ఫస్ట్‌ శాలరీ తీసుకుంటున్నారా? మీరు తప్పక చేయాల్సిన పనులు ఇవే..

చక్కగా చదువుకుని మంచి జాబ్‌లో సెటిల్‌ అవ్వాలని అందరూ కోరుకుంటారు. నచ్చిన కెరీర్‌లో స్థిరపడినా, మరేదైనా ప్రొఫెషన్‌లో అడుగుపెట్టినా ఫస్ట్‌ శాలరీ(First Salary) అందుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మైల్‌స్టోన్‌ లాంటిది. ఇది పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బెస్ట్‌ మూవ్‌మెంట్‌ అని చెప్పవచ్చు. అయితే కొత్తగా వచ్చిన ఈ ఫైనాన్షియల్‌ పవర్‌ను బాధ్యతాయుతంగా హ్యాండిల్‌ చేయాలి.

చాలా మంది వ్యక్తులకు తమ ఫస్ట్‌ శాలరీ అందుకునే సమయానికి.. ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, వైస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, సేవింగ్స్‌ డెసిషన్స్‌ తీసుకునే అవగాహన ఉండదు. తెలిసీ తెలియక మిస్టేక్స్‌ చేసి నష్టపోతుంటారు. అందుకే ఫస్ట్‌ శాలరీ అందుకున్నప్పుడు పవర్‌తోపాటు వచ్చే రెస్పాన్సిబిటీస్‌ను అర్థం చేసుకోవాలి. లాంగ్‌ టర్మ్‌ ఫైనాన్షియల్‌ సెక్యూరిటీ, స్టెబిలిటీ పొందడానికి పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.

* ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌

స్పష్టమైన ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ ఏర్పరచుకోవాలి. భవిష్యత్ ఖర్చులు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని జీతం కేటాయింపును తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. జీతంలో కొంత భాగాన్ని ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులకు కేటాయించాలి.

* సేవింగ్స్‌

చాలా మంది ప్రజలు సేవింగ్స్‌ ప్రాముఖ్యతను గుర్తించినప్పటికీ, కొంతమంది మాత్రమే మొదటి జీతం నుంచి సేవింగ్స్‌ స్టార్ట్‌ చేస్తారు. ఫ్రెషర్‌గా కనీసం మూడు నుంచి ఆరు నెలల లివింగ్‌ ఎక్స్‌పెన్స్‌లకు సమానమైన ఎమర్జెన్సీ కార్పస్‌ను నిర్మించాలి. నెలవారీ జీతంలో దాదాపు 10 శాతం సేవింగ్స్‌కి కేటాయించడం ప్రారంభించాలి. ఈ మొత్తాన్ని ఆదాయం పెరుగుతున్న కొద్దీ క్రమంగా పెంచుకుంటూ పోవాలి.

* ఎక్కువ క్రెడిట్ వద్దు

మొదటి జీతంతో, క్రెడిట్ లిమిట్‌ పరిమితి పెరగవచ్చు, దీంతో పెద్ద లోన్‌లు తీసుకోవచ్చు. అయితే తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడే లోన్‌లను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోన్‌ భారం పెరగకుండా చూసుకోవాలి. సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలమని నిర్ధారించుకున్న తర్వాతే, ముందుకు వెళ్లాలి.

* నిర్లక్ష్య ఖర్చులపై జాగ్రత్త

జీతం అందుకున్న వెంటనే అనవసరమైన ఖర్చులు చేయాలనే కోరికను కంట్రోల్‌ చేసుకోవాలి. అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. కెరీర్ ప్రారంభ దశలో రియల్ ఎస్టేట్ లేదా వెహికల్స్‌ కొనుగోలు చేయడం కంటే లీజుకు తీసుకోవడాన్ని పరిశీలించండి.

ఇది కూడా చదవండి : ఫోన్‌పే కొత్త సేవలు.. అకౌంట్‌ అగ్రిగేటర్ సర్వీస్‌ లాంచ్‌.. సింపుల్‌గా లోన్‌ అప్లై చేసుకోవచ్చు..

* ఇన్సూరెన్స్

ఆర్థిక భద్రతను అందించే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఎంత తక్కువ వయసులో తీసుకుంటే అన్ని ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే పాలసీలు కొనుగోలు చేయడంపై కూడా దృష్టి పెట్టాలి.

మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే సురక్షితమైన, సంపన్నమైన ఆర్థిక భవిష్యత్తుకు పునాది వేయవచ్చు. అవసరాలకు సరిపోయే పర్సనలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ను రూపొందించడానికి ఆర్థిక సలహాదారులు లేదా నిపుణుల గైడెన్స్‌ తీసుకోవడం మంచిది. మొదటి జీతం ఆర్థిక ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. స్మార్ట్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్‌ను ముందుగానే అవలంబిస్తే, లాంగ్‌ టర్మ్‌ ఫైనాన్షియల్‌ సక్సెస్‌ సాధించవచ్చు.

2023-06-07T12:16:44Z dg43tfdfdgfd