విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే!

విశాఖపట్నం తీరంలో అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు దొరికాయి. ఈ జీవులను ‘పఫర్‌ ఫిష్‌’ అని పిలుస్తారని.. స్థానిక జాలర్లు సముద్ర కప్పలని అంటారని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్‌ పి శ్రీనివాసరావు తెలిపారు. సాగర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ జీవులు వలలో చిక్కుకున్నప్పుడు, దాడికి గురైన సమయంలో.. తమను తాము రక్షించుకునేందుకు ఇలా బెలూన్ల తరహాలోకి మారుతుంటాయని చెబుతున్నారు. ఈ చేప చూడటానికి కాస్త మనిషిలా ఉంది.

మరోవైపు గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి గ్రామానికి చెందిన అనిల్‌ అనే మత్స్యకారుడు గుండ్లకమ్మ జలాశయంలో వల వేశారు. వల బయటకు తీసేందుకు ప్రయత్నించగా చాలా బరువుగా ఉంది. బయటకు తీసి చూడగా అందులో మొసలి చిక్కుకొని ఉంది.. అప్పటికే అది చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న అటవీ, మత్స్యశాఖ అధికారులు వచ్చి పరిశీలించారు. అటవీ శాఖ అధికారి శశిభూషణ్‌ మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అద్దంకి, కొరిశపాడు మండలాల్లో గుండ్లకమ్మ జలాశయం బ్యాక్‌వాటర్‌ ఎక్కువ గ్రామాల్లో ఉంటుందని, సంబంధిత గ్రామాల్లోని రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T03:26:40Z dg43tfdfdgfd