ZODIAC SIGNS: శుక్ర, శనిల అనుగ్రహంతో ఈ 3 రాశులకు అద్భుత ఫలితాలు!

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర, శని గ్రహాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ రెండింటి కలయిక వల్ల నేడు (మంగళవారం) ఏకం- ఏకాదశ యోగం ఏర్పడనుంది. ఈ యోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.  

శుక్ర, శని గ్రహాలు నేడు (జూన్ 10) శుభప్రదమైన యోగాన్నిఏర్పరుస్తాయి. ఇది కోణీయ యోగం. దీన్ని 'ఏకం-ఏకాదశ యోగం' అంటారు. ఏవైనా రెండు గ్రహాల మధ్య 32.73 డిగ్రీల కోణం ఏర్పడినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది 360 డిగ్రీలలో దాదాపు 1/11వ వంతు. అందుకే దీన్ని 'ఏకం ఏకాదశ యోగం' అంటారు. ఈ యోగం వల్ల 3 రాశుల వారికి మేలు జరుగుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.  

వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్ర, శని గ్రహాల ఈ కలయిక వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు, విదేశీ వనరుల నుంచి ఆదాయం వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభిస్తాయి.

కన్య రాశి వారికి ఈ యోగం కొత్త ప్రాజెక్టుల్లో విజయాన్నిస్తుంది. విశ్లేషణాత్మక సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యాపార ఆలోచనలు ఫలిస్తాయి. ఉద్యోగాలు మారాలనుకునేవారికి ఇది శుభ సమయం. కొత్త ఉద్యోగం లేదా స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

మకర రాశికి అధిపతి శని. ఈ రాశి ఐదవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఈ రాశివారికి మేలు జరుగుతుంది. శుక్ర, శనిల కలయిక ప్రతిభ, ఆలోచనల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం కల్పిస్తుంది. స్టార్టప్‌లు లేదా మీడియా సంబంధిత రంగాల్లో ఈ రాశివారు మంచి విజయం సాధిస్తారు.

2025-06-10T12:19:02Z