Teachers day Special 2024: అనుకున్నది సాధించాలంటే గురువు ఉండాలి..
ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఉపాధ్యాయులు.. విద్యార్థుల తప్పులను సరిదిద్ది వారి జీవితాలను సన్మార్గంలో నడిపిస్తారు. అందుకే ఉపాధ్యాయులకు ఒక రోజు కేటాయించారు. ఆ రోజే ఉపాధ్యాయ దినోత్సవం. భారత దేశంలో ప్రతేడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుల పని, ప్రాముఖ్యతకు అంకితం చేశారు.
మనుషులు ఏదేదో సాధించాలను కుంటారు. వాటికోసం కలలు కంటారు. కష్టపడాలని అనుకుంటారు. అయినా, అసుకున్నది సాధించేవాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాంటి వాళ్లు దేన్నీ ఎన్ని టికీ సాధించలేరని స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్తారు. ఆ గుర్తులే ఇవీ.