దేశంలో పెద్ద పండుగలలో ఒకటి వినాయకుని పండుగ. అయితే ఈ విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతూ ఉంటారు. దీని వల్ల ప్రధానంగా ఆర్సెనిక్, యాంటీమోని, లెడ్, సీసం ఏర్పడుతుంది. అదే విధంగా షైనింగ్ రావడం కోసం కృత్రిమ సింథటిక్ కలర్స్ ఉపయోగించడం వల్ల నీటిలోని వనరులు నశించిపోతున్నాయి. కాబట్టి మట్టి వినాయకుడే గట్టి వినాయకుడని జన విజ్ఞాన కేంద్ర రాష్ట్ర సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్ రావు లోకల్ 18 ద్వారా తెలియజేశారు.
పర్యావరణ పరిరక్షణ కాపాడడం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా స్వీకరించాలి, ఎందుకంటే భావితరాలకు భవిష్యత్తు మనుగడకు మనందరి మీద ఆధారపడి ఉన్నది. రసాయనాలతో కూడిన వినాయకుల తయారీపై, అలాగే మట్టి వినాయకుడు వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో జన విజ్ఞాన కేంద్ర రాష్ట్ర సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్ రావు చెబుతున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.
విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా 5 రోజులు సెలవులు!
భారత దేశంలో పండుగలో పండుగ అతిపెద్ద పండుగ వినాయకుని పండుగ, కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు విఘ్నాలను తొలగించాలని పూజిస్తారు. అలాగే వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో ఉన్నటువంటి వనరులు నశించిపోతున్నాయని అన్నారు. ఎలాగంటే వినాయకుని తయారీలో వాడేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటిలో కరగడానికి దాదాపు రెండు సంవత్సరాలు వినాయకుడు కరగడానికి పడుతుంది.
రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ ఉన్న మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఉచితంగానే..
దీనివలన నీటికి కార్బన్ డయాక్సైడ్ వెదజల్లుతుంది, ఆక్సిజన్ తక్కువ చేస్తుంది. వీటితో పాటు వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. వీటి వలన నీటిలో ఉన్నటువంటి సమస్త జీవులు మొక్కలు అన్ని నశించిపోతాయని చెప్పారు. చెరువులు, కుంటల ద్వారా వరి సాగు చేస్తున్న రైతులు అవి తిన్న ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. ఎందుకంటే కృత్రిమ రసాయనాలతో చేసిన విగ్రహాలు వల్ల నిమజ్జనం చేయడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలి పర్యావరణం కాపాడాలి, మట్టి వినాయకుడు గట్టి వినాయకుడు అని లోకల్ 18 ద్వారా తెలియజేశారు.
2024-09-04T11:31:48Z dg43tfdfdgfd