున్నవారికి అధికారుల నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే కెరీర్ జీవితంలో కూడా పురోగతి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఉన్న విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఎలాంటి సమస్యలైనా పరిష్కారమవుతాయి. అలాగే ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
సింహ రాశి: కన్యారాశిలో ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేఆకుండా సంపూర్తిగా ఉన్న ఎలాంటి పనులైనా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఆలోచన శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబ జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే వీరు కొత్త వాహనాలు లేదా ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. పిల్లలకు చదువులపై ఏకాగ్రత కూడా రెట్టింపు అవుతుంది.
కన్యారాశి: ఈ సమయంలో అన్ని రాశులవారికి కంటే కన్యా రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎందుకంటే అన్ని గ్రహాలు ఇదే రాశిలో కలయిక జరపబోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయంలో అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అంతేకాకుండా మతపరమైన అంశాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. దీంతో పాటు సమాజంలో వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే ఎలాంటి పనుల్లోనైనా ఈ సమయంలో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆరోగ్య సంబంధింత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
2024-09-04T06:15:50Z dg43tfdfdgfd