GAJKESARI YOG IN TAURUS వృషభంలో అరుదైన రాజ యోగాలు.. ఈ 6 రాశుల వారికి ధన లాభం..!

Gajkesari Yog in Taurus జ్యోతిష్యం ప్రకారం, వృషభ రాశిలో ఒకేసారి రెండు రాజ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి భారీగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

Gajkesari Yog in Taurus జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రెండు గ్రహాలు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో కలయిక జరిపినప్పుడు కొన్ని శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 29, 30, 31 వృషభ రాశిలో గురుడు, కుజుడు, చంద్రుడు కలయిక జరపనున్నారు. ఈ సమయంలో చంద్రుడు, గురువు కలయిక కారణంగా గజకేసరి రాజ యోగం ఏర్పడనుంది. మరోవైపు చంద్రుడు కుజుడి సంయోగం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడనుంది. ఇలా ఒకే రాశిలో రెండు శుభ యోగాలు ఏర్పడటం వల్ల మేషం, మకరంతో సహా ఈ రాశుల వారికి కనకవర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...మేష రాశి(Aries)..

ఈ రాశి వారికి వృషభంలో రెండు శుభ యోగాలు ఏర్పడటం వల్ల ఆదాయ పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మీకు ఆకస్మిక ధన లాభం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు అంచనాలకు మించి జీతాలు పెరగొచ్చు. మీ వ్యాపారంలో భారీగా లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

వృషభ రాశి(Taurus)..

ఈ రాశిలో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడటం వల్ల భారీగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి డిమాండ్ పెరుగుతుంది. మీకు ఉన్నత స్థాయి పరిచయాలు పెరుగుతాయి. మీకు విదేశాల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు.

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారికి రెండు శుభ యోగాల కారణంగా ఏ రంగంలో అయినా తిరుగనేదే ఉండదు. అష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలొస్తాయి. మీరు ఆస్తులు కొనే అవకాశం ఉంది. మీకు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు పరిచయాలు పెరుగుతాయి. మీరు తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు పొందుతారు.

కన్య రాశి(Virgo)..

ఈ రాశి వారికి రెండు శుభ యోగాల కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీకు ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి ఫలితాలను పొందుతారు. విదేశీ ఉద్యోగానికి సంబంధించి మంచి ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదురుతుంది. మీరు ఆశించిన శుభవార్తలు వింటారు.

మకర రాశి(Capricorn)..

ఈ రాశి నుంచి ఐదో స్థానం నుంచి రెండు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. వ్యాపారులకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. మీకు బంధు మిత్రులతో వివాదాలన్నీ ముగిసిపోతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే మీ కల నెరవేరుతుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి.గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Astrology News and Telugu News

వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి నుండి ఏడో స్థానంలో శుభ యోగాలు ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో గొడవలన్నీ సద్దుమణుగుతాయి. మీకు భూ సంబంధిత ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో సానుకూల ఫలితాలొస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లొస్తాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-24T07:32:36Z dg43tfdfdgfd