రాశిఫలాలు 28 ఏప్రిల్ 2024: ఈరోజు మేషం, కర్కాటకంతో సహా ఈ 5 రాశులకు సూర్య భగవానుడి అనుగ్రహం..!

horoscope today 28 April 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మేషం, కర్కాటకం, సింహంతో సహా ఈ రాశులకు శివ యోగం, సూర్య దేవుని అనుగ్రహం లభించనుంది.. మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...

horoscope today 28 April 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సిద్ధి యోగం, శివ యోగం ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే, మంచి రాబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరిగినా మ్యానేజ్ చేసుకోవచ్చు. మీ పనులన్నింటినీ సులభంగా పూర్తి చేస్తారు.ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు తల్లి పార్వతీ దేవిని పూజించాలి.​Gajkesari Raj Yog 2024 గజకేసరి రాజ యోగం వేళ ఈ 5 రాశులకు తిరుగనేదే ఉండదట..!

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త సంబంధాలను ప్రారంభించే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించొచ్చు. మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. విద్యార్థులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు బలోపేతం అవుతారు. మీ డబ్బులను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి చాలా సమయం పట్టొచ్చు. మీరు ఓపికగా, స్థిరంగా పని చేయాలి. ఈరోజు మీ అయోమయ భావజాలంతో వ్యవహరించాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ శరీర భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ పనిపై దృష్టి పెట్టడంతోపాటు, మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి కూడా ప్రయత్నించాలి. మీ వ్యాపారం లేదా పని ద్వారా మీ లక్ష్యాలను సాధించడానికి మీరు నిరంతర ప్రయత్నాలు చేయాలి. ఈరోజు మీరు చదువు లేదా విద్యా రంగంలో విజయం పొందొచ్చు. మీ జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి రావొచ్చు. మీరు మీపై నమ్మకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువు ఆలయంలో పప్పు, బెల్లం సమర్పించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు సిద్ధి యోగం వల్ల శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ శత్రువులు మీరు చేసే పనులను అడ్డుకోవడానికి అధిగమించేందుకు ప్రయత్నించినా.. మీరు సులభంగా విజయం సాధిస్తారు. మీ తెలివితేటలు, ధైర్యంతో ప్రతి విషయంలోనూ మెరుగుపరచుకోవచ్చు. ఈరోజు మీరు కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు.ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు శివ యోగం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయి. మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు చేసే పనుల్లో మంచి విజయాలు సాధిస్తారు. సూర్య భగవానుడి సాయంతో మీ వ్యాపారాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థిక లాభాల కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువుకు లడ్డూలను సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మకూడదు. ఈరోజు మీరు ప్రతిదానిపై మీ స్పందన చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండటం ద్వారా కుటుంబ వివాదాలను నివారించొచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. లేకపోతే మీ పని చెడిపోవచ్చు. ఈరోజు మీ ఖర్చులు పెరగొచ్చు. దీని వల్ల మీకు డబ్బు కొరతగా అనిపించొచ్చు. అందుకే మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి.ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు విష్ణువును పూజించాలి.​Akshaya Tritiya 2024 ఈసారి అక్షయ తృతీయ వేళ ధన యోగంతో సహా ఐదు శుభ యోగాలు.. ఈ 7 రాశులకు డబ్బే డబ్బు..!

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు చేసే పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరినీ నమ్మకూడదు. ఈరోజు మీరు ప్రతిదానిపై మీ స్పందన చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా, బాధ్యతగా ఉండటం ద్వారా మీ కుటుంబంలో వివాదాలను నివారించొచ్చు. కోపం మీ పనిని పాడు చేస్తుంది. కాబట్టి మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. మీకు ఇష్టమైన అభిరుచిలో కొంత సమయం గడపడానికి కూడా మీరు సమయాన్ని పొందొచ్చు.ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు సమర్పించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరగొచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులకు కారణమవుతుంది. పనికి సంబంధించి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాలి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు చాలా మంచిది. మీరు ఒకరితో ఒకరు ప్రేమలో ఉంటారు. ఈరోజు మీ ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. ఈ కారణంగా మీకు డబ్బు కొరత ఏర్పడొచ్చు. అందువల్ల మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి.ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు జీవితంలో కొన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ప్రతిదానికీ ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. బదులుగా మీరు ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ కుటుంబంతో వివాదాలను నివారించడానికి ప్రయత్నించాలి. మీ కోపం మీ పనిని పాడు చేస్తుంది. మీ ఖర్చులపై ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీరు డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో మానసికంగా దృఢంగా ఉండాలి. మీకు ఇష్టమైన అభిరుచిని కొనసాగించడంలో కొంత సమయం గడపడం మీకు విశ్రాంతిని పొందడంలో సహాయపడుతుంది. విద్యార్థులు ఈరోజు విశ్రాంతి తీసుకోవాలి.ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు రాత్రి నల్ల కుక్కకు చివరి రోటీ తినిపించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. ఈరోజు మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ సంపదను పెంచుకోవడానికి మీరు ప్రశ్నలను ఎదుర్కోవలసి రావొచ్చు. మీ వ్యాపారం విజయవంతం కావడానికి చాలా కష్టపడాలి. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ జీవితంలో విజయం సాధించడానికి మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి.ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు శని దేవుడికి తైలం సమర్పించాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-27T18:54:14Z dg43tfdfdgfd