అద్భుత శిలాసంపద ఈ వంద స్థంబాల ఆలయం సొంతం.. ఆదరణ కరువై శిథిలావస్థకు

P Mahender, News18, Nizamabad

ఎంతో చ‌రిత్ర క‌లిగిన పురాతన ఆలయం.. అద్భుతమైన శిల్ప‌ సంపద ఆ ఆలయ సొంతం. వరంగల్ వేయి స్తంభాల ఆలయం లాగే ఉన్నవంద‌ స్తంభాల దేవాలయం. అయితేఆ శిల్ప కళా సంప‌ద ఇప్పటికి స‌జీవంగా ఉంది. అయితే, పర్యవేక్షణ లేక‌పోవ‌డంతో వంద స్థంబాల ఆల‌యం శిథిలావస్థకు చేరి ఆసాంఘీక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా మారింది. శిల్పకళా వైభవం భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన పర్యాటక, పురావస్తు శాఖలు చోద్యం చూస్తున్నాయి.. ఇక పర్యాటక కేంద్రాలుగా మారుస్తామంటున్న నేతల మాటలు ప్రచారానికే పరిమితమవుతున్నాయి. వంద స్తంభాల దేవాలయం నిజామాబాద్ జిల్లా (Nizamabad District) బోధన్ పట్టణంలో చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. రాజుల పాలనలో, నవాబుల సర్కారులో చెక్కు చెదరకుండా ఈ వంద స్తంభాల దేవాలయం శిలా సంపద పాలనకు కేంద్ర బిందువుగా నిలిచింది.

ఈ వంద స్తంభాల దేవాలయాన్ని హిందువులు ఇంద్ర నారాయణ ఆలయంగా పిలుస్తుంటారు. బోధన్ ప్రాంతాన్ని 915 నుంచి 927 మధ్య కాలంలో పరిపాలించిన రాష్ట్రకూట చక్రవర్తి అయిన మూడో ఇంద్ర వల్లభుడు తన పేరిట ఈ ఇంద్ర నారాయణ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో గరుడ ధ్వజ ప్రతిష్ఠాపన జరిపినట్లు చరిత్ర చెబుతుంది. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన దండయాత్రలో ఈ దేవాలయం మసీదుగా మార్చబడినట్లు, దాడిలో విగ్రహాలు ధ్వంసమైనట్లు చరిత్ర తెలిసిన‌వారు చెబుతున్నారు. ఈ ఆలయంలో శిల్ప సంపద ఇప్పటికీ సజీవంగా దర్శనమిస్తుంది. శిల్పకళలలోని పద్మాలు, ఏనుగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. బోధన్ కు మిగిలిన గొప్ప కళాఖండంగా వంద స్తంభాల గుడిని పేర్కొనవచ్చు.

ఇది చదవండి: నేటికీ చెక్కుచెదరని రజాకార్ల కాలంనాటి మెట్లబావి.. ఎక్కడ ఉందో తెలుసా..?

పర్యాటక రంగంను అభివృద్ధి చేస్తామని ప్ర‌భుత్వం చెబుతున్నా.. బోధన్ లోని శిలా సంపద గల వంద స్తంభాల దేవాలయం అభివృద్ధి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే నిజామాబాద్ జిల్లాలోని పర్యాటక కేంద్రాలను గుర్తించడంలో భాగంగా వంద స్తంభాల దేవాలయంలో పర్యాటక రంగం వారు గుర్తించారు. బోధన్ బస్టాండ్ కు కిలోమీటర్ దూరంలో ఉద్ మీర్ గల్లిలో గల ఈ ఆలయం రోజురోజుకు ఆనవాళ్లు కోల్పోయి రూపురేఖలు మారిపోతోంది. విగ్రహాలు లేకపోవడంతో ఎవ‌రు ఆటు వైపు వెళ్ల‌డం లేదు. దీంతో పోకిరీల‌కు, ఆసాంఘీక కార్య‌కలాపాకు నిల‌యంగా మారుతుంది. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిన త‌రువాత అయినా అబివృద్దికి నోచుకోలేద‌న్నారు.

ఇది చదవండి: చారిత్రక సౌధం.. ఛార్మినార్ గురించి మీకిది తెలుసా..?

పలుమార్లు పురావస్తు శాఖ అధికారులు సందర్శించి నిధుల కోసం ప్రతిపాదనలు రూపొందించిన నయాపైసా రాలేదు. ఆలనా పాలనా లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్రంలోని పురాత‌న‌ దేవాల‌యాలను అభివృది చేస్తామని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి ఈ వంద స్తంభాల‌ చారిత్రక కట్టడాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాకతీయుల కాలం నాటి 100 స్తంభాల గుడి బోధన్ లో ఉందని బండారు పోశెట్టి అన్నారు. గతంలో సూర్యవంశీయులు పాలించినట్టుగా మా పూర్వీకులు చెబుతున్నారు. అయితే ఈ గుడి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఆలయాలను పునరుద్ధరిస్తుంది. అందులో భాగంగా ఈ 100 స్తంభాల ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

బోధన్ నగరానికి పూర్వము ఏక చక్ర నగరం అని పేరు ఉండేదని ఆచార్యులు చెబుతున్నారు. కాలక్రమేనా బహుధాన్యపురమని.. తర్వాత బోధన్ గా వెలిసింది. పూర్వకాలంలో పాండవులు ఏక చక్ర నగరంలో తిరుగుతూ ఇక్కడదేవాలయాలు స్థాపించారు. అటువంటి దేవాలయాల్లో మహత్తరమైనటువంటి దేవాలయం పూజ గిరి పౌర్ణమి రోజు పాండవులుఇక్కడ ఇంద్ర ఇంద్రాణి అనే ఆల‌యాన్ని స్థాపించినారు. అటువంటి ఇంద్ర ఇంద్రాణి టెంపులు కాలక్రమేణా ఇంద్ర నారాయణ టెంపుల్ గా.. 100 స్తంభాలా దేవాలయంగా పిలుస్తారు. ఈ ప్రాచీనమైనటువంటి దేవాలయంఇప్పుడు శితిలావస్థలో ఉంది. ఈ దేవాలయాన్ని పునర్నిర్మానం చేయాలని కోరుతున్నామని ఆచార్యులు విజ్ఞప్తి చేశారు.

2023-06-07T01:16:37Z dg43tfdfdgfd