భారీ వినాయక ప్రతిమలు తయారు చేసేది ఇక్కడే. గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర, సోలాపూర్ కు చెందిన కళాకారులు అన్నిరకాల మోడల్స్ లో వినాయక ప్రతిమలు, దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి. అతి తక్కువ ధరల్లో అన్నిరకాల మోడల్స్ గణేష్ ప్రతిమలు తయారు చేస్తున్నామని మహారాష్ట్ర కళాకారుడు లక్ష్మణ్ లోకల్18 కి తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో రహదారికి అనుకొని ఉన్న ప్రదేశంలో కళాకార్ ఆర్ట్ ఆధ్వర్యంలో 5ఫీట్ల నుంచి 14ఫీట్ల వరకు మండప నిర్వాహకుల అభిరుచికి అనుగుణంగా సకాలంలో తయారు చేసే పనిలో ఇక్కడి వ్యాపారులు నిమగ్నమయ్యారు. మిగతా దుకాణాలతో పోలిస్తే కళాకార్ ఆర్ట్ వద్ద తక్కువ ధరల్లో వినాయక ప్రతిమలు అందిస్తున్నట్లు కళాకారులు లక్ష్మణ్ తెలిపారు. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడంతో తక్కువ ధరలకు అందించడం సాధ్యమవుతుందని, దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మండప నిర్వహకులు సభ్యులు వచ్చి గణేష్ ప్రతిమలు కొనుగోలు చేస్తున్నారన్నారు. దీనితో అధిక సంఖ్యలో మండప నిర్వహకులు విగ్రహాలు కొనేందుకు రావడంతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది.
గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, సోలాపూర్ కు చెందిన కళాకారులు ఇక్కడ గణేష్ ప్రతిమలే కాకుండా దుర్గామాత ప్రతిమలు కూడా తయారు చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. కేవలం 2నెలలు ఇంటివద్ద ఉంటామని..మిగతా 10నెలలు విగ్రహాల తయారీలో నిమగ్నమవుతామని తెలిపారు. భారీ వినాయక ప్రతిమలు చూసేందుకు, కొనుగోలు చేసేందుకు మండప నిర్వహకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భారీ వినాయక ప్రతిమల ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట ప్రాంతాల నుంచి కూడా వినాయక ప్రతిమలు కొనుగోలు చేసేందుకు సిరిసిల్ల వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి ప్రతిమలకు ఎంత డిమాండ్ ఉందో.. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, సోలాపూర్ ప్రాంతాల నుంచి అత్యుత్తమ కళాకారులను తీసుకువచ్చి వినాయక ప్రతిమలే కాకుండా దుర్గామాత ప్రతిమలు కూడా తయారు చేస్తున్నారు.
2024-09-03T12:31:28Z dg43tfdfdgfd