కొత్త స్పర్శ

ఆధారం లేని అనాథ పిట్టలు

మిన్నంటి ఎగరడానికి

ఆసరా పథక రెక్కలనిచ్చి

ఆటుపోట్ల జీవితాన్ని

ఒడ్డుకు చేర్చి

గీతలు పడిన బతుకులను

ఊత కర్రనిచ్చి నిలబెట్టింది

ఎన్నో బతుకుల ఆకలి

మంటలను చల్లార్చి

ఎండిన కడుపులను

నిండుగా నింపి

దండి ధైర్యమైంది

ఏ మైలురాయి కాడో

తప్పిపోయిన సగటు

జీవితాల్ని మలుపు తిప్పి

కొత్త దారిని చూపింది

అలసిన దేహాలకు ఊపిరులూది

ప్రాణాలను నిలబెట్టి

గూడుకట్టుకున్న ఆత్మన్యూనతలను

పారదోలి గుండె దిగులును

తరిమికొట్టి పరోపకారమై

సంక్షేమ ఫలాలు అందించింది

నిలదొక్కుకునే నిచ్చెనై

ఆసరా పథకంతో

కొత్త స్పర్శలద్దింది

తెలంగాణ ప్రభుత్వం

2023-06-02T21:23:40Z dg43tfdfdgfd