SHUKRA GOCHAR 2024 పదేళ్ల తర్వాత మీనంలో త్రికోణ రాజయోగం.. ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనం..!

Shukra Gochar 2024 జ్యోతిష్యం ప్రకారం, మార్చి 31వ తేదీన శుక్రుడు కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కేంద్ర త్రికోణ యోగం ఏర్పడటంతో కొన్ని రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.

Shukra Gochar 2024 వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సంపదకు, ఆనందం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే శుక్రుడు మార్చి 31వ తేదీన మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. మాళవ్య యోగంతో పాటు త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా ఏప్రిల్ నెలలో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభం కలగనుంది. దీంతో పాటు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...మిధున రాశి(Gemini)..

జ్యోతిష్యం ప్రకారం, మీన రాశిలో ఏర్పడే శుభ యోగాల వల్ల మిధున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే పనుల్లో, వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. మీ కెరీర్ పురోగతికి గొప్ప అవకాశం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు పూర్తవుతాయి. వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొత్త ఒప్పందాలను చేసుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో మీకు మంచి లాభాలొస్తాయి. ఈ సమయంలో మీ తండ్రితో అనుబంధం బాగుంటుంది.​Rahu-Venus Conjunction in Pisces మీనంలో రాహువు-శుక్రుని కలయిక.. ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం..!

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగం, వ్యాపారాల కారణంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఈ కాలంలో శుభ ఫలితాలొస్తాయి. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొనొచ్చు.

కన్య రాశి(Virgo)..

ఈ రాశి వారికి శుక్రుడి స్థానం మారడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి నుంచి ఏడో స్థానంలో మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి, వైవాహిక జీవితం గడుపుతున్న వ్యక్తులకు మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందొచ్చు. కార్యాలయంలో మీరు మంచి విజయాలు సాధించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.

ధనస్సు రాశి(Sagittarius)..

ఈ రాశి నుంచి మీనరాశిలోకి శుక్రుడు నాలుగో స్థానం గుండా సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. త్వరలో మీరు కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. రాజకీయ రంగంలో పని చేసే వారికి పెద్ద పదవులు దక్కుతాయి. మీరు కుటుంబం, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు.

కుంభ రాశి(Aquarius)..

ఈ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. కుంభ రాశి వారు ఈ సమయంలో ఆకస్మిక సంపదను పొందొచ్చు. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. శుక్రుని రాజయోగం ఫలితంగా మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది.గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Astrology News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-27T07:06:06Z dg43tfdfdgfd