‘హరితోత్సవం’

పుడమి తల్లికి పచ్చల హారం

పూనుకుందాం ప్రతి ఒకరం

ప్రకృతిని ప్రాణంగా పరిరక్షించుకుందాం

ప్రగతి పథంలో హరిత యజ్ఞం సాగిద్దాం

హరితోత్సవం సర్వ జనులకు శుభకరం

సకల జీవకోటికి పచ్చని చెట్ల ప్రతిరూపం

ఆరోగ్యాన్ని కాపాడే ఆయుర్వేద ఔషదం

జీవ జంతువుల ప్రాణం నిలుపు అమృతం

మానవ మనుగడ ప్రగతియే పర్యావరణం

భూసారాన్ని పెంచి పచ్చదనం నింపుదాం

విరివిరిగా మొకలను నాటి వనాలను కాంక్షిద్దాం

ధరణిని కాపాడి సుఖంగా జీవిద్దాం

భూమికి సతత హరిత సుగంధం

పచ్చనైన పరిమళాల సంబంధం

మానవాళి సుమనోహర సోయగం

ప్రపంచానికి వృక్షో రక్షతి రక్షితః సుభిక్షణం

2023-06-05T05:39:31Z dg43tfdfdgfd