WATCH: ఇనుప కిటికీలో చిక్కిన పిల్లి తల.. స్థానికులు ఎలా రక్షించారంటే!

న్యూఢిల్లీ: సాధారణంగా వంటింట్లోని పాలు, పెరుగు తినేందుకు పిల్లులు ఇళ్లలోకి చొరబడుతుంటాయి. ఇలా ఒక ఇంట్లోకి దూరిన ఒక పిల్లి ఇనుప కిటికీ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ పిల్లి తల అందులో ఇరుక్కుపోయింది. ఐరన్‌ గ్రిల్‌ నుంచి బయటపడేందుకు అది చాలా ప్రయత్నించింది. మెడకు గాయం కావడంతో ఆ పిల్లి బాధతో అల్లాడిపోయింది. అందులో నుంచి బయటకు రాలేక అరవసాగింది.

కాగా, ఇనుప కిటికీ చువ్వల మధ్య పిల్లి తల చిక్కుకోవడాన్ని స్థానికులు గమనించారు. బాధతో అల్లాడిపోతున్న పిల్లిని రక్షించేందుకు కొందరు ముందుకు వచ్చారు. చాలా జాగ్రత్తగా ఇనుప చువ్వ అంచును కట్టర్‌తో కట్‌ చేశారు. చిక్కుకున్న పిల్లిని బయటకు తీశారు. మెడకు గాయం కావడంతో ఆయింట్‌మెంట్‌ రాశారు. ఆపై ఆ పిల్లితో పాలు కూడా తాగించి విడిచిపెట్టారు.

మరోవైపు కొందరు వ్యక్తులు దీనిని తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేశారు. అవనీష్ శరణ్ అనే వ్యక్తి ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘మానవత్వం బతికే ఉంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఐరన్‌ గ్రిల్‌లో తల ఇరుక్కున్న పిల్లిని కాపాడిన స్థానికుల చొరవను పలువురు ప్రశంసించారు.

Also Read:

Human sacrifice | భార్యకు గర్భస్రావం కాకుండా ఉండేందుకు.. పొరుగింటి బాలికను బలి ఇచ్చిన వ్యక్తి

Puducherry BJP worker | బైకులపై వచ్చి బాంబులు విసిరి.. పుదుచ్చేరి బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు

2023-03-27T14:40:15Z dg43tfdfdgfd