ఒంగోలులో అల్లూరయ్య స్వీట్స్ రుచేవేరయా..!

Shaik Salam, News18, Ongole

ఏదైనా శుభకార్యం జరిగితే అక్కడ స్వీట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పూర్వం ఏదైనా శుభకార్యం జరిగితే ఇంట్లోనే స్వీట్లు తయారు చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు స్వీట్స్ అనేది పెద్ద వ్యాపారంగా మారింది. ఐతే రుచిబావుంటే చాలు తయారీదారులకు ఫుడ్ లవర్స్ ఫ్యాన్స్ గా మారుతారు. అలాంటి ఓ స్వీట్స్ షాపే ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలు (Ongole) లో ఉంది. అల్లూరయ్య స్వీట్స్ అని ఎవర్ని కదిలించినా చాలు వారెవా అనాల్సిందే. 90 ఏళ్లుగా అదే రుచి ఈ స్వీట్స్ సొంతం సాధారణంగా ప్రజలు తీసుకొనే ఆహారంలో మిఠాయిలకు సైతం ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏదైనా శుభాకార్యాలలో అయినా, ప్రత్యేక రోజులలో అయినా, మిఠాయిల కొనుగోలు సైతం అధికంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో 90 ఏళ్లుగా ఒంగోలు నగరంలో స్వీట్స్ అంటే అల్లూరయ్య స్వీట్స్ అనే తరహాలో ఈ దుకాణం స్వీట్స్ పేరు గాంచాయి. ఒంగోలు లో 90 ఏళ్ల క్రితం అల్లూరయ్య స్వీట్స్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మైసూర్ పాక్ అంటే విపరీతమైన క్రేజ్. అల్లూరయ్య స్వీట్స్ లో మైసూర్ పాక్ రోజుకు ఒక్కసారైనా రుచి చూడాలి అనే భావన ఇక్కడి ప్రజల్లో ఉంటుంది. అందుకే ఇక్కడి మైసూర్ పాక్ రాష్ట్రాలు దాటి విదేశాలకు సైతం రవాణా అవుతుంది. అంతే కాదు అల్లూరయ్య స్వీట్స్ పేరిట స్థాపించిన అల్లూరయ్య కుటుంబసభ్యులు నేటికీ రుచి, శుచి లో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతూ రాణిస్తున్నారు.

ఇది చదవండి: ఆ ఆలయం నేటికీ కేంద్రం ఆధీనంలోనే..! అక్కడ లెక్కలేనంత సంపద ఉందా..?

కాగా తమ స్వీట్స్ ఇంత మధురంగా ఉండేందుకు ప్రధాన కారణం కల్తీ లేని పదార్థాలను స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తామని, అలాగే కల్తీ లేని నెయ్యిని సైతం తాము ఉపయోగించడమే నన్నారు. తాము 12 రకాల స్వీట్స్ ను తయారు చేయడం జరుగుతుందని, ప్రతి స్వీట్ కొత్త రకం ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. మరి మీరు ఒకసారి అల్లూరయ్య స్వీట్స్ దుకాణానికి వెళ్ళండి.. వెన్నలా కరిపోతున్న స్వీట్స్ రుచి చూడండి.

2023-06-07T07:16:38Z dg43tfdfdgfd