వేసవి వస్తే చాలు ఈ గిరిజనులకు ఏకైక ఉపాధి తునికాకు సేకరణ!

(Venu Medipelly, News18, mulugu)

వేసవికాలంలో గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులు తునికాకును సేకరిస్తూ ఉపాధి పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ములుగు జిల్లా లాంటి గిరిజన ప్రాంతంలో తునికాకు సేకరణ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తునికాకు సేకరణవిషయంలో ములుగు జిల్లాలో మొత్తం 28 యూనిట్లను ఏర్పాటు చేశారు.

వాటిలో 290 కల్లాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. తునికాకు లక్ష్యం 23,100 స్టాండర్డ్ బ్యాగుల ఆకును సేకరించాలని అధికారులు నిర్లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటూరు నాగారం ఫారెస్ట్ డివిజన్లో 5 యూనిట్లకు గాను 51 కల్లాలను ఏర్పాటు చేశారు. వెంకటాపురం డివిజన్లో నాలుగు యూనిట్లకు గాను 84 కల్లాలను ఏర్పాటు చేశారు. ములుగు ఫారెస్ట్ డివిజన్లో 10 యూనిట్ల ద్వారా 84 కల్లాలను ఏర్పాటు చేశారు.

ధర పెంచిన ప్రభుత్వం...

తెలంగాణ ప్రభుత్వం తునికాకు ఒక కట్ట ధరకు మూడు రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ధర కేవలం రెండు 2.05 గా ఉండేది. వేసవికాలంలో గిరిజన, గిరిజనేతర కూలీలు అనేకమందితునికాకును సేకరిస్తూ ఉపాధి పొందుతూ ఉంటారు. తూనికాకు సేకరణ కూలీలు రోజు సూర్యుడు ఉదయించక ముందే ప్రారంభమవుతుంది.

తెల్లవారుజామున నాలుగు గంటల సమయం ప్రాంతంలో కొడుకు బువ్వ వండుకొని సద్ది మూటతో ఇంటి నుంచి ప్రయాణం అవుతూ ఉంటారు. అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొలది నడుస్తూ ఈ ఆకును సేకరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వన్యప్రాణులు ఈ కూలీలపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అటవీ ప్రాంతంలో ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉందో ఎవరు ఊహించలేరు. చాలామంది కూలీలను అటవీ పందులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా అటవీ దున్నలు దాడులు చేస్తూ ఉంటాయి.

అయినప్పటికీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ ఆకులు సేకరిస్తూ ఉపాధి పొందుతూ ఉంటారు. సూర్యుడు ఉదయించక ముందు ప్రారంభమైన వీరి రోజు ఉదయం 11 గంటల వరకు పూర్తి అవుతుంది. సేకరించిన ఆకును మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని అటవీ ప్రాంతంలో నడుస్తూ వారి ఇండ్లకు చేరుకుంటారు.

అనంతరం మళ్లీ ఒకసారి భోజన సమయం అనంతరం సేకరించిన ఆకును ఒక కట్టకు 50 ఆకులు ఉండేటట్టు చూస్తూ పాటలు పాడుతూ ముచ్చట్లు పెడుతూ కట్టలు కడుతూ ఉంటారు. 50 ఆకులు గల ఒక కట్టకు తెలంగాణ ప్రభుత్వం మూడు రూపాయలను చెల్లిస్తుంది. కానీ ఆకు సేకరణ కూలీలకు బోనస్ విషయంలో నిరాశ ఎదురవుతుంది. వారికి రావలసిన బోనస్అధికారులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

అంతేకాకుండా డబ్బులు చెల్లింపు విషయంలో బ్యాంకు ఖాతాలలో వేయడం ద్వారా బ్యాంకులో అప్పు ఉంటే వారు ఆ నగదును అప్పు కింద తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మాదిరిగానే నగదును చేతికి ఇస్తే మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వేసవికాలంలో మారుమూల ప్రాంతాలలో ఆకు సేకరణ ఎంతోమందికి ఉపాధిగా ఉంటుంది.

2023-06-03T16:15:18Z dg43tfdfdgfd