WEEKLY HOROSCOPE ఈ వారం అక్షయ తృతీయ, లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశులకు రెట్టింపు లాభాలు..!

Weekly Horoscope 06 To 12 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారం అక్షయ తృతీయ, లక్ష్మీ నారాయణ రాజ యోగం, బుధాదిత్య యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆదాయ పరంగా రెట్టింపు లాభాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి.

Weekly Horoscope 06 To 12 May 2024 జ్యోతిష్యం ప్రకారం, ఈ వారం మేష రాశిలో బుధుడు సంచారం చేయడంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. మే 10వ తేదీన బుధుడు శుక్రుడితో కలయిక జరపడంతో ఈ శుభ యోగం ఏర్పడనుంది. ఇదే సమయంలో అక్షయ తృతీయ పండుగ కూడా రావడం వల్ల ఈ వారానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు సూర్యుడితో కలిసి బుధుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఇలా రెండు రాజయోగాల వల్ల కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి వ్యాపారంలో రెట్టింపు లాభాలు రానున్నాయి. ఉద్యోగులు తాము పని చేసే రంగంలో శుభవార్తలను వింటారు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడే చూసెయ్యండి...1

2

మిధున రాశి(Gemini) వార ఫలాలు..

ఈ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలొస్తాయి. మీరు చేసే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ పెట్టుబడులను చూసి కొంత ఆందోళన చెందుతారు. మీకు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారం చివర్లో పరిస్థితులు మెరుగుపడతాయి. మీ జీవితంలో సంతోషంగా ఉంటుంది.లక్కీ కలర్ : గ్రీన్లక్కీ నెంబర్ : 10

కర్కాటక రాశి(Cancer) వార ఫలాలు..

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ వారం కార్యాలయంలో పురోగతి లభిస్తుంది. మీరు భాగస్వామ్యంతో చేసే పని వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరస్పర విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. మీరు చేసే ప్రయాణాల వల్ల లాభదాయక ఫలితాలొస్తాయి. మీ మనసులో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతారు. ఈ కారణంగా మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.లక్కీ కలర్ : బ్రౌన్లక్కీ నెంబర్ : 8

సింహ రాశి(Leo) వార ఫలాలు..

ఈ రాశి వారికి ఈ వారం తాము చేసే పనుల్లో పురోగతి లభిస్తుంది. వారం ప్రారంభంలో ఏదైనా కొత్త ప్రాజెక్టు గురించి కొంత ఆందోళన చెందుతారు. మీరు ధైర్యం చేసి అడుగులు ముందుకు వేస్తే మంచి ఫలితాలొస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో ఆకస్మిక విజయం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే ప్రయాణాల వల్ల లాభదాయకంగా ఉంటుంది. వారం చివర్లో మీ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండకపోతే గొడవలు పెరిగే అవకాశం ఉంది.లక్కీ కలర్ : గ్రేలక్కీ నెంబర్ : 1

కన్య రాశి(Virgo) వార ఫలాలు..

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవాలు ఉంటాయి. డబ్బుకు సంబంధించి మీరు కొంత ఇబ్బంది పడొచ్చు. కొన్ని వివాదాల కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణం వల్ల ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. వారం చివర్లో మహిళా స్నేహితుల సహకారంతో సుఖశాంతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.లక్కీ కలర్ : గోల్డ్లక్కీ నెంబర్ : 6Gaja Lakshmi Raj Yog 2024 వృషభంలో గజలక్ష్మీ రాజయోగం.. ఈ 6 రాశులకు జాక్‌పాట్ ఖాయం..!

తులా రాశి (Libra) వార ఫలాలు..

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత కష్టపడాల్సి వస్తుంది. ఈ వారంలో మీరు చేసే ప్రయాణాల ద్వారా మంచి విజయాలు సాధించొచ్చు. ఈ వారంలో యువత కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. మీ కుటుంబంలో ఏదైనా కొత్త ప్రారంభం గురించి మీరు విచారంగా ఉంటారు. వారం చివర్లో, భవిష్యత్తులో సానుకూల మార్పులొచ్చే అవకాశాలుంటాయి.లక్కీ కలర్ : ఆరెంజ్లక్కీ నెంబర్ : 10

వృశ్చిక రాశి(Scorpio) వార ఫలాలు..

ఈ రాశి వారు ఈ వారం తాము పని చేసే ప్రాజెక్టులలో చాలా బిజీగా ఉంటారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరంగా పురోగతి లభిస్తుంది. ఈ వారం మీరు కొత్త పెట్టుబడులు పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ వారం మీరు చేసే ప్రయాణం ద్వారా మంచి విజయాలను సాధిస్తారు. వారం చివర్లో మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.లక్కీ కలర్ : పర్పుల్లక్కీ నెంబర్ : 3

ధనస్సు రాశి (Sagittarius) వార ఫలాలు..

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ప్రయాణాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. మీరు కొత్త ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకోవచ్చు. పనిలో మీ ప్రాజెక్టు గురించి చాలా పొసెసివ్‌గా ఉండటం వల్ల జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయి. ఈ వారం అధిక ఒత్తిడి కారణంగా, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఈ విషయంలో శ్రద్ధ అవసరం.లక్కీ కలర్ : రోజ్లక్కీ నెంబర్ : 12

మకర రాశి(Capricorn) వార ఫలాలు..

ఈ రాశి వారికి ఈ వారం జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. మీరు చేసే పనిలో మెరుగైన ఫలితాలొస్తాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మీరు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వారం చివర్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, మీరు వాటిని అధిగమిస్తారు.లక్కీ కలర్ : రెడ్లక్కీ నెంబర్ : 4

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T06:12:08Z dg43tfdfdgfd