Weekly Horoscope March 27 To 02 April మార్చి మాసం చివరి వారంలో బుధుడు ఉదయించనున్నాడు. అదే సమయంలో గురుడు మీన రాశిలో అస్తమించనున్నాడు. ఈ రెండు శుభ గ్రహాల కదలికతో ద్వాదశ రాశులలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో మేషం, వృషభ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కర్కాటక రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడే చూసెయ్యండి...
మేష రాశి(Aries) వార ఫలాలు..
ఈ రాశి వారికి మార్చి చివరి వారంలో సోమరితనం పెరగొచ్చు. ఈ కారణంగా మీ వ్యాపారం మందగించే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే, మీ ఖాతాలను సరిగ్గా నిర్వహించాలి. ఈ సమయంలో తొందరపాటు లేదా భావోద్వేగ నిర్ణయాలను తీసుకోకండి. ఏదైనా అడుగు వేసే ముందు మీ సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఈ వారం క్లిష్ట పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామి మీకు రక్షణగా నిలుస్తారు. మీరు ఆహారం, పానీయాలపై శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : బ్లాక్ లక్కీ నెంబర్ : 18
Makar Rasi Ugadi Rasi Phalalu 2023-24 ఉగాది తర్వాత మకర రాశి వారికి కెరీర్లో కొత్త అవకాశాలొస్తాయి...!
వృషభ రాశి(Taurus) వార ఫలాలు..
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ వారం కార్యాలయంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రత్యర్థులు మీ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించొచ్చు. ఈ సమయంలో మీ కార్యాచరణ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సీనియర్ వ్యక్తుల సహాయంతో భూమి, ఆస్తికి సంబంధించిన పనులను నిర్వహించడం వల్ల మీ మనసు కుదుటపడుతుంది. ఈ వారంలో వ్యాపారులకు చాలా బాగుంటుంది. మీరు వాడే వాహనాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి.
లక్కీ కలర్ : గ్రే లక్కీ నెంబర్ : 7
మిధున రాశి(Gemini) వార ఫలాలు..
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా బాగుంటుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలొస్తాయి. నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు కెరీర్లో ముందుకు సాగేందుకు మంచి అవకాశాలను పొందుతారు. మీకు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు కోరుకున్న ప్రమోషన్ లేదా కోరుకున్న ప్రదేశానికి బదిలీ పొందొచ్చు. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది. మీకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ వారం, మీ ప్రసంగం ఆధారంగా, మీరు పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. అవివాహితుల వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్ లక్కీ నెంబర్ : 2
కర్కాటక రాశి(Cancer) వార ఫలాలు..
ఈ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ ఓ వ్యక్తి సహాయంతో పూర్తవుతాయి. ఈ వారం మీరు రుణాలు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. మీరు వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలన్నీ పూర్తవుతాయి. పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారికి విజయాలు దక్కుతాయి. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్ లక్కీ నెంబర్ : 4
సింహ రాశి(Leo) వార ఫలాలు..
ఈ రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు ఏదైనా పనికి బాధ్యత వహించడం మానుకోవాలి. లేదంటే తర్వాత మీరే ఆందోళన చెందుతారు. ఏదైనా కుటుంబ సమస్యను పరిష్కరించుకునేటప్పుడు మీ బంధువుల భావాలను విస్మరించడం మానుకోవాలి. ఈ సమయంలో మీరు మీ పనులను సులభంగా చేయగలుగుతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఉత్తమ సహకారం పొందొచ్చు. ఈ కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు పని చేసే రంగంలో సీనియర్లు, జూనియర్ల సహకారం ఉంటుంది. మీరు కొంతకాలం మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే, ఈ వారం మీకు మంచి ఉపశమనం లభిస్తుంది.
లక్కీ కలర్ : గోల్డ్ లక్కీ నంబర్ : 11
కన్య రాశి(Virgo) వార ఫలాలు..
ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కుటుంబానికి సంబంధించిన ఏదైనా పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ బంధాల విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మీ మనసు విచారంగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు. మీ మధ్య అపార్థాలు తొలగిపోయిన వెంటనే మీరు అందరి సహకారాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈ సమయం సానుకూల ఫలితాలొస్తాయి. ప్రేమ జీవితంలో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీ మనస్సు కొద్దిగా ఆందోళన చెందుతుంది.
లక్కీ కలర్ : బ్రౌన్ లక్కీ నెంబర్ : 8
తుల రాశి (Libra) వార ఫలాలు..
ఈ రాశి వారు ఈ వారం ఒంటరితనంతో అనుభూతి చెందుతారు. ఈ వారం మీ నిర్ణయ శక్తి బలహీనంగా ఉండొచ్చు. మీరు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు. ఈ సమయంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే బదులు, దానిని వాయిదా వేయడం మంచిది. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఆందోళన ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే, దాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులు విజయం కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు వేయాలి. అయితే జీవిత భాగస్వామి భావాలను విస్మరించడం మానుకోండి.
లక్కీ కలర్ : రెడ్ లక్కీ నెంబర్ : 14
వృశ్చిక రాశి(Scorpio) వార ఫలాలు..
ఈ రాశి వారు ఈ వారం ఒకే పనిపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ సమయంలో మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు గందరగోళంగా అనిపిస్తే, మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి. మరోవైపు ఉద్యోగులు ఆకస్మిక బదిలీ లేదా ఏదైనా అదనపు బాధ్యతను పొందొచ్చు. ప్రస్తుతం ఏ బాధ్యత వచ్చినా దాన్ని మరింత మెరుగైన రీతిలో నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు కూడా వెళ్ళొచ్చు. మీ ప్రేమ సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీరు మీ ప్రేమ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.
లక్కీ కలర్ : వైట్ లక్కీ నెంబర్ : 17
ధనస్సు రాశి (Sagittarius) వార ఫలాలు..
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ వారం చాలా బాగుంటుంది. మీరు కొత్త ఉపాధి అవకాశాలను పొందడమే కాదు.. పురోగతిని సాధిస్తారు. ఈ వారం, ఏ ప్రయత్నం అయినా పూర్తి అంకితభావంతో చేస్తే, మీకు శుభ ఫలితాలొస్తాయి. వ్యాపారులు ఈ వారం శుభ ఫలితాలను పొందుతారు. మీకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు వారం మధ్యలో ప్రియమైన వ్యక్తిని కలవొచ్చు. ప్రేమ జీవితంలో ఉండే వారి బంధం మరింత బలపడుతుంది. మరోవైపు ప్రేమ ప్రతిపాదనలు చేయాలనుకునే వారికి సానుకూల సంకేతాలొస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్ లక్కీ నెంబర్ : 3
మకర రాశి(Capricorn) వార ఫలాలు..
ఈ రాశి వారికి ఈ వారం వివిధ మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. లేదంటే మీరు నష్టపోతారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి. వ్యాపారులు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఎవరితోనైనా సరదాగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ ప్రత్యర్థులు మీ మాటలతో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు. మీ ప్రేమ జీవితంలో భాగస్వామితో నిజాయితీగా ఉండాలి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ లక్కీ నెంబర్ : 11
కుంభ రాశి(Aquarius) వార ఫలాలు..
ఈ రాశి వారు ఈ వారం తెలియని శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రత్యర్థుల నుంచి కొంత ఇబ్బంది ఉండొచ్చు. వారం మధ్యలో సహోద్యోగుల సహకారం సమయానికి అందడం వల్ల మీ మనసు కుదుటపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఎవరినీ నమ్మడం లేదా ఏదైనా పనిని ఇతరులకు వదిలివేయడం వంటి తప్పులు చేయకండి. పరీక్షల పోటీల సన్నద్ధతలో నిమగ్నమైన విద్యార్థులు విజయం సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో, మీరు మీ ప్రత్యర్థుల నుండి కఠినమైన సవాలును ఎదుర్కోవచ్చు. పని విషయంలో సుదూర లేదా తక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది. ప్రయాణ సమయంలో మీ లగేజీ, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్ లక్కీ నెంబర్ : 16
మీన రాశి(Pisces) వార ఫలాలు..
ఈ రాశి వారు ఈ వారం కొంత దూరం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీరు చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం యువత సరదాగా గడుపుతారు. వారం మధ్యలో మీ ఇంట్లోకి ప్రియమైన వ్యక్తి రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా ఏదైనా వినోద గమ్యస్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు వస్తాయి. వారం చివరి నాటికి పిల్లల పక్షానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఈ వారం చాలా ఉపశమనం పొందవచ్చు. మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తొలగిపోతాయి. మీ ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం ఏర్పడే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్ లక్కీ నెంబర్ :12
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.
Read
and