GUPPEDANTHA MANASU TODAY మార్చి 28 ఎపిసోడ్: తల్లికి దూరంగా మను.. మనసు విప్పి మాట్లాడుకున్న తల్లీకొడుకులు

Guppedantha Manasu March 28 Today Episode: కార్తీకదీపం తొలి భాగానానికి ప్రస్తుతం నడుస్తున్న రెండో భాగానికి సంబంధం ఎలాగైతే లేదో.. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ కూడా జరిగిన కథకి.. ఇప్పుడు జరుగుతున్న కథకి సంబంధం లేదన్నట్టుగానే సాగుతుంది. రిషి జాడ లేనే లేదు. ఇప్పుడంతా మను, అనుపమల చుట్టూనే కథ నడుస్తోంది. ఈరోజు ఎపిసోడ్‌లో ఏమైందంటే.. 

అనుపమని మహేంద్ర ఎన్ని విధాలుగా అడిగినా.. తన భర్త ఎవరు? మనుకి తండ్రి ఎవరు అనే నిజాన్ని మాత్రం చెప్పదు. ఇక మను.. తన తల్లి తనకి దూరంగా ఉండటానికి ఒకే ఒక్క ప్రశ్నే కారణం సార్ ఫిజిల్ ఇచ్చి వదిలిపెట్టేస్తాడు. దాంతో మహేంద్రకి ఆ ప్రశ్న ఏంటనేది అర్ధం అయిపోతుంది. అనుపమ దగ్గరకు వెళ్లి.. మను నన్ను అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు మను దూరం పెట్టడానికి కారణం ఏంటి? నువ్వు చెప్పకపోతే పోనీ నేను చెప్పనా?? నా తండ్రి ఎవరు?? ఇదే కదా మను నిన్ను అడిగిన ప్రశ్న?? అని గట్టిగానే నిలదీయడంతో నిన్నటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ఇక ఈరోజు (మార్చి 28) ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. మను ఇంటికి రావడం ఆలస్యం కావడంతో కంగారు పడుతూ ఉంటుంది పెద్దమ్మ (ఓల్డీ). ఎక్కడికి వెళ్లాడో ఏంటో.. అసలు తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉండగా.. అనుపమ నుంచి ఫోన్ వస్తుంది. ‘ఎలాగ ఉన్నావ్ అమ్మా.. మందులు వేసుకున్నావా? నీకు అక్కడ కంఫర్ట్‌గా లేకపోతే.. ఇక్కడికి వచ్చేయ్ అమ్మా’ అని అంటుంది పెద్దమ్మ. ‘లోకంలో ఎక్కడైనా కంఫర్ట్‌గానే ఉంటాను.. అక్కడ తప్ప’ అని అంటుంది అనుపమ. వాడొచ్చాడా?? ‘వాడంటే ఎవడమ్మా అనుపమా??’

‘నీకు ఇక్కడేం సమస్య వచ్చిందని పెద్దమ్మ అడిగితే.. సమస్య ప్లేస్‌తో కాదు.. అక్కడున్న మనుషులతో’ అని అంటుంది అనుపమ. ‘నేనేం చేశానమ్మా’.. అని పెద్దమ్మ అంటే.. చేసేవాళ్లకి నువ్వు తోడుగా ఉంటున్నావ్ కదా.. ఇంతకీ వాడు వచ్చాడా? అని అంటుంది అనుపమ. వాడా.. వాడంటే ఎవడమ్మా అని కావాలనే అడుగుతుంది పెద్దమ్మ. ‘ఇంకెవడూ.. మనూ.. వాడొచ్చాడా?’ అని అడుగుతుంది అనుపమ. ‘ఇంకా రాలేదు’ అని పెద్దమ్మ చెప్పడంతో.. ‘ఇంకా రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్లాడు? అని ప్రశ్నలు కురిపిస్తుంది అనుపమ.

వాడి గురించే ఆలోచించేట్టు చేస్తున్నాడు పెద్దమ్మా..

ఏమో అనుమమా.. ఎక్కడికి వెళ్లాడో తెలియదు.. ఎక్కడ కూర్చుని బాధపడుతున్నాడో తెలియదు. మనుషులతో తన బాధ చెప్పుకోవడం ఎప్పుడో మర్చిపోయాడు కదా.. చెట్టుకో పుట్టకో చెప్పుకుంటున్నాడేమో.. అయినా నువ్వు వాడి గురించి కొత్తగా అడుగుతున్నావ్ ఏంటి? వచ్చాడా? లేదా? అని అడుగుతున్నావ్.. అసలు నువ్వు తన గురించి పట్టించుకోవ్ కదా? అని అంటుంది పెద్దమ్మ. ‘ఆలోచించేలా చేస్తున్నాడు ఏం చేస్తాం మరి’? ప్రతి ఒక్కరూ నన్ను అదే పనిగా ప్రశ్నిస్తున్నారు. మీరిద్దరూ ఎందుకు దూరంగా ఉంటున్నారని వసుధార, ఏంజెల్, మహేంద్ర, దేవయానిలు నిలదీస్తూనే ఉన్నారు’ అని అంటుంది అనుపమ.

కొడుకుతో కలిసి ఉండొచ్చు కదా అని సలహాలిస్తున్నారు కానీ..

మరి వాళ్లకి ఏం సమాధానం చెప్పావ్ అని పెద్దమ్మ అడిగితే.. ‘నీకు తెలియదా.. నా నుంచి ఏం సమాధానం వస్తుందో.. కొత్తగా అడుగుతున్నావ్ ఏంటి పెద్దమ్మా.. నీ కొడుకుతో కలిసి ఉండొచ్చు కదా.. నీ కొడుకుతో మాట్లాడొచ్చు కదా అని అందరూ సలహాలు ఇస్తున్నారు.. ఎలా ఉండాలనేది నా ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా.. ఎవరో చెప్పారని నేను ఉండలేను కదా.. అయినా దీనంతటికీ నువ్వే కదా కారణం.. వాడ్ని ఇక్కడ నుంచి పంపించేయమని నీకు మందే చెప్పాను.. నువ్వు ఇక్కడికి రప్పించావ్’ అని అంటుంది అనుపమ.

మను సమస్య అనుకుంటే వాడి ప్రాణాలు ఎందుకు కాపాడావు?

నువ్వు ఎందుకు వెళ్లావో వాడూ అందుకే వచ్చాడు. వాళ్ల సమస్యల్ని తీర్చడానికే నువ్వెళ్లావ్.. వాడూ అందుకే వచ్చాడు. నువ్వు చేస్తే రైట్.. వాడు చేస్తే రాంగ్ ఎలా అవుతుంది’ అని అంటుంది పెద్దమ్మ. ‘అవును వాడు సమస్య తీర్చడానికే వచ్చాడు కానీ.. నాకు పెద్ద సమస్యగా మారాడు’ అని అంటుంది అనుపమ. ‘హో.. సమస్య అనుకున్నదానివి నీ ప్రాణాలను అడ్డేసి ఎలా కాపాడావు?’ అని అడుగుతుంది పెద్దమ్మ. ‘కళ్ల ముందు ఓ మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోగలమా? ఆ సమయంలో మనునే కాదు.. ఎవరున్నా అలాగే చేస్తాను’ అని అంటుంది అనుపమ.

సార్ సార్.. అరవొద్దు.. చెప్పడం నా బాధ్యత సార్

ఇక వీళ్ల ముచ్చట్లు ఇలా సాగుతుండగా.. మనుని తీసుకుని వస్తాడు మహేంద్ర. ‘అనుపమా.. మనూ వచ్చాడు.. రారా బయటకు రా’ అని అరుస్తుంటాడు మహేంద్ర. ‘సార్.. సార్.. మేడమ్‌కి మందులు తీసుకుని వచ్చాను.. వాటిని ఇవ్వడానికే వచ్చాను.. అరవొద్దుసార్’ అని అంటాడు మను. ‘ఎందుకొచ్చావ్ అని నేను అడగలేదు కదా మనూ’ అని మహేంద్ర అంటే.. ‘చెప్పడం నా బాధ్యత సార్’ అని అంటాడు మను. ‘నీకు బాధ్యతల గురించి బాగా తెలుసు కాబట్టే.. అందరి పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటావ్.. ఎదుటి వాళ్ల సంతోషమే నీ సంతోషం అని నీకు నువ్వు శిక్ష వేసుకుంటావ్.

కన్నవాళ్ల ప్రేమకి నోచుకోలేని ఈ గొప్పతనం ఎందుకు సార్..

నీ మంచితనం నువ్వు చేసిన సాయం చూసి నీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్లు.. అందుకే వాళ్లకి నీ లాంటి గొప్ప మనసున్న బిడ్డ పుట్టాడని అనుకునేవాడ్ని. ఇప్పుడు నువ్వు మా అనుపమ కొడుకువి అని తెలిసిన తరువాత ఇంకా సంతోషంగా ఉంది’ అని అంటాడు మహేంద్ర. నేను ఎంత గొప్పోడినైనా ఏం లాభం సార్.. కన్న వాళ్ల ప్రేమకి నోచుకోలేకపోయాను’ అని అంటాడు మను. ఇంతలో ఏంజెల్ వచ్చి.. ‘హాయ్ బావా’ అంటూ వరుస కలిపి ప్రేమగా పిలుస్తుంది. ఆ పిలుపుతో మనుతో పాటు.. మహేంద్ర, వసుధారలు విచిత్రంగా చూస్తారు.

ఒక్కసారి మనుని బావా అనమ్మా.. ‘మనూ బావా’..

మను.. ఏంజెల్‌ వైపు కాస్త సీరియస్‌గా చూడటంతో.. ‘సారీ సారీ.. మనూ గారూ మీరు ఎప్పుడొచ్చారు? అత్తయ్యని చూడటానికి వచ్చారా? అని అడుగుతుంది. దాంతో మహేంద్ర.. ‘చూడు ఏంజెల్.. నువ్వు మనుని బావా అని పిలవొచ్చు.. తన నీ మేనత్త కొడుకే కదా.. బావా అంటే తప్పేంలేదు. చెప్పు మనూ.. ఏంజెల్ నిన్ను బావా అని పిలిస్తే నువ్వేమైనా అనుకుంటావా?’ అని అడుగుతాడు మహేంద్ర. ఆ మాటతో ఏంజెల్.. ‘తను ఏమనుకుంటాడనో కాదు సార్.. మా అత్తయ్య ఏమనుకుంటుందో అని బావా అని పిలవడం లేదంతే’ అని అంటుంది ఏంజెల్.

మీ అమ్మకి మేం మందులు ఇవ్వడం ఏంటి? నువ్వే ఇవ్వు..

అంటే మీ అత్తయ్యకి భయపడుతున్నావా? అని మహేంద్ర అంటే.. ‘భయమా?? ఏంటి సార్ మీరు.. ఎవర్ని పట్టుకుని ఏమడుగుతున్నారూ.. భయం మన హిస్టరీలోనే లేదు’ అని అంటుంది ఏంజెల్. హిస్టరీలో ఉందో లేదో తెలియదు కానీ.. దీన్ని మాత్రం భయం అనే అంటారు’ అని పంచ్ పేలుస్తాడు మహేంద్ర. సరే సార్.. మేడమ్‌కి ఈ మందులు ఇవ్వండి.. నేను వెళ్తాను అని అంటాడు మను. ‘ఎక్కడికి వెళ్లేది.. మీ అమ్మతో మాట్లాడుకుండా వెళ్లిపోతావా? ట్యాబ్లెట్స్ మేం ఇవ్వడం ఏంటి? మీ అమ్మకి నువ్వే ఇవ్వు వెళ్లి’ అని అంటాడు మహేంద్ర.

వసుధార హితబోధ.. వెళ్లు మనూ.. నీ తల్లి దగ్గరకు వెళ్లు..

లేదు.. నేను ఇవ్వలేను.. నేను ఆమెను ఫేస్ చేయలేను అని అంటాడు మను. దాంతో వసుధార.. ‘ఎందుకు ఫేస్ చేయలేరు.. మీరు ఏ తప్పూ చేయలేదు. మీ అమ్మకి గాయం అయ్యింది.. మీ మధ్య గొడవలు ఉండొచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన పక్కన మీరు లేకపోతే ఎలా? మీరు మీ తల్లి పక్కనే ఉండాలి’ అని అంటుంది వసుధార. ఆ మాటతో మను.. ‘తల్లి తోడుగా కొడుకు ఉండాలని మీరు అనుకుంటున్నారు.. కానీ ఆవిడ అనుకోవడం లేదు’ అని అంటాడు. ‘ఆవిడ గురించి పక్కన పెట్టు.. నీ తల్లిని చూడాలని నీకు లేదా? అని అంటాడు మహేంద్ర.

భయం భయంగా తల్లి దగ్గరకు మను..

ఏం ఆలోచించొద్దు మను.. ఏ తల్లీ తన బిడ్డను కాదనుకోదు. వెళ్లి ధైర్యంగా మాట్లాడండి అని యుద్ధానికి సిద్ధం చేసినట్టు మనుని గదలోకి వెళ్లడానికి సిద్ధం చేస్తారు మహేంద్ర, ఏంజెల్, వసులు. ఆయుధంగా మందుల్ని చేతిలో పెట్టు.. వెళ్లు మనూ.. నీ తల్లి దగ్గరకు వెళ్లు అనిపంపిస్తాడు మహేంద్ర. మీరు మాట్లాడటం అయిన తరువాత మీరు ఇక్కడే భోజనం చేసి వెళ్లాలని చెప్తుంది వసుధార. ఇక మను.. భయపడుతూనే మందులు తీసుకుని అనుపమ దగ్గరకు వెళ్తాడు. మందులు అక్కడ పెట్టి.. కూర్చోవచ్చా మేడమ్ అని అడుగుతాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T03:38:48Z dg43tfdfdgfd